ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో ఒడిశాలో రామేశ్వర్ నుంచి పరదీప్ వరకు కొత్త తీరప్రాంత రహదారిని నిర్మించేందుకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
మొత్తం 163.18 కి.మీల పొడవు గల ఈ తీరప్రాంత రహదారిని రెండు ప్యాకేజీలలో నిర్మించాలని నిర్ణయం
प्रविष्टि तिथि:
03 JUN 2026 3:10PM by PIB Hyderabad
ఒడిశాలో రెండు ప్యాకేజీల కింద మొత్తం 160.18 కి.మీల పొడవుతో రూ. 8300.79 కోట్ల మూలధన వ్యయంతో హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో (హెచ్ఏఎం) రామేశ్వర్ నుంచి పరదీప్ వరకు కొత్త తీరప్రాంత రహదారి నిర్మాణానికి ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది.
రామేశ్వర్ నుంచి పరదీప్ వరకు ప్రతిపాదించిన ఈ కొత్త తీరప్రాంత రహదారి ప్రాజెక్ట్ ఒడిశాలోని ఖుర్దా, పూరి, కేంద్రపడ, జగత్‌సింగ్‌పూర్ జిల్లాల గుండా వెళ్తుంది. స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టులో భాగమైన ప్రస్తుత ఎన్‌హెచ్-16 రహదారి ఇప్పటికే ఖుర్ధా, భువనేశ్వర్, కటక్ వంటి ప్రధాన నగరాల గుండా వెళ్తోంది. ఇది ఆరు వరుసల రహదారిగా ఉంది. ఇక ప్రస్తుత ఎన్‌హెచ్-316 రహదారి భువనేశ్వర్-పూరిలను కలుపుతూ సాతపడ, కోణార్క్ వరకు ఉంది. అయితే పూరి-సాతపడ, పూరి-కోణార్క్ మార్గాలలో రోడ్డు సరిగ్గా లేదు. ఈ కారిడార్‌లో దాదాపు 40 శాతం రహదారి పక్కనే నివాసాలు, దుకాణాలు ఉన్నాయి. దీనివల్ల స్థానిక ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఇది సుదూర ప్రాంతాలకు వెళ్లే వాహనాల సాఫీ, వేగవంతమైన ప్రయాణానికి ఆటంకంగా మారింది.
ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం ఈ ప్రాజెక్టులో భాగంగా రామేశ్వర్ నుంచి కోణార్క్ వరకు (ప్యాకేజీ-1) 4 వరుసల రహదారిని, కోణార్క్ నుంచి పరదీప్ వరకు (ప్యాకేజీ-2) పేవ్డ్ షోల్డర్‌తో కూడిన 2 వరుసల రహదారిని నిర్మించనున్నారు. గంటకు 100 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో వాహనాలు నడిచే ఈ రహదారి.. ఒడిశాలోని ఖుర్దా, పూరి, కేంద్రపడ, జగత్‌సింగ్‌పూర్ జిల్లాల వ్యాప్తంగా ప్రయాణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ప్రాజెక్ట్ ప్రాంతీయ రవాణాను వేగవంతం చేయడంతో పాటు సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది.
ఈ ప్రాజెక్టులను 'పీఎం గతిశక్తి' సూత్రాలకు అనుగుణంగా రూపొందించారు. ఇవి 9 ఆర్థిక కేంద్రాలు, 5 లాజిస్టిక్ కేంద్రాలను అనుసంధానిస్తాయి. ఇది దేశ లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్‌పై (ఎల్పీఐ) సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత రామేశ్వర్, పరదీప్ మధ్య ప్రయాణ సమయం సుమారు 2 గంటల 30 నిమిషాలు తగ్గుతుందన్న అంచనా ఉంది. ఇది ప్రయాణికులు, సరుకు రవాణాకు సురక్షితమైన, వేగవంతమైన, ఎలాంటి అంతరాయం లేని అనుసంధానతను అందిస్తుంది. దీనితో పాటు ఇంధన వినియోగం, కార్బన్ ఉద్గారాలు, వాహన నిర్వహణ ఖర్చులు (వీఓసీ) గణనీయంగా తగ్గడానికి ఈ ప్రాజెక్ట్ ఎంతగానో దోహదపడుతుంది.
అనుబంధం - I: ప్రాజెక్ట్ వివరాలు
|
వివరణ
|
రామేశ్వర్- కోణార్క్ 4 వరుసల యాక్సెస్-నియంత్రిత రహదారి
|
కోణార్క్-పారాదీప్ పేవ్డ్ షోల్డర్‌తో 2 వరుసల రహదారి
|
|
పొడవు (కి.మీ)
|
79.4
|
80.78
|
|
బ్రౌన్‌ఫీల్డ్ పొడవు (కి.మీ.)
|
2.56
|
-
|
|
గ్రీన్‌ఫీల్డ్ పొడవు (కి.మీ.)
|
76.84
|
80.78
|
|
మొత్తం సివిల్ పనుల వ్యయం (రూ. కోట్లు)
|
3129.06
|
1566.02
|
|
నిర్మాణానికి ముందు జరిగే భూమి, ఇతర వ్యయం (రూ. కోట్లు)
|
751.62
|
668.13
|
|
మొత్తం మూలధన వ్యయం (రూ. కోట్లు)
|
5304.8
|
2995.99
|
|
విధానం
|
హైబ్రిడ్ యాన్యుటీ మాడల్ (హెచ్ఎం)
|
హైబ్రిడ్ యాన్యుటీ మాడల్ (హెచ్ఎం)
|
|
మొత్తం రాయితీ కాలం
|
17.5 సంవత్సరాలు (2.5 సంవత్సరాల నిర్మాణం + 15 సంవత్సరాల నిర్వహణ, మరమ్మత్తు)
|
17.5 సంవత్సరాలు (2.5 సంవత్సరాల నిర్మాణం + 15 సంవత్సరాల నిర్వహణ, మరమ్మత్తు)
|
|
ఆర్థిక
|
2 సెజ్ లు- భువనేశ్వర్, ఖుర్ధా (ఖండగిరి)
మెగా ఫుడ్ పార్కులు- భువనేశ్వర్
ఫిషింగ్ క్లస్టర్-పరదీప్, కోణార్క్, జగత్‌సింగ్‌పూర్, పూరి, కేంద్రపాడ
ఫార్మా క్లస్టర్- కటక్
|
|
లాజిస్టిక్ నోడ్లు
|
పూరి రైల్వే స్టేషన్, పూరి విమానాశ్రయం, అస్తరాంగ్ పోర్ట్, పరదీప్ పోర్ట్- ఎంఎంఎల్పీ-జగత్‌సింగ్‌పూర్.
|
|
ఉపాధి కల్పన సామర్థ్యం
|
53.61 లక్షల పనిదినాలు (ప్రత్యక్ష) , 67.01 లక్షల పనిదినాలు (పరోక్ష)
|
|
2027-28 ఆర్థిక సంవత్సరంలో రోజువారీ వార్షిక సగటు ట్రాఫిక్ (ఏఏడీటీ) అంచనా
|
ప్యాకేజీ I : 10,437 పీసీయూ (9,236 పీసీయూ- టోల్ వసూలు చేయదగినవి)
ప్యాకేజీ II : 7,249 పీసీయూ (6,369 పీసీయూ- టోల్ వసూలు చేయదగినవి)
|
(रिलीज़ आईडी: 2268470)
आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam