MIFF banner

వారసత్వం నుంచి ఆశాభావం దాకా: 19వ ముంబయి ఫెస్టివల్‌లో భారత బహుముఖ ప్రతిష్టను ఆవిష్కరిస్తున్న వర్ధమాన చిత్ర దర్శకులు


సంస్కృతి.. సమాజం.. పరిణామశీల కథలకు భారత్‌లోని బహుళ ప్రపంచ వర్ణాలను అద్దుతూ ‘ఎంఐఎఫ్‌ఎఫ్‌’లో యువ దర్శకుల ప్రతిభా ప్రదర్శన

  ముంబయిలో నిర్వహిస్తున్న 19వ ‘ఎంఐఎఫ్‌ఎఫ్‌’లో యువ చిత్ర దర్శకుల దృక్కోణంతో ప్రపంచాన్ని వీక్షించే అవకాశాన్ని “ఎమర్జింగ్ వాయిసెస్: ఫిల్మ్ స్కూల్ ఎడిషన్” విభాగం ప్రేక్షకులకు కల్పిస్తోంది. దీనికింద ఫ్రాన్స్, జర్మనీలలోని ప్రసిద్ధ ఫిల్మ్ స్కూల్స్ చిత్రాలు సహా ఈశాన్య ప్రాంతంతోపాటు భారత్‌లోని వివిధ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ల నుంచి 27 చిత్రాలను  ప్రదర్శిస్తున్నారు. భారత ప్రజానీకం, సంస్కృతులు, అనుభవాల విస్తృత, సుసంపన్న  వైవిధ్యాన్ని ఈ చిత్రాలన్నీ ప్రతిబింబిస్తాయి. అలాగే... గుర్తింపు, సంస్కృతి, కుటుంబం, సామాజిక సమస్యలు, ఆశాభావం, మానసిక దృఢత్వం, మానవ సంబంధాలు వంటి వివిధ భావోద్వేగాలను కూడా ఇవి స్పృశిస్తాయి. వేడుకలు కొనసాగినన్ని రోజులూ ఈ చిత్రాలను ప్రదర్శిస్తారు.

ఈ విభాగం కింద పుణెలోని ఫిల్మ్ అండ్‌ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి 4, కోల్‌కతాలోని సత్యజిత్ రే ఫిల్మ్ అండ్‌ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ నుంచి 3, తమిళనాడులోని ఆరోవిల్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నుంచి 4, కటక్‌లోని బిజూ పట్నాయక్ ఫిల్మ్ అండ్‌ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి 1, అస్సాంలోని డాక్టర్ భూపేన్ హజారికా రీజినల్ గవర్నమెంట్ ఫిల్మ్ అండ్‌ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ నుంచి 2, అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నుంచి 3, కర్ణాటకలోని ఆర్‌.వి.యూనివర్సిటీ నుంచి 4, రోహ్‌తక్‌లోని దాదా లక్ష్మీ చంద్ స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ పెర్ఫార్మింగ్ అండ్‌ విజువల్ ఆర్ట్స్ నుంచి 3, ముంబయిలోని విజ్లింగ్ వుడ్స్ ఇంటర్నేషనల్ నుంచి 3 వంతున చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఇవన్నీ దేశంలోని వేర్వేరు ప్రాంతాల వైవిధ్యాన్ని, కథలను ప్రేక్షకుల కళ్లకు కడతాయి.

స్థానిక సంప్రదాయాలు, సంస్కృతి, తరతరాలుగా సంక్రమించిన జ్ఞాన పరిరక్షణకుగల  ప్రాధాన్యాన్ని కొన్ని ప్రముఖ చిత్రాలు ప్రస్ఫుటం చేస్తాయి. వీటిలో ‘ఎఫ్‌టీటీఐ’ రూపొందించిన “ఇన్ సెర్చ్ ఆఫ్ స్టోన్” చిత్రం ప్రాచీన ప్రదేశాలతో ప్రజలకుగల అనుబంధాన్ని అన్వేషిస్తూ, వాటి పరిరక్షణ ఆవశ్యతను ఉత్తేజితం చేస్తుంది. అలాగే, ‘ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐ’ రూపొందించిన “బ్లాక్ క్లే” (ఖివ్ రామెవ్) చిత్రం సంప్రదాయ చేతివృత్తులను, భవిష్యత్తు కోసం వాటిని పరిరక్షించాల్సిన అవసరాన్ని ప్రముఖంగా చాటుతుంది.

కొన్ని చిత్రాలు రోజువారీ జీవితంలోని సవాళ్లను పరిశీలిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు ప్రజలను ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోకి, కష్టమైన నిర్ణయాలవైపు నెడతాయో ‘ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐ’ తీసిన “దుర్జోగ్” చిత్రం తెలియజేస్తుంది. ఒక ప్రకృతి వైపరీత్యం తర్వాత ప్రజలు తమ జీవితాలను పునర్నిర్మించుకోవడంలో ఎదురయ్యే నష్టం, పునరుత్థానం గురించి “ది లాస్ట్ హెర్డ్” (మొయిషాల్) కథ వివరిస్తుంది.

కుటుంబం, వ్యక్తిగత సంబంధాలు కూడా కీలక ఇతివృత్తాలే. ఆత్మీయులను ఆదరంగా  చూసుకోవాల్సిన బాధ్యతను, ఆ బాధ్యతలు కుటుంబాలను ప్రభావితం చేసే తీరును “కేప్ ఆఫ్ గుడ్ హోప్” వివరిస్తుంది. ప్రేమ, జ్ఞాపకాలు, ప్రజలు తమ సొంత ఇళ్లతో పంచుకునే బలమైన బంధాన్ని "నాగాలాండ్-ఒక దృశ్య కావ్యం” అన్వేషిస్తుంది.

యువత స్వప్నాలు.. పోరాటాలు ‘ఎల్-ఎర్న్’ (తాల్-మేల్)లో ప్రతిబింబిస్తాయి. యువ సంగీతకారుల జీవితాల ద్వారా, కష్ట సమయాల్లోనూ ఆత్మవిశ్వాసం కలిగించిన, లక్ష్యాన్ని ఉత్తేజితం చేసి, ఆశను చిగురింపజేయగలదో ఈ చిత్రం ప్రస్ఫుటం చేస్తుంది.

మొత్తం మీద భారత్‌ సహా, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల కథలను “ఎమర్జింగ్ వాయిసెస్: ఫిల్మ్ స్కూల్ ఎడిషన్” విభాగంలోని చిత్రాలన్నీ సమగ్రంగా వివరిస్తాయి. స్థానిక సమాజాలు, నిజ జీవితానుభవాలతో మమేకమైన ఈ చిత్రాలు, యువ దర్శకుల సృజనాత్మకతను ప్రముఖంగా చూపుతూ- ప్రజలు, సంస్కృతి, సమాజంపై ఆలోచనాత్మక ధోరణిని ఉత్తేజితం చేస్తాయి.

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #MIFF2026. Tag us @pibmumbai on X, and we'll help spread your passion! For journalists, bloggers, and vloggers wanting to connect with filmmakers for interviews/interactions, reach out to us at miff.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


रिलीज़ आईडी: 2274908   |   Visitor Counter: 5