మీడియా రిజిస్ట్రేషన్‌కు చివరి అవకాశం: చివరి నిమిషంలో వచ్చే దరఖాస్తులను స్వీకరించేందుకు
వీలుగా రెండు రోజులు అందుబాటులో ఎమ్ఐఎఫ్ఎఫ్-2026 మీడియా అక్రిడిటేషన్ పోర్టల్
దేశవ్యాప్తంగా పాత్రికేయులు, మీడియా నిపుణులు, చలనచిత్ర విమర్శకుల నుంచి వచ్చిన అసంఖ్యాక అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని, 19వ ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎమ్ఐఎఫ్ఎఫ్-2026) కోసం మీడియా అక్రిడిటేషన్ పోర్టల్‌ను తిరిగి తెరవాలని నిర్ణయించారు. అదనపు నమోదులకు వీలుగా ఈ పోర్టల్ ఈ నెల 10 నుంచి 11వ తేదీ వరకు పరిమిత కాలం పాటు అందుబాటులో ఉంటుంది.
ఈ ప్రాంతంలోని అత్యంత ప్రసిద్ధ చలనచిత్ర కార్యక్రమాల్లో ఒకటైన ఈ కార్యక్రమం కోసం అక్రిడిటేషన్‌ను పొందడానికి, గతంలో గడువులోగా దరఖాస్తు చేసుకోలేకపోయిన మీడియా సిబ్బందికి ప్రత్యేకంగా ఈ చివరి అవకాశం కల్పిస్తున్నారు. ఈ నెల 11వ తేదీ తర్వాత ఎటువంటి పొడిగింపులు ఉండవని నిర్వాహకులు స్పష్టం చేశారు.
ఈ నెల 15 నుంచి 21 వరకు ముంబయిలోని గోపాల్‌రావు దేశ్‌ముఖ్ మార్గ్‌లో గల ఎన్ఎఫ్‌డీసీ ప్రాంగణంలో నిర్వహించే 19వ ఎమ్ఐఎఫ్ఎఫ్ ఎడిషన్... చలనచిత్ర ప్రదర్శనలు, చర్చలు, మాస్టర్ క్లాసులు, పరిశ్రమ వర్గాలతో సమావేశాలు, సాంస్కృతిక వినిమయ కార్యక్రమాలతో వారం రోజుల పాటు ఉత్సాహభరితంగా సాగనుంది.
ఫెస్టివల్ స్క్రీనింగ్‌లు, పత్రికా సమావేశాలు, ప్రత్యేక మీడియా ఈవెంట్‌లు, నెట్‌వర్కింగ్ అవకాశాలను పొందేందుకు... మీడియా ప్రతినిధులు ఈ నిర్దిష్ట కాలపరిమితిలో తమ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.
మీడియా అక్రిడిటేషన్ పోర్టల్ ఈ నెల 10, 11 తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎమ్ఐఎఫ్ఎఫ్-2026 కోసం నమోదు చేసుకోవడానికి మీడియా నిపుణులకు ఇదే చివరి అవకాశం.
రిజిస్ట్రేషన్ వివరాలు
మీడియా ప్రతినిధులు https://accreditation.pib.gov.in/eventregistration/login.aspx లింక్‌ను సందర్శించడం ద్వారా లేదా కింది క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనే మీడియా ప్రతినిధులుగా నమోదు చేసుకోవచ్చు.
unnamed.jpg
19వ ఎమ్ఐఎఫ్ఎఫ్-2026 గురించి
డాక్యుమెంటరీ, కల్పిత కథల లఘు చిత్రాలు, యానిమేషన్ చిత్రాలకు ప్రసిద్ధి చెందిన, దక్షిణాసియాలోనే అత్యంత పురాతనమైన, అతిపెద్ద చలనచిత్రోత్సవంగా గుర్తింపు పొందిన 'ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం' ఈ ప్రక్రియలకు ఒక గొప్ప వేదికగా నిలుస్తోంది. 1990లో ప్రారంభమై, భారత ప్రభుత్వ సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఈ ఎమ్ఐఎఫ్ఎఫ్... ప్రపంచవ్యాప్తంగా ఉన్న చలనచిత్ర నిర్మాతలు, కళాకారులు, సినీ ప్రేమికులను ఆకర్షించే ఒక ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ వేదికగా ఎదిగింది.
ఈ ఎమ్ఐఎఫ్ఎఫ్ 19వ ఎడిషన్... ఆలోచనాత్మకంగా రూపొందించిన కథాంశాలు గల ప్రఖ్యాత అంతర్జాతీయ చిత్రాలు, పరిశ్రమ-కేంద్రితమైన ఉత్తేజకర కార్యక్రమాల శ్రేణితో ప్రేక్షకులకు లీనమయ్యే, సుసంపన్నమైన సినిమా అనుభవాన్ని అందిస్తుందని హామీ ఇస్తోంది. ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవ 19వ ఎడిషన్ పోటీ విభాగానికి... భారత్ సహా 47 దేశాల నుంచి 1,459 చిత్రాల ఎంట్రీలు అందాయి. ఈ ఉత్సవం తన ప్రపంచవ్యాప్త విస్తృతిని, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ... 42కు పైగా భారతీయ భాషల్లో, భారత్ వెలుపల నుంచి 30కి పైగా విదేశీ భాషల చిత్రాలను ప్రదర్శిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత చిత్రరూపకర్తలు అందించిన చిత్రాలను ప్రదర్శిస్తూ... ఈ ఉత్సవం కొన్ని అత్యుత్తమ డాక్యుమెంటరీలు, కల్పనాత్మక కథాంశాల లఘు చిత్రాలు, యానిమేషన్లు, ఆరంగేట్ర దర్శకుల చిత్రాలు, విద్యార్థులు రూపొందించిన చిత్రాలను అందిస్తుంది. ప్రదర్శనలతో పాటు, డాక్ బజార్ రెండో ఎడిషన్, అద్భుతమైన మాస్టర్‌క్లాస్‌లు, ఐడీపీఏ ద్వారా ఓపెన్ ఫోరమ్... ఈ ఉత్సవంలో సినిమా, సృజనాత్మకతల మార్పిడిని మరింతగా మెరుగుపరుస్తాయి.
వినూత్నంగా కథలు చెప్పే ఎమ్ఐఎఫ్ఎఫ్-2026 ఉత్సాహభరిత ప్రపంచంలోకి అడుగు పెట్టండి... ఇక్కడ శక్తిమంతమైన సినీ, సృజనాత్మక మేధస్సు, స్ఫూర్తిదాయకమైన స్వరాలు ఒకచోట చేరి డాక్యుమెంటరీ, యానిమేషన్, కల్పనాత్మక లఘు చిత్రాల నిర్మాణానికి సంబంధించిన ఒక మరపురాని వేడుకను సృష్టిస్తాయి.
19వ ఎమ్ఐఎఫ్ఎఫ్ ఎడిషన్‌కి సంబంధించిన మీడియా అక్రిడేషన్ పాలసీని ఈ లింకు
ద్వారా పొందవచ్చు.
***
रिलीज़ आईडी:
2271380
| Visitor Counter:
9