ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

ఔత్సాహిక పాత్రికేయులు నిజాయితీని, నిష్పాక్షికతను, ప్రజా ప్రయోజనాలను కాపాడాలి... సంసద్ టీవీ ఇంటర్న్‌షిప్ ముగింపు వేడుకలో ఉపరాష్ట్రపతి


దేశానికి మేధోపరమైన నిజాయితీ, సామాజిక స్పృహ, సాంకేతిక నైపుణ్యం, ప్రజాస్వామ్య విలువలపై నిబద్ధత కలిగిన జర్నలిస్టులు అవసరం: ఉపరాష్ట్రపతి

కేవలం కథనాలను రూపొందించడమే కాదు.. దేశాల భవిష్యత్తును కూడా మార్చే శక్తి మీడియాకు ఉంది: ఉపరాష్ట్రపతి

प्रविष्टि तिथि: 11 JUN 2026 7:04PM by PIB Hyderabad

 ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసీ)కు చెందిన చివరి సంవత్సరం పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం ఉపరాష్ట్రపతి భవన్‌లో సంసద్ టీవీ నిర్వహించిన నెల రోజుల ఇంటర్న్‌షిప్ కార్యక్రమ ముగింపు వేడుకల్లో భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్  ప్రసంగించారు.

ఈ కార్యక్రమ నిర్వహణపై శ్రీ సీపీ రాధాకృష్ణన్ హర్షం వ్యక్తం చేస్తూ.. ఈ ఏడాది ప్రారంభంలో తాను ఐఐఎంసీ స్నాతకోత్సవానికి వెళ్లినప్పుడు సంసద్ టీవీ ద్వారా విద్యార్థులకు ఆచరణాత్మక శిక్షణ అవకాశాలు కల్పించాలని సూచించిన విషయాన్ని గుర్తు చేశారుఈ ప్రతిపాదనను వెంటనే అమలు చేసినందుకు అభినందనలు తెలియజేశారు.  ఇంటర్న్లకు మార్గదర్శకత్వం వహించిన సంసద్ టీవీ నిపుణులను ప్రశంసించారు.

ప్రజాస్వామ్యంలో మీడియా పాత్రను ప్రస్తావిస్తూ... దేశానికి మేధోపరమైన నిజాయితీసామాజిక స్పృహసాంకేతిక నైపుణ్యంప్రజాస్వామ్య విలువలపై నిబద్ధత కలిగిన పాత్రికేయులుకమ్యూనికేటర్లు అవసరమని శ్రీ సీపీ రాధాకృష్ణన్ పేర్కొన్నారుమీడియాకు కేవలం కథనాలను రూపొందించడమే కాకుండా.. దేశాల భవిష్యత్తును కూడా తీర్చిదిద్దే శక్తి ఉందని తెలిపారు.

 

2047 నాటికి వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారుదేశ అభివృద్ధి ప్రయాణాన్ని నిజాయితీతోనిష్పాక్షికంగా ప్రపంచానికి చాటాలని  కోరారునేడు భారత్‌లోని యువశక్తిసాంకేతిక ఆవిష్కరణలుప్రజాస్వామ్య పటిష్టతను చూసి ప్రపంచమంతా మన  వైపు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోందని తెలిపారు.

 

నేటి కాలంలో కేవలం ప్రజల దృష్టిని ఆకర్షించడం కోసమే వార్తలను సంచలనం చేయడంపై శ్రీ సీపీ రాధాకృష్ణన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారుమీడియా విశ్వసనీయత కేవలం ప్రజాదరణపై కాకుండా వాస్తవాల ఖచ్చితత్వంప్రజా ప్రయోజనాలపైనే ఆధారపడి ఉండాలని తెలిపారుకాబోయే పాత్రికేయులు ఎల్లప్పుడూనిజాయితీనినిష్పాక్షికతనుబాధ్యతాయుతమైన జర్నలిజాన్ని అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

 

రోజురోజుకీ పెరుగుతున్న కృత్రిమ మేధ ప్రభావాన్ని  ప్రస్తావిస్తూ.. పరిశోధనలకుసమాచార ధ్రువీకరణకు సాంకేతికత శక్తిమంతమైన సాధనంగా ఉపయోగపడుతున్నప్పటికీసంపాదకీయ నిర్ణయాలు మాత్రం మానవ ఆలోచనా శక్తి ఆధారంగానే సాగాలని ఉపరాష్ట్రపతి అన్నారుతప్పుడు సమాచారండీప్ఫేక్ల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు.

అన్ని వర్గాలకూ సమాన ప్రాధాన్యతనిచ్చే జర్నలిజం గురించి ఉపరాష్ట్రపతి వివరించారుదేశాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవాలంటే కేవలం మహా నగరాలకే పాత్రికేయాన్ని పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల ఆకాంక్షలుసవాళ్లువారి విజయాలపై మరింత దృష్టి పెట్టాలని అన్నారు.

 

ఈ కార్యక్రమంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్రాజ్యసభ సెక్రటరీ జనరల్ శ్రీ పీపీ మోదీఉపరాష్ట్రపతి కార్యదర్శిసంసద్ టీవీ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ అమిత్ ఖరేసమాచారప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ చంచల్ కుమార్ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ప్రజ్ఞా పాలివాల్ గౌర్ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

***


(रिलीज़ आईडी: 2271897) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati , Tamil , Malayalam