ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గరీబ్ కళ్యాణ్, ప్రజల సాధికారతే ధ్యేయంగా12 ఏళ్ల విప్లవాత్మక కార్యక్రమాలను ప్రస్తావించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 08 JUN 2026 10:24AM by PIB Hyderabad

గత 12 ఏళ్లలో ఎన్నో మార్పులకు భారత్ సాక్ష్యంగా నిలిచిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారుపేదలుసమాజంలో వెనుకబడిన వర్గాల సంక్షేమమే ఈ మార్పులన్నింటికీ మూలాధారమని స్పష్టం చేశారుఅంత్యోదయ ఆశయంతో మన ప్రభుత్వం స్ఫూర్తిని పొందిందనిదశాబ్దాలుగా వెనకబడిన వారికి అభివృద్ధి ఫలాలు అందేలా చూడటమే తమ ప్రయత్నమని ప్రధానమంత్రి తెలిపారు.

జన్‌ధన్ ఖాతాలుప్రత్యక్ష నగదు బదిలీ నుంచి స్వచ్ఛ భారత్పీఎం ఆవాస్ యోజనజల్‌జీవన్ మిషన్ఆయుష్మాన్ భారత్ వంటి ఎన్నో పథకాల లక్ష్యం.. ప్రజలకు గౌరవాన్నిఅవకాశాలను అందించటమేనని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

 

పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచటంలో సాంకేతికత కీలక పాత్ర పోషించటం పట్ల ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారుప్రత్యక్ష నగదు బదిలీడిజిటల్ వేదికల ద్వారా నేరుగాపారదర్శకంగా ప్రజలకు సహాయం అందుతోందని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారుదీని వల్ల అవినీతిమధ్యవర్తుల దోపిడీకి అడ్డుకట్ట పడిందని.. సామర్థ్యంసుపరిపాలనపై విశ్వాసం పెరిగాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారుఈ విధంగా గరీబ్ కళ్యాణ్ ప్రయాణం ప్రజా ఉద్యమంగా మారిందని.. ఇది ప్రజల సాధికారతకువికసిత్ భారత్ కలని సాకారం చేసుకునేందుకు దోహదపడుతుందని అన్నారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్వరుస పోస్టుల్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

"గత 12 ఏళ్లలో ఎన్నో మార్పులకు భారత్ సాక్ష్యంగా నిలిచిందిపేదలువెనకబడిన వర్గాల సంక్షేమమే ఈ మార్పులకు మూలంమేం ఎల్లప్పుడూ అంత్యోదయ స్ఫూర్తితో పనిచేశాందశాబ్దాలుగా వెనుకబడిన ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందేలా చూడటమే మా నిరంతర ప్రయత్నంప్రజలకు గౌరవాన్నిఅవకాశాలను అందించటమే.. జన్‌ధన్ ఖాతాలుప్రత్యక్ష నగదు బదిలీ నుంచి స్వచ్ఛ భారత్పీఎం ఆవాస్ యోజనజల్‌జీవన్ మిషన్ఆయుష్మాన్ భారత్ వంటి ఎన్నో పథకాల లక్ష్యం.

#గరీబ్ కళ్యాణ్‌కు 12 ఏళ్లు"

 

"పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచటంలో సాంకేతికత కీలక పాత్ర పోషించటం సంతోషకరంప్రత్యక్ష నగదు బదిలీడిజిటల్ వేదికల ద్వారా నేరుగాపారదర్శకంగా ప్రజలకు సహాయం అందుతోందిదీనివల్ల అవినీతిమధ్యవర్తుల దోపిడీకి అడ్డుకట్ట పడటమే కాక.. సామర్థ్యం పెరిగిసుపరిపాలనపై ప్రజల్లో విశ్వాసం ఏర్పడిందిఈ విధంగా గరీబ్ కళ్యాణ్ ప్రయాణం.. ప్రజల సాధికారతకువికసిత్ భారత్ కలని సాకారం చేసే దిశగా ప్రజా ఉద్యమంగా మారింది.

#గరీబ్ కళ్యాణ్‌కు 12 ఏళ్లు"


(रिलीज़ आईडी: 2270195) आगंतुक पटल : 33
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Bengali-TR , Gujarati , Tamil , Kannada , Malayalam