ప్రధాన మంత్రి కార్యాలయం
పన్నెండు సంవత్సరాల పరివర్తనాత్మక పరిపాలనపై అభిప్రాయాలను తెలుపుతూ రాజ్యసభ ఎంపీ రాసిన వ్యాసాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
10 JUN 2026 10:03PM by PIB Hyderabad
రాజ్యసభ ఎంపీ శ్రీ నితిన్ నబీన్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో పరివర్తన ప్రధానంగా సాగిన 12 సంవత్సరాల పరిపాలనపై అభిప్రాయాలను వివరిస్తూ ఆ వ్యాసం సాగింది. ఉమ్మడి సంకల్పం, సమ్మిళిత అభివృద్ధి, ప్రజా భాగస్వామ్యం... ఇవి కోట్లాది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు వికసిత్ భారత్ లక్ష్యసాధన మార్గంలో భారత్ ప్రయాణాన్ని వేగవంతం చేస్తున్న తీరును కూడా ఈ వ్యాసం ముఖ్యంగా ప్రస్తావించింది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ :
‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో 12 ఏళ్ల పరివర్తనాత్మక పరిపాలనకు సంబంధించి రాజ్యసభ ఎంపీ శ్రీ నితిన్ నబీన్ అభిప్రాయాల్ని ఈ వ్యాసం వివరించింది. అంతేకాకుండా ఉమ్మడి సంకల్పం, సమ్మిళిత అభివృద్ధి, ప్రజాభాగస్వామ్యం... ఇవి ఏ విధంగా కోట్లాది ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ, వికసిత్ భారత్ లక్ష్యసాధన మార్గంలో భారత్ ప్రయాణాన్ని వేగవంతం చేస్తున్నాయో కూడా ఈ వ్యాసం ముఖ్యంగా ప్రస్తావించింది’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 2271548)
సందర్శకుల సూచీ సంఖ్య : : 36
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Kannada
,
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam