మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతదేశంలో క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి బ్రిస్టల్, యార్క్, న్యూ సౌత్ వేల్స్‌ విశ్వవిద్యాలయాలకు


కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో అనుమతి పత్రాల అందజేత

ఎన్ఈపీ 2020 ‘అంతర్జాతీయీకరణ దార్శనికతను’ సాకారం చేసే దిశగా నమోదైన కీలక ఘట్టం

ప్రపంచ స్థాయి విద్యా భాగస్వామ్యాల ద్వారా భారతదేశపు విజ్ఞాన, సాంకేతికత, ఆవిష్కరణ హబ్‌లను మరింత బలోపేతం చేసేందుకు ముంబయి, బెంగళూరు నగరాలలో అంతర్జాతీయ క్యాంపస్‌ల ఏర్పాటు

प्रविष्टि तिथि: 09 JUN 2026 6:00PM by PIB Hyderabad

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మూడు విదేశీ ఉన్నత విద్యా సంస్థలైన బ్రిస్టల్ విశ్వవిద్యాలయంయార్క్ విశ్వవిద్యాలయంన్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయాలకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ రోజు మూడు అనుమతి పత్రాలను (ఎల్ఓఏజారీ చేసింది.

కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి- విశ్వవిద్యాలయ నిధుల కమిషన్ (యూజీసీచైర్మన్ డాక్టర్ వినీత్ జోషి ఈ అనుమతి పత్రాలను ఆయా సంస్థల ప్రతినిధులకు అందజేశారు.

బ్రిస్టల్ విశ్వవిద్యాలయం కార్యనిర్వాహక డీన్- డైరెక్టర్ శ్రీమతి మిషెల్ జోన్స్యార్క్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ చార్లీ జెఫరీన్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం డిప్యూటీ ఉపకులపతి (ఎడ్యుకేషన్ అండ్ స్టూడెంట్ ఎక్స్‌పీరియన్స్ప్రొఫెసర్ సారా మాడిసన్ స్వయంగా ఈ అనుమతి పత్రాలను (ఎల్ఓఏఅందుకున్నారు.

ఈ కార్యక్రమంలో బ్రిటిష్ హైకమిషన్, ఆస్ట్రేలియన్ హైకమిషన్బ్రిటిష్ కౌన్సిల్విద్యా మంత్రిత్వ శాఖవిశ్వవిద్యాలయ నిధుల కమిషన్ (యూజీసీప్రతినిధులతో పాటు ఆయా మూడు విశ్వవిద్యాలయాల ప్రతినిధులుఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. బ్రిస్టల్ విశ్వవిద్యాలయంయార్క్ విశ్వవిద్యాలయంన్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయాలు భారత్‌లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయడం.. 'విద్య అంతర్జాతీయకరణఅనే జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 దార్శనికతను ముందుకు తీసుకెళ్లడంలో మరొక ముఖ్యమైన ఘట్టం అని అన్నారుఈ విద్యాసంస్థలు భారత్‌లో నాణ్యమైన విద్యనుప్రపంచ స్థాయి అభ్యాస భాగస్వామ్యాలనుపరిశోధనా సహకారాలను మరింత బలోపేతం చేస్తాయని ఆయన పేర్కొన్నారుబ్రిస్టల్యార్క్ విశ్వవిద్యాలయాలు ముంబయిలో.. యూఎన్‌ఎస్‌డబ్ల్యూ బెంగళూరులో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేస్తుండటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారుభారత్‌లో విజ్ఞానసాంకేతికఆవిష్కరణల కేంద్రాలుగా విరాజిల్లుతున్న నగరాల్లో ఈ విశ్వవిద్యాలయాలు కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయనిఅందులోనూ బెంగళూరు తూర్పు దేశాల్లో 'కొత్త సిలికాన్ వ్యాలీ'గా గుర్తింపు పొందిందని ఆయన గుర్తు చేశారుఈ మూడు విశ్వవిద్యాలయాలకు దేశంలోకి ఘన స్వాగతం పలుకుతున్నట్లు ఆయన తెలిపారుభారత్‌లో వేగంగా విస్తరిస్తున్న ప్రపంచ ఉన్నత విద్యా వ్యవస్థలో భాగమైనందుకు వాటికి అభినందనలు తెలిపారు.

బ్రిస్టల్ విశ్వవిద్యాలయం ముంబయిలో తన 'ముంబయి ఎంటర్‌ప్రైజ్ క్యాంపస్'ను ఏర్పాటు చేయనుందిఇందులో ఇమ్మర్సివ్ ఆర్ట్స్ఫైనాన్స్డేటా సైన్స్ఆర్థిక శాస్త్రంబిజినెస్ మేనేజ్‌మెంట్వ్యవస్థాపకతఆవిష్కరణలు వంటి రంగాలలో కోర్సులను అందించాలని ప్రతిపాదించారు.

యార్క్ విశ్వవిద్యాలయం ముంబయిలో తన మొట్టమొదటి విదేశీ క్యాంపస్‌ను స్థాపించనుంది. ఇక్కడ ఫైనాన్స్కృత్రిమ మేధతో కంప్యూటర్ సైన్స్సైబర్ సెక్యూరిటీబిజినెస్ఎకనామిక్స్సృజనాత్మక పరిశ్రమలుమేనేజ్‌మెంట్ వంటి విభాగాలలో కోర్సులను అందించాలని ప్రతిపాదించారు.

న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం బెంగళూరులోని మాన్యతా బిజినెస్ పార్క్‌లో 'యూఎన్ఎస్‌డబ్ల్యూ బెంగళూరుక్యాంపస్‌ను ఏర్పాటు చేయనుందిఇది 2026 ఆగస్టు నుంచి ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉందిఈ క్యాంపస్ బిజినెస్కంప్యూటర్ సైన్స్సైబర్ సెక్యూరిటీ వంటి రంగాలలో కోర్సులను అందించడమే కాకుండా పునరుత్పాదక ఇంధనంఆరోగ్యంరవాణావిద్యా రంగాలలో భారత్‌తో మరింత లోతైన భాగస్వామ్యానికి దోహదపడుతుంది.

ఈ క్యాంపస్‌ల ఏర్పాటు అనేది జాతీయ విద్యా విధానం 2020 పరిధిలోని విస్తృత అంతర్జాతీయకరణ ఎజెండాలో ఒక భాగంఈ విధానం ఉన్నత విద్యా ప్రమాణాలలో అత్యున్నత ప్రపంచ స్థాయి నాణ్యతను సాధించడంపైభారతదేశాన్ని ఒక అంతర్జాతీయ విద్యా గమ్యస్థానంగా తీర్చిదిద్దడంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది.

భారత్‌లో విదేశీ ఉన్నత విద్యా సంస్థల క్యాంపస్‌ల ఏర్పాటు, నిర్వహణకు సంబంధించిన యూజీసీ నిబంధనలు... ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థలు తమ సంస్థాగత స్వయంప్రతిపత్తినిప్రపంచ స్థాయి ప్రమాణాలను కాపాడుకుంటూనే దేశంలో క్యాంపస్‌లను ఏర్పాటుచేయటానికి ఒక పారదర్శకమైనసులభతరమైనకాలపరిమితితో కూడిన విధివిధానాలను అందిస్తున్నాయి.

ఈ క్యాంపస్‌లు భారత్‌లోనే ఉన్నత ప్రమాణాలతో కూడిన అంతర్జాతీయ విద్యను అందుబాటులోకి తెస్తాయని, ఉభయ దేశాల మధ్య విద్యాసంబంధిత రాకపోకలను ప్రోత్సహిస్తాయనిపరిశోధనఆవిష్కరణలను బలోపేతం చేస్తాయని భావిస్తున్నారుఇవి భారతీయ విద్యార్థులకు కొత్త అవకాశాలను సృష్టించడంతో పాటు బ్రిటన్ఆస్ట్రేలియాలతో భారతదేశ విద్యా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి.

ఈ కార్యక్రమం భారతదేశ నియంత్రణ, విద్యా వ్యవస్థ‌పై ప్రపంచంలోని ప్రముఖ విద్యాసంస్థలకు పెరుగుతున్న నమ్మకాన్ని తెలియజేస్తోందిఇది ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం ఉన్నఅందరికీ సమాన అవకాశాలు కల్పించేభవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా ఉండే ఉన్నత విద్యా రంగాన్ని సృష్టించడంలో తోడ్పడుతుంది.

నేడు బ్రిస్టల్ విశ్వవిద్యాలయంయార్క్ విశ్వవిద్యాలయంన్యూ సౌత్ వేల్స్‌ విశ్వవిద్యాలయాలకు అనుమతి పత్రాల (ఎల్ఓఏఅందజేతతో కలిపి ఇప్పటి వరకు మొత్తం ఐదు అనుమతి పత్రాలు జారీ అయ్యాయివిదేశీ ఉన్నత విద్యా సంస్థల కోసం తీసుకొచ్చిన యూజీసీ నిబంధనల ప్రకారం వీటిని అందించారువీటిలో గతంలో అనుమతి పొందిన సౌతాంప్టన్ విశ్వవిద్యాలయంలివర్‌పూల్ విశ్వవిద్యాలయం కూడా ఉన్నాయిసౌతాంప్టన్ విశ్వవిద్యాలయం ఇప్పటికే 2025–26 విద్యా సంవత్సరం నుంచి తన విద్యా సంబంధిత కార్యకలాపాలను ప్రారంభించిందిభారతదేశమంతటా తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయటం కోసం బ్రిటన్అమెరికాఆస్ట్రేలియాఇటలీ వంటి దేశాలకు చెందిన మరికొన్ని ప్రపంచ ప్రఖ్యాత విదేశీ ఉన్నత విద్యా సంస్థలకు యూజీసీ ఇప్పటికే 10 ఉద్దేశ పత్రాలను (లెటర్ ఆఫ్ ఇంటెంట్జారీ చేసిందిఇవి కాకుండా డీకిన్ విశ్వవిద్యాలయంవోలోంగాంగ్ విశ్వవిద్యాలయంక్వీన్స్ యూనివర్సిటీబెల్ ఫాస్ట్ సంస్థలు ఇప్పటికే గిఫ్ట్ సిటీ‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించాయి.

***


(रिलीज़ आईडी: 2270964) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , हिन्दी , Marathi , Gujarati , Odia