రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అగ్ని ప్రమాదాలు జరగకుండా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో తనిఖీలు ప్రయాణికుల భద్రత దిశగా భారతీయ రైల్వే కీలక చర్యలు

నాడు పోస్టు చేయడమైనది: 10 JUN 2026 8:28PM by PIB Hyderabad

భద్రతనురక్షణను మరింత పటిష్టం చేసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో భారతీయ రైల్వే అగ్ని ప్రమాదాలు జరగకుండా తనిఖీలను నిర్వహించనుందిప్రయాణికుల భద్రతను పెంపొందించడానికిరైల్వే ఆస్తులను పరిరక్షించడానికిప్రస్తుతం ఉన్న అగ్నిమాపక భద్రతా వ్యవస్థలను అంచనా వేసిమెరుగుపరచాల్సిన అంశాలను ఈ కార్యక్రమం ద్వారా గుర్తిస్తారు.

ఈ ఆడిట్‌లో స్టేషన్ భవనాలువిద్యుత్ వ్యవస్థలుఎయిర్ కండిషనింగ్వెంటిలేషన్ వ్యవస్థలుఅత్యవసర నిష్క్రమణ మార్గాలుఅగ్నిమాపక పరికరాలునీటి లభ్యతపంపింగ్ ఏర్పాట్లుస్ప్రింక్లర్ వ్యవస్థలు సహా అన్ని కీలకమైన భద్రతా మౌలిక సదుపాయాలనూ పరిశీలిస్తారుఅగ్ని ప్రమాదాలు సహా అత్యవసర పరిస్థితులకు సమర్థంగా స్పందించడానికి రైల్వే స్టేషన్లు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని నిర్ధారించుకోవడమే దీని లక్ష్యం.

నిర్దేశిత అగ్నిమాపక భద్రతభద్రతా ప్రమాణాల అమలునూ ఈ ఆడిట్ పరిశీలిస్తుందితనిఖీ ప్రక్రియలో గుర్తించిన ఏవైనా లోపాలను తక్షణ దిద్దుబాటు చర్యల ద్వారా పరిష్కరిస్తారు.

వివిధ శాఖల అధికారులతో కూడిన సంయుక్త తనిఖీ బృందాలు ఈ ఆడిట్‌లను నిర్వహిస్తాయిఅవసరమైన చోట ప్రత్యేక ఏజెన్సీలురాష్ట్ర అగ్నిమాపక శాఖల సహాయం కోరతారుభద్రతా సన్నద్ధతను మరింత బలోపేతం చేయడానికి ఆడిట్‌ల సమయంలో గుర్తించిన మెరుగుదల చర్యలను ప్రాధాన్యతా క్రమంలో చేపడతారు.

భారతీయ రైల్వే తన నెట్‌వర్క్ అంతటా భద్రతనురక్షణను నిరంతరం మెరుగుపరచడానికి కట్టుబడి ఉందిఈ అగ్నిమాపక భద్రతా ఆడిట్ కార్యక్రమం... రైల్వే స్టేషన్లలో భద్రతా ప్రమాణాలను బలోపేతం చేయడంఅత్యవసర పరిస్థితుల కోసం సన్నద్ధతను మెరుగుపరచడం దిశగా మరో కీలక ముందడుగు అవుతుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2271490) సందర్శకుల సూచీ సంఖ్య : : 57
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Tamil , Kannada , Malayalam