రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

చరిత్రాత్మక మైలురాయి: రక్షణ దళాల్లో నియమితులైన ఎన్‌డీఏలో శిక్షణ పొందిన తొలి బ్యాచ్ మహిళా క్యాడెట్లు

प्रविष्टि तिथि: 13 JUN 2026 9:28PM by PIB Hyderabad

జాతీయ రక్షణ సంస్థ (ఎన్‌డీఏ)లో శిక్షణ పొందిన మొదటి మహిళా క్యాడెట్లు రక్షణ దళాల్లో అధికారులుగా నియమితులయ్యారుఇది సైనిక సేవలో మహిళా భాగస్వామ్య పరిణామంలో ముఖ్యమైన ప్రస్థానాన్ని సూచిస్తుంది. 148వ కోర్సులో భాగంగా ఆగస్టు 2022లో ఎన్‌డీఏలో చేరిన ఈ 17 మంది మహిళా క్యాడెట్లు... తమ తమ సర్వీస్ అకాడమీల్లో కఠినమైన ప్రీ-కమిషన్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు.

ఈ నెల 13న డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జరిగిన 158వ రెగ్యులర్ కోర్సు పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొన్న తొమ్మిది మంది అధికారులు భారత సైన్యంలో నియమితులయ్యారుఈ పరేడ్‌ను రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము వీక్షించారు.

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2272392&reg=48&lang=1

ఈ నెల 13న హైదరాబాద్‌లోని దుండిగల్‌ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరిగిన 217వ కోర్సు సంయుక్త గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో పాల్గొన్న ఐదుగురు అధికారులు భారత వైమానిక దళంలో నియమితులయ్యారుఈ పరేడ్‌ను రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వీక్షించారు.

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2272390&reg=48&lang=1

మే 28, 2026న ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో జరిగిన స్ప్రింగ్ టర్మ్-2026 పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొన్న ముగ్గురు అధికారులు భారత నావికాదళంలో నియమితులయ్యారుఈ పరేడ్‌ను సదరన్ నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా వీక్షించారు.

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2266384&reg=48&lang=1

సైనిక సేవల్లో నియమితులైన ఈ అధికారులు... దేశానికి సేవ చేసే బాధ్యతను తమకు అప్పగించిన సైనిక ముఖ్యాధికారుల సరసన చేరారుఈ నియామకం రక్షణ దళాల పరివర్తనలో కీలక అధ్యాయాన్ని సూచిస్తుందిసైనిక సేవలో సమాన అవకాశాలుప్రతిభశ్రేష్ఠత పట్ల దేశ నిబద్ధతనూ ప్రతిబింబిస్తుందిఈ విజయం వారి అంకితభావంక్రమశిక్షణపట్టుదలకు నిదర్శనంగా నిలుస్తుందిదేశవ్యాప్తంగా యువతులు సైన్యంలో చేరడానికిదేశ నిర్మాణానికి తోడ్పాటునందించడానికి ఇది తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది.

 

***


(रिलीज़ आईडी: 2272775) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Marathi , Bengali , Tamil