ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ జస్పాల్ రాణా గారి మృతికి సంతాపం తెలిపిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 12 JUN 2026 10:48AM by PIB Hyderabad

శ్రీ జస్పాల్ రాణా గారి మృతి పట్ల ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారుఆయన మరణం భారత క్రీడాజగతికి తీరని లోటు అని ప్రధాని అన్నారు.
షూటింగ్ క్రీడావిభాగంలో అసాధారణ విజయాలతో శ్రీ జస్పాల్ రాణా దేశానికి కీర్తిని తెచ్చిపెట్టారని శ్రీ మోదీ అన్నారుయువ క్రీడాకారులకు ఒక గురువుగా గొప్ప అంకిత భావంతో వారిని తీర్చిదిద్దిమార్గదర్శిగా నిలవడంలో ఆయన అందించిన తోడ్పాటు అంతే ప్రశంసనీయమని ప్రధానమంత్రి తెలిపారుశ్రేష్ఠత్వ సాధనలో చాటిన అచంచల నిబద్ధతక్రమశిక్షణక్రీడాప్రపంచానికి చేసిన సేవలు ఆయనకు అపార ప్రశంసలను సంపాదించిపెట్టాయని ప్రధాని అన్నారు.
ఈ విషాద సమయంలో శ్రీ జస్పాల్ రాణా కుటుంబానికీస్నేహితులకీక్రీడాకారులకూ ప్రధానమంత్రి సంతాపాన్ని తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి శ్రీ మోదీ  ఒక సందేశాన్ని పొందుపరుస్తూ :
‘‘
శ్రీ జస్పాల్ రాణా గారి మృతి విచారకరంఆయన నిష్క్రమణ భారత క్రీడా లోకానికి తీరని లోటు.
షూటింగ్ క్రీడావిభాగంలో అసాధారణ విజయాలతో దేశానికి అపార యశస్సును సాధించి పెట్టారాయనయువ క్రీడాకారులకు గొప్ప అంకిత భావంతో మార్గదర్శకత్వం వహించి వారిని తీర్చిదిద్దడంలో ఒక గురువుగా ఆయన అందించిన తోడ్పాటు కూడా అంతే ప్రశంసనీయంప్రావీణ్య సాధన పట్ల తిరుగులేని నిబద్ధతక్రమశిక్షణక్రీడాప్రపంచానికి చేసిన సేవలూ ఆయనకు అపార ప్రశంసల్ని సంపాదించిపెట్టాయి.
ఆయన కుటుంబానికీమిత్రులకూపూర్తి క్రీడాలోకానికీ ఈ దుఃఖ ఘడియలో నా సంతాపాన్ని తెలియజేస్తున్నానుఓమ్ శాంతి’’ అని పేర్కొన్నారు.

 


 

***

MJPS/SS/PRK


(रिलीज़ आईडी: 2271986) आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam