రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

తొలి జేడీసీ సమావేశంలో ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత పెంపొందించుకోవడం పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటించిన భారత్, జింబాబ్వే

प्रविष्टि तिथि: 04 JUN 2026 7:35PM by PIB Hyderabad

భారత్-జింబాబ్వే సంయుక్త రక్షణ కమిటీ (జేడీసీ) ప్రారంభ సమావేశం ఈ రోజు న్యూఢిల్లీలో జరిగింది. శిక్షణ, మద్దతు, ఉమ్మడి వాయు ఆస్తుల నిర్వహణ వంటి రంగాల్లో ప్రస్తుత సహకారాన్ని మరింత విస్తరించడం ద్వారా ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను పెంపొందించుకోవడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. సమష్టి తయారీ, ఉగ్రవాద నిరోధం, సరిహద్దు నిర్వహణ, శాంతి పరిరక్షణ వంటి కొత్త రంగాల్లో సహకారానికి గల మార్గాలనూ వారు చర్చించారు.

ఈ సమావేశానికి భారత్ తరపున సంయుక్త కార్యదర్శి శ్రీ అమితాబ్ ప్రసాద్, రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌లో పర్యటిస్తున్న 12 మంది సభ్యుల ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న జింబాబ్వే శాశ్వత కార్యదర్శి శ్రీ ఆరోన్ డేనియల్ టోండే నెపెరాలు సహ-అధ్యక్షత వహించారు. భారత ప్రతినిధి బృందంలో సర్వీసెస్, రక్షణ ఉత్పత్తుల విభాగం, సాయుధ దళాల వైద్య సేవల ప్రతినిధులు ఉన్నారు.

భారత్-జింబాబ్వే మధ్య రక్షణ భాగస్వామ్యం క్రమంగా బలపడుతోంది. ఏరో ఇండియా-2025 సందర్భంగా ఇరు దేశాల రక్షణ మంత్రులు సంతకం చేసిన రక్షణ సహకార అవగాహన ఒప్పందంలో నిర్దేశించిన లక్ష్యాలను కార్యాచరణలోకి తీసుకురావడం ద్వారా... ఈ తొలి జేడీసీ సమావేశం ఈ సంబంధాలను మరింత బలోపేతం చేసింది.

జింబాబ్వే ప్రతినిధి బృందం న్యూఢిల్లీలోని డీపీఎస్‌యూ భవన్‌నూ సందర్శించింది. అక్కడ వారు భారత రక్షణ రంగ ప్రతినిధులతో పరస్పర సహకారానికి గల అవకాశాలపై చర్చించారు. శ్రీ ఆరోన్ డేనియల్ టోండే నెపెరా న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి, అమరవీరులకు నివాళులర్పిండం ద్వారా తమ పర్యటనను ప్రారంభించారు.

***


(रिलीज़ आईडी: 2269158) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Tamil , Malayalam