ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గౌరవం, ప్రశంసల ప్రాధాన్యాన్ని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 17 JUN 2026 9:05AM by PIB Hyderabad
స్నేహపూర్వక గౌరవం, అంగీకార భావన మనుషులను గొప్పతనం కలవారుగా, గౌరవశాలురుగా, సంతృప్తి చెందిన వారుగా తీర్చిదిద్దుతాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. అలాంటి గుర్తింపును తెచ్చుకొంటే వ్యక్తుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందనీ, ఒక కొత్త శక్తీ, ఉత్సాహం నిండుతాయనీ ఆయన తెలిపారు.

‘‘త్వత్సంభావితమాత్మానం బహు మాన్యామహే వయమ్ ప్రాయః ప్రత్యయమాధత్తే స్వగుణేషుత్తమాదరః’’ అన్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు.
మనని ఎవరైనా గౌరవిస్తే ఎంతో ఆనందాన్నీ, ధన్యతనీ పొందినట్లు భావిస్తాం. దీనికి కారణం గొప్ప వారు చూపిన ఆదరణ ఒక వ్యక్తిలో అతని లేదా ఆమె గుణాల పట్ల ఆత్మవిశ్వాసాన్ని మేల్కొలుపుతుంది.. ఇది పూర్తిగా నిజం అని ఈ సుభాషితం మనకు చెబుతోంది.  
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ,
‘‘స్నేహపూర్వక గౌరవం, అంగీకార భావన.. ఇవి వ్యక్తికి గర్వకారణం కావడంతో పాటు, సంతోషాన్నిస్తాయి. దీంతో ఆత్మవిశ్వాసం పెరగడమే కాక ఒక కొత్త శక్తి, ఉత్సాహం కూడా కలుగుతాయి.
త్వత్సంభావితమాత్మానం బహు మాన్యామహే వయమ్
ప్రాయః ప్రత్యయమాధత్తే స్వగుణేషుత్తమాదరః’’ అని పేర్కొన్నారు.

 
***

(రిలీజ్ ఐడి: 2273871) సందర్శకుల సూచీ సంఖ్య : : 51