MIFF banner

ఎంఐఎఫ్ఎఫ్ 2026 కు సరికొత్త అంతర్జాతీయ దృక్పథాలను పరిచయం చేసిన ఫ్రెంచ్ యువ దర్శకులు


యువ చలనచిత్ర దర్శకులకు ఎంఐఎఫ్ఎఫ్ ఒక అద్భుతమైన అవకాశం: ఫ్రెంచ్ దర్శకురాలు ఫేజే కరీంపూర్

ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సరికొత్త సినిమా ప్రతిభను ప్రోత్సహించే క్రమంలో 19వ ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2026లో ఫ్రాన్స్ దేశపు ప్రముఖ జాతీయ చలనచిత్ర పాఠశాల ‘లా ఫెమిస్’కు చెందిన ఏడు చిత్రాలను ప్రత్యేకంగా ప్రదర్శించారు. చలనచిత్రోత్సవంలోని “ఎమర్జింగ్ వాయిసెస్: ఫిల్మ్ స్కూల్ ఎడిషన్స్” విభాగం కింద ప్రదర్శించిన ఈ సినిమాలుతదుపరి తరానికి చెందిన ఫ్రెంచ్ దర్శకుల అద్భుతమైన సృజనాత్మకతను,  సరికొత్త ఆలోచనా విధానాన్ని ఇక్కడి ప్రేక్షకులకు పరిచయం చేశాయి.

జూలై 17న ప్రదర్శితమైన ఈ చిత్రాలు వైవిధ్యంఆవిష్కరణలుకళాత్మక నైపుణ్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రపంచంలోనే అత్యంత గొప్ప చలనచిత్ర సంస్థల్లో ఒకటిగా ‘లా ఫెమిస్’ ఎందుకు నిలిచిందో ఈ చిత్రాలు నిరూపించాయి. ఈ ప్రదర్శనలో భాగంగా ఎంపిక చేసిన చిత్రాల్లో ఫేజ్ కరీంపూర్ దర్శకత్వం వహించిన ఎనిమిది నిమిషాల లఘు చిత్రం ‘ది అవేకనింగ్’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా ఒక చిన్న బాలుడు తన పాఠశాల వార్షికోత్సవ ముగింపు వేడుకల్లో భాగంగా వేదికపైకి వెళ్లబోతున్న కథను చెబుతుంది. స్టేజ్ ఎక్కడానికి సిద్దమతున్న పిల్లావాడిలో తీవ్రమైన భయం పట్టుకుంటుంది. ఆ భయంలో తను వేసుకున్న దుస్తులపై మరకలు పడతాయి. దాంతో ఆ తప్పును సరిదిద్దుకోవడానికిఎవరికీ కనిపించకుండా ఆ బాలుడు అక్కడి నుండి పారిపోతాడు. అలా భయంతో అతడు స్కూల్ లోపలబయట చేసే ప్రయాణం.. అతని జీవితంలో ఒక సరికొత్త పరిణామ క్రమానికి దారితీస్తుంది. ఆ ప్రయాణంలో ఎదురైన అనుభవాలు అతనికి నెమ్మదిగా కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి ఇస్తాయి. 

చిత్ర ప్రదర్శన అనంతరం ఎన్‌ఎఫ్‌డీసీ  ఫిల్మ్ ఫెస్టివల్స్ ఆర్టిస్టిక్ డైరెక్టర్ శ్రీ పంకజ్ సక్సేనా చేతుల మీదుగా దర్శకురాలు ఫేజ్ కరీంపూర్‌ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాము ఫ్రాన్స్‌లో చదువుకోవడానికి ముందు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో విజువల్ ఆర్ట్స్ రంగంలో ఉండేవారమని తెలిపారు. ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం వంటి పెద్ద వేదికపై తమ సినిమా ప్రదర్శితం కావడం తనలాంటి యువ దర్శకులకు లభించిన అద్భుతమైన అవకాశమని హర్షం వ్యక్తం చేశారు. ఫ్రాన్స్‌కు చెందిన యువ చలనచిత్ర నిర్మాతలకు ఇంతటి గొప్ప వేదికను కల్పించినందుకు ఆమె ఎంఐఎఫ్ఎఫ్ నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

తమారా విట్టోజ్ దర్శకత్వం వహించిన బౌల్ కట్ లఘు చిత్రం హాస్యం శైలిలో సాగుతుంది. పెద్దల మధ్య వచ్చే గొడవలు పిల్లల మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావం చూపుతాయివాటిని పిల్లలు తమ భావోద్వేగాలతో ఎలా ఎదుర్కొంటారుఅనే అంశాన్ని ఒక చిన్నారి దృఢ సంకల్పం ద్వారా అత్యంత సహజంగాసున్నితమైన హాస్యంతో ఈ సినిమాలో చూపించారు. 

ఎమిలియన్ పిచోన్ రూపొందించిన 15 నిమిషాల నిడివి గల యానిమేషన్ సినిమా ‘మాక్స్’.. పిల్లల్లో ఉండే సహజమైన కుతూహలాన్నిఉత్కంఠమిస్టరీతో ముడిపెడుతూ అద్భుతంగా సాగుతుంది. లిల్లీ బెల్బెజ్ దర్శకత్వం వహించిన 24 నిమిషాల నిడివి గల ఈ లఘు చిత్రం ‘మై ఇంటర్నెట్ కంట్రీసైడ్’.. ప్రస్తుత డిజిటల్ యుగంలో మనుషుల మధ్య ఉండే ఒంటరితనంస్నేహంనేటి తరం డిజిటల్ సంబంధాలను ఎంతో లోతుగా ఆవిష్కరించింది. 

ఈ ప్రదర్శనలో టామీ బౌలెట్వాలెంటిన్ నోయెల్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ‘నాట్ టు డై అలోన్’ ఈ లఘు చిత్రం మనుషుల గుర్తింపుసామాజిక పరిస్థితులు మనుషులను ఎలా ప్రభావితం చేస్తాయనే అంశాలను ఎంతో లోతుగాఆలోచనాత్మకంగా ప్రతిబింబించింది.  మౌడ్ వుయిలెజ్ రూపొందించిన ‘సైన్స్ ఫ్రమ్ బిలో’ యానిమేషన్ డాక్యుమెంటరీ వినికిడి శక్తి ఉన్న ఈ ప్రపంచంలో ఒక చెవిటివాడిగా పెరిగే క్రమంలో ఎదురయ్యే ఇంద్రియ అనుభవాలను ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లు చూపించింది. ఇందులో నీటి అడుగున ఉండే నిశ్శబ్దాన్ని ఒక విభిన్నమైన వినికిడి విధానానికి ప్రతీకగా అద్భుతంగా వాడుకున్నారు. జూలియట్ గౌడిన్ దర్శకత్వం వహించిన స్టిల్ వాటర్స్ చిత్రం లూసిల్ అనే నర్సు జీవితం చుట్టూ తిరుగుతుంది. ఆసుపత్రి వాతావరణంలో ఉండే అధికార గర్వాన్ని తట్టుకుంటూనే.. రోగులకు అందించే సేవా విధానాలను ఆమె ఎలా సరికొత్తగా మార్చుకుందనే కథాంశంతో ఈ సినిమా సాగుతుంది. 

ఈ చిత్రాల ప్రదర్శనకు సినీ ప్రేమికులువిద్యార్థులుసినీ రంగ ప్రముఖుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఫ్రాన్స్ దేశానికి చెందిన ఈ యువ చలనచిత్ర దర్శకుల భాగస్వామ్యం ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి సరికొత్త ఉత్తేజాన్ని తీసుకువచ్చింది. ఈ వేదిక ద్వారా ఫ్రెంచ్ యువ దర్శకులకు భారతీయ చలనచిత్ర దర్శకులువిద్యార్థులుప్రేక్షకుల మధ్య చలనచిత్ర రంగంపై ఎంతో అర్థవంతమైన సంభాషణలకు అవకాశాలను కల్పించింది.

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #MIFF2026. Tag us @pibmumbai on X, and we'll help spread your passion! For journalists, bloggers, and vloggers wanting to connect with filmmakers for interviews/interactions, reach out to us at miff.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


रिलीज़ आईडी: 2274925   |   Visitor Counter: 11