సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత బ్రిక్స్ నాయకత్వంలో జూన్ 2,3 తేదీల్లో ఢిల్లీలో వర్చువల్ గా బ్రిక్స్ తొలి అవినీతి నిరోధక కార్యాచరణ బృందం సమావేశం

प्रविष्टि तिथि: 03 JUN 2026 7:38PM by PIB Hyderabad

భారత  బ్రిక్స్ అధ్యక్షతన, మొదటి  బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యాచరణ బృందం (యాంటీ కరప్షన్ వర్కింగ్ గ్రూప్) సమావేశం 2026 జూన్ 2, 3 తేదీలలో ఢిల్లీలో వర్చువల్  పద్ధతిలో జరిగింది. భారత ప్రభుత్వ సిబ్బంది, శిక్షణవిభాగం (డీఓపీటీ) ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. 

డీఓపీటీ  కార్యదర్శి శ్రీమతి రచనా షా ఈ సమావేశాన్ని ప్రారంభించారు. మార్పు చెందుతున్న అవినీతి సవాళ్లను ఎదుర్కోవడానికి నిరంతర అంతర్జాతీయ సహకారం, బలమైన సంస్థలు,  సాంకేతికత ఆధారిత నిర్వహణ ఆవశ్యకతను ఆమె ఈ సందర్భంగా ప్రముఖంగా తెలిపారు. దృఢత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరతలను పెంపొందించే బ్రిక్స్ భారత్ అధ్యక్ష ఇతివృత్తాన్ని ఆమె ప్రస్తావించారు. అలాగే, అక్రమ ఆస్తుల రికవరీలో సహకారాన్ని బలోపేతం చేయడం, సరిహద్దులు దాటి జరిగే అవినీతిని ఎదుర్కోవడం, నైతికతతో కూడిన పారదర్శక పరిపాలనను ప్రోత్సహించడం వంటి ప్రాధాన్య అంశాలను ఆమె ప్రముఖంగా పేర్కొన్నారు. 

ఈ వర్కింగ్ గ్రూప్ అక్రమ ఆస్తుల రికవరీ కోసం అంతర్జాతీయ సహకారం, సరిహద్దుల్లో అవినీతిని అరికట్టడం,  పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడం అనే రెండు ముఖ్యమైన ప్రాధాన్యతా రంగాలపై చర్చలను ముందుకు తీసుకెళ్లింది, 

క్షేత్రస్థాయిలో సహకారాన్ని బలోపేతం చేయడం, అక్రమ ఆస్తులను గుర్తించి రికవరీ చేయడం, పరారీలో ఉన్న నేరస్థుల సమస్యను పరిష్కరించడం,  జవాబుదారీతనాన్ని పెంపొందిస్తూ అవినీతి ముప్పును తగ్గించడానికి వినూత్న డిజిటల్ సాధనాలను ఉపయోగించుకోవడంపై ఈ సమావేశంలో ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

బ్రిక్స్ తొలి అవినీతి నిరోధక కార్యాచరణ బృందం సమావేశం సందర్భంగా జూన్ 2న  ఆస్తుల పునరుద్ధరణకు సంబంధించిన బ్రిక్స్ నిపుణుల మొదటి సెషన్ ను నిర్వహించారు. ఈ సమావేశంలో మొత్తం వ్యవస్థ దూరదృష్టి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ముఖ్యంగా, ఫోకల్ పాయింట్ల డైరెక్టరీ రూపొందించడం, సమాచార మార్పిడి కోసం సరళీకృత, ప్రామాణిక నమూనాలను అభివృద్ధి చేయడం, నిపుణుల స్థాయి క్రమానుగత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా క్రమబద్ధమైన సహకారాన్ని బలోపేతం చేసే చర్యలపై సమాలోచనలు జరిగాయి.

ఈ సమావేశంలో చర్చించిన కార్యక్రమాలను, 2026 ఆగస్టు 4,5  తేదీలలో తెలంగాణలోని హైదరాబాద్‌లో నిర్వహించే రెండో బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యాచరణ బృందం సమావేశంలో ముందుకు తీసుకెళ్లనున్నారు.

***


(रिलीज़ आईडी: 2268693) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , Tamil