ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని సూరత్‌లో ఘోర ప్రమాదం.. ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం


పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి నష్ట పరిహారం ప్రకటించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 02 JUN 2026 7:12PM by PIB Hyderabad

గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో జరిగిన ఘోర  ప్రమాదం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు, ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఘటనా స్థలంలో అధికారులు అన్ని రకాల సహాయాన్ని అందిస్తున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌) నుంచి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున అందజేయనున్నట్లు శ్రీ మోదీ తెలిపారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

 

‘‘గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో జరిగిన ప్రమాదం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించేందుకు స్థానిక అధికారులు శ్రమిస్తున్నారు’’.

   

‘‘మృతుల కుటుంబాలకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటిస్తున్నాం. గాయపడిన వారికి రూ. 50,000 అందజేస్తున్నాం: ప్రధానమంత్రి’’.

***


(रिलीज़ आईडी: 2268254) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam