ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఫ్రాన్స్‌లోని ఏవియన్‌లో జరుగుతున్న జీ7-సదస్సులో “అందరి కోసం సమతుల్యమైన,


ఫ్రాన్స్‌లోని ఏవియన్‌లో జరుగుతున్న జీ-7 శిఖరాగ్ర సమావేశంలో ఈ రోజు నిర్వహించిన అవుట్ రీచ్ కార్యక్రమంలో “అందరి కోసం సమతుల్యమైన, ఉమ్మడిదైన, సుస్థిరమైన ఆర్థికవృద్ధిని పునరుద్ధరించడం” అనే అంశంపై ప్రధానమంత్రి ప్రసంగించారు.

భాగస్వామ్య, సుస్థిరవృద్ధిపై శిఖరాగ్ర సమావేశం దృష్టి సారించడాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. అనిశ్చితుల కారణంగా ప్రపంచం ప్రభావితమవుతున్న నేపథ్యంలో.. సుస్థిర వృద్ధిపై సందేశాన్ని ప్రపంచం స్వీకరిస్తుందని తెలిపారు. వృద్ధి అంటే జీడీపీకీ, వాణిజ్యానికీ సంబంధించిన అంకెలకే పరిమితం కాదనీ, సమ్మిళిత్వం, ప్రజా సంక్షేమంలో దాని అసలైన ప్రభావం ప్రతిబింబిస్తుందనీ తెలియజేశారు. ఈ సందర్భంగా.. ‘‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’’ (అందరితో కలసి, అందరికీ అభివృద్ధి, అందరి విశ్వాసం, అందరి ప్రయత్నం) అనే సూత్రం ఆధారంగా భారత్ సాధించిన సమగ్ర వృద్ధి కథనాన్ని తెలియజేశారు.

భారత్ అనుసరించే సమ్మిళిత వృద్ధి మంత్రం దేశం నిర్వహించే అంతర్జాతీయ కార్యకలాపాలకు కూడా మార్గనిర్దేశం చేస్తోందని ప్రధానమంత్రి అన్నారు. “ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు” ఇతివృత్తంతో భారత్ అధ్యక్షత వహించిన జీ20 లో స్పష్టంగా ఈ విధానం కనిపిస్తుందన్నారు. సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడానికీ, పెట్టుబడులు-ఉపాధి అవకాశాలను సృష్టించడానికీ, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికీ రూపొందించిన ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (ఐఎంఈసీ)కు కూడా ఈ తరహా విధానమే మార్గదర్శకంగా నిలిచిందని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న దేశాలపై సంక్షోభాలు, ఘర్షణలు ప్రతికూల ప్రభావాన్ని చూపాయని చెబుతూ.. ఆ దేశాలపై పడిన భారాన్ని తగ్గించడానికి అంతర్జాతీయ సంఘీభావం అవసరమని పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక స్థిరత్వాన్ని చేకూర్చేలా అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు సహాయక యంత్రాంగాలను అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. ఐఎంఈసీ మాదిరిగానే ఆఫ్రికా, లాటిన్ అమెరికా, పసిఫిక్ ద్వీప దేశాలను అనుసంధానించే ప్రాజెక్టులను కూడా పరిశీలించాలని ఆయన కోరారు. ఈ లక్ష్యాన్ని వాస్తవ రూపంలోకి తీసుకొచ్చేందుకు జీ-7 దేశాల పెట్టుబడులనూ, భారత దేశ ప్రతిభనూ, గ్లోబల్ సౌత్ దేశాల యాజమన్యాన్నీ మిళితం చేసేలా ఇంటర్నేషనల్ మొబిలైజేషన్ పార్టనర్‌షిప్ ఫర్ యాక్సిలరేటింగ్ కనెక్టివిటీ అండ్ ట్రేడ్ లేదా ఇంపాక్ట్‌ పేరిట భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయాని ప్రధానమంత్రి ప్రత

प्रविष्टि तिथि: 18 JUN 2026 5:00AM by PIB Hyderabad

ఫ్రాన్స్‌లోని ఏవియన్‌లో జరుగుతున్న జీ-7 శిఖరాగ్ర సమావేశంలో ఈ రోజు నిర్వహించిన అవుట్ రీచ్ కార్యక్రమంలో “అందరి కోసం సమతుల్యమైనఉమ్మడిదైనసుస్థిరమైన ఆర్థికవృద్ధిని పునరుద్ధరించడం” అనే అంశంపై ప్రధానమంత్రి ప్రసంగించారు.

భాగస్వామ్యసుస్థిరవృద్ధిపై శిఖరాగ్ర సమావేశం దృష్టి సారించడాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారుఅనిశ్చితుల కారణంగా ప్రపంచం ప్రభావితమవుతున్న నేపథ్యంలో.. సుస్థిర వృద్ధిపై సందేశాన్ని ప్రపంచం స్వీకరిస్తుందని తెలిపారువృద్ధి అంటే జీడీపీకీవాణిజ్యానికీ సంబంధించిన అంకెలకే పరిమితం కాదనీసమ్మిళిత్వంప్రజా సంక్షేమంలో దాని అసలైన ప్రభావం ప్రతిబింబిస్తుందనీ తెలియజేశారుఈ సందర్భంగా.. ‘‘సబ్ కా సాథ్సబ్ కా వికాస్సబ్ కా విశ్వాస్సబ్ కా ప్రయాస్’’ (అందరితో కలసిఅందరికీ అభివృద్ధిఅందరి విశ్వాసంఅందరి ప్రయత్నంఅనే సూత్రం ఆధారంగా భారత్ సాధించిన సమగ్ర వృద్ధి కథనాన్ని తెలియజేశారు.

భారత్ అనుసరించే సమ్మిళిత వృద్ధి మంత్రం దేశం నిర్వహించే అంతర్జాతీయ కార్యకలాపాలకు కూడా మార్గనిర్దేశం చేస్తోందని ప్రధానమంత్రి అన్నారు. “ఒకే భూమిఒకే కుటుంబంఒకే భవిష్యత్తు” ఇతివృత్తంతో భారత్ అధ్యక్షత వహించిన జీ20 లో స్పష్టంగా ఈ విధానం కనిపిస్తుందన్నారుసరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడానికీపెట్టుబడులు-ఉపాధి అవకాశాలను సృష్టించడానికీఆవిష్కరణలను ప్రోత్సహించడానికీ రూపొందించిన ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (ఐఎంఈసీ)కు కూడా ఈ తరహా విధానమే మార్గదర్శకంగా నిలిచిందని చెప్పారుఅభివృద్ధి చెందుతున్న దేశాలపై సంక్షోభాలుఘర్షణలు ప్రతికూల ప్రభావాన్ని చూపాయని చెబుతూ.. ఆ దేశాలపై పడిన భారాన్ని తగ్గించడానికి అంతర్జాతీయ సంఘీభావం అవసరమని పిలుపునిచ్చారుఅభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక స్థిరత్వాన్ని చేకూర్చేలా అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు సహాయక యంత్రాంగాలను అభివృద్ధి చేయాలని ఆయన సూచించారుఐఎంఈసీ మాదిరిగానే ఆఫ్రికాలాటిన్ అమెరికాపసిఫిక్ ద్వీప దేశాలను అనుసంధానించే ప్రాజెక్టులను కూడా పరిశీలించాలని ఆయన కోరారుఈ లక్ష్యాన్ని వాస్తవ రూపంలోకి తీసుకొచ్చేందుకు జీ-7 దేశాల పెట్టుబడులనూభారత దేశ ప్రతిభనూగ్లోబల్ సౌత్ దేశాల యాజమన్యాన్నీ మిళితం చేసేలా ఇంటర్నేషనల్ మొబిలైజేషన్ పార్టనర్‌షిప్ ఫర్ యాక్సిలరేటింగ్ కనెక్టివిటీ అండ్ ట్రేడ్ లేదా ఇంపాక్ట్‌ పేరిట భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయాని ప్రధానమంత్రి ప్రతిపాదించారు.

స్థిరమైనవిశ్వసనీయమైనసుభిక్షమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయడంలో భారతదేశానికున్న చిత్తశుద్ధిని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారుఅలాగే సమగ్రతభాగస్వామ్యంఉమ్మడిగా సాధించే ప్రగతిపై ఉన్న విశ్వాసమే జీ-7 సభ్యదేశాలతోఅనేక ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదర్చుకొనేలా ముందుకు నడిపిస్తోందని తెలియజేశారు.

 

***


(रिलीज़ आईडी: 2274501) आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Gujarati , Kannada , Malayalam