రక్షణ మంత్రిత్వ శాఖ
నాగ్‌పూర్‌లోని యంత్ర ఇండియా లిమిటెడ్‌లో 10 వేల టన్నుల
అల్యూమినియం ఎక్స్‌ట్రూషన్ ప్రెస్ ఏర్పాటుకు భూమి పూజ చేయనున్న రక్షణ మంత్రి
प्रविष्टि तिथि:
18 JUN 2026 10:50AM by PIB Hyderabad
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ అంబజారిలో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ యంత్ర ఇండియా లిమిటెడ్ (వైఐఎల్)లో 10,000 టన్నుల సామర్థ్యం కలిగిన అత్యాధునిక అల్యూమినియం ఎక్స్‌ట్రూషన్ ప్రెస్ ఏర్పాటుకు కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ జూన్ 19, 2026న భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, రక్షణ ఉత్పత్తి శాఖ కార్యదర్శి శ్రీ సంజీవ్ కుమార్‌లతోటు రక్షణ ఉత్పత్తి శాఖ, యంత్ర ఇండియా సంస్థకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
ప్రతిపాదిత భారీ ఎక్స్‌ట్రూషన్ ప్రెస్.. భారత రక్షణ ఉత్పాదక రంగానికి అత్యంత కీలకమైన జాతీయ ఆస్తిగా మారనుంది. రక్షణ, అంతరిక్ష రంగాల అవసరాలను తీర్చడానికి అవసరమైన పెద్ద, అత్యధిక బలం కలిగిన, ఖచ్చితత్వంతో కూడిన అల్యూమినియం మిశ్రమ లోహాల ఉత్పత్తులను స్వదేశంలోనే తయారు చేసే సామర్థ్యాన్ని ఇది బలోపేతం చేస్తుంది. ప్రస్తుతం రక్షణ రంగానికి అవసరమైన కీలక అల్యూమినియం ఎక్స్‌ట్రూడెడ్ భాగాల కోసం భారత్ ఇతర దేశాల నుంచి చేసుకునే దిగుమతులపై ఆధారపడటాన్ని ఈ ప్రాజెక్టు తగ్గిస్తుంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆత్మనిర్భర్ భారత్ దార్శనికత దిశగా దేశీయ ఉత్పాదక రంగానికి ఈ ప్రాజెక్టు మద్దతునందిస్తుంది.
***
(रिलीज़ आईडी: 2274571)
आगंतुक पटल : 8