ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆల్‌స్టామ్‌ సీఈఓ శ్రీ మార్టిన్ సియోన్‌తో ప్రధానమంత్రి సమావేశం... దేశ యువతతో అంతర్జాతీయ సహకార అవకాశాలపై చర్చ

प्रविष्टि तिथि: 18 JUN 2026 6:42PM by PIB Hyderabad

ఆల్‌స్టామ్‌ సీఈఓ శ్రీ మార్టిన్ సియోన్‌తో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫలప్రదమైన చర్చలు జరిపారు. 

 

భారత్‌లో ఆల్‌స్టామ్ సంస్థకు ఇప్పటికే చాలా బలమైన ఉనికి ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మన దేశ ఆర్థిక వృద్ధి ప్రయాణాన్ని బలంగా విశ్వసిస్తూ.. ఇక్కడ తయారీ రంగాన్ని విస్తరించడంపై ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు.  అలాగే 'మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్ దార్శనికత దిశగా ఆల్‌స్టామ్ సంస్థ చేస్తున్న కృషిని, ప్రయత్నాలను ప్రత్యేకంగా అభినందించారు.
 

రాబోయే రోజుల్లో భారత్‌లో అవకాశాలు మరింత మెరుగ్గా మారబోతున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

భారతీయ యువతతో  కలిసి పనిచేయడానికి ప్రపంచ దేశాలను భారత్ ఆహ్వానిస్తోందని శ్రీ మోదీ  చెప్పారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

 

 “ఆల్‌స్టామ్ సీఈఓ శ్రీ మార్టిన్ సియాన్‌తో అత్యంత ఫలప్రదమైన భేటీ జరిగింది. భారత్‌లో ఆల్‌స్టామ్ సంస్థకు ఇప్పటికే బలమైన ఉనికి ఉంది. భారత వృద్ధి పయనంపై వారికి ఉన్న నమ్మకం, అలాగే మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్ దిశగా వారు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయం. రాబోయే రోజుల్లో ఇక్కడ అవకాశాలు మరింత మెరుగ్గా మారబోతున్నాయి.

 

మా దేశ యువతతో కలిసి పనిచేయడానికి ప్రపంచ దేశాలను  భారత్‌ ఆహ్వానిస్తోంది.”

***


(रिलीज़ आईडी: 2274899) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Gujarati , Tamil , Malayalam