ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డాక్టర్ సుభాష్ సి. కశ్యప్ మృతి.. సంతాపం తెలిపిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 04 JUN 2026 10:22PM by PIB Hyderabad

లోక్‌సభ సెక్రటరీ జనరల్‌గా సేవలు అందించిన డాక్టర్ సుభాష్ సికశ్యప్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపాన్ని తెలిపారు.

డాక్టర్ కశ్యప్ భారత్‌లో ప్రముఖ రాజ్యాంగ కోవిదులలో ఒకరనీపార్లమెంటుకు సంబంధించిన కార్యకలాపాలతో పాటు రాజ్యాంగ పరమైన విధుల నిర్వహణలో ఆయన అందించిన తోడ్పాటు మన సమాజాన్ని సుసంపన్నం చేసిందనీ ప్రధానమంత్రి అన్నారుడాక్టర్ కశ్యప్ రచనలూప్రజాస్వామిక సంస్థలను పటిష్ఠపరచడంలో ఆయన కనబరిచిన నిబద్ధత ప్రశంసనీయమని శ్రీ మోదీ అన్నారుడాక్టర్ కశ్యప్ కుటుంబానికీస్నేహితులకీ ప్రధానమంత్రి సంతాపాన్ని తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:

‘‘లోక్‌సభ సెక్రటరీ జనరల్‌గా ఇంతకు ముందు సేవలు అందించిన డాక్టర్ సుభాష్ సికశ్యప్ కన్నుమూశారని తెలిసి బాధపడ్డానుఆయన భారత్‌లో ప్రముఖ రాజ్యాంగ కోవిదులలో ఒకరుపార్లమెంటుకు సంబంధించిన కార్యకలాపాలతో పాటు రాజ్యాంగ పరమైన విధులలో ఆయన అందించిన తోడ్పాటు మన సమాజాన్ని సుసంపన్నం చేసిందిఆయన రచనలతో పాటు ప్రజాస్వామిక సంస్థలను పటిష్ఠపరచడంలో ఆయన నిబద్ధత ప్రశంసనీయంఆయన కుటుంబానికీస్నేహితులకీ సంతాపాన్ని తెలియజేస్తున్నానుఓమ్ శాంతి’’ అని పేర్కొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2269321) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Gujarati , Kannada , Malayalam