ప్రధాన మంత్రి కార్యాలయం
పరిపాలనలో సంస్కరణలు, సమర్థవంతమైన అమలుకు ప్రాధాన్యతనిస్తూ సాగిన పరివర్తనాత్మక ప్రయాణాన్ని వివరిస్తూ కేంద్రమంత్రి రాసిన కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
10 JUN 2026 9:58PM by PIB Hyderabad
పరిపాలనలో సంస్కరణలు, సమర్థవంతమైన అమలుకు ప్రాధాన్యతనిస్తూ సాగిన పరివర్తనాత్మక ప్రయాణాన్ని వివరిస్తూ కేంద్రమంత్రి శ్రీ పీయూష్ గోయల్ రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ పంచుకున్నారు.
పాలనలో సంస్కరణలు, సమర్థవంతమైన అమలే ప్రధాన లక్ష్యాలుగా సాగిన పరివర్తనాత్మక ప్రయాణం గురించి ఈ కథనం వివరిస్తోంది. సంక్షేమ పథకాల విస్తరణ, ఆర్థిక సమ్మిళితత్వం, మహిళా నేతృత్వంలోని అభివృద్ధి, వ్యవస్థాపకత, మౌలిక సదుపాయాల కల్పనను ప్రస్తావిస్తూ.. ప్రజలకే తొలి ప్రాధాన్యతనిచ్చే ఈ విధానం ప్రజల ఆకాంక్షలను బలోపేతం చేయటం ద్వారా అభివృద్ధి వేగాన్ని పుంజుకుని, వికసిత్ భారత్ దిశగా భారతదేశ ప్రయాణంలో సరికొత్త విశ్వాసం నెలకొన్నట్లు ఈ కథనం పేర్కొంది.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
"కేంద్రమంత్రి శ్రీ పీయూష్ గోయల్ రాసిన ఈ కథనం.. పాలనలో సంస్కరణలు, సమర్థవంతమైన అమలుకు ప్రాధాన్యతనిస్తూ సాగిన పరివర్తనాత్మక ప్రయాణాన్ని వివరిస్తుంది. సంక్షేమ పథకాల విస్తరణ, ఆర్థిక సమ్మిళితత్వం, మహిళా నేతృత్వంలోని అభివృద్ధి, వ్యవస్థాపకత, మౌలిక సదుపాయాల కల్పనను ప్రస్తావిస్తూ.. ప్రజలకే తొలి ప్రాధాన్యతనిచ్చే ఈ విధానం దేశ ప్రజల ఆకాంక్షలను బలోపేతం చేసిందని, అభివృద్ధిని వేగవంతం చేసిందని, వికసిత్ భారత్ దిశగా భారతదేశ ప్రయాణంలో సరికొత్త విశ్వాసం నింపిందని పేర్కొంది".
***
(रिलीज़ आईडी: 2271549)
आगंतुक पटल : 2