ఆర్థిక మంత్రిత్వ శాఖ
బీహార్‌లో మాదకద్రవ్యాల నిరోధక తనిఖీ… సుమారు 105 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ... ఇద్దరి అరెస్టు
నాడు పోస్టు చేయడమైనది:
31 MAY 2026 5:58PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడం, మాదకద్రవ్యాల సరఫరా వ్యవస్థను నిర్మూలించడం కోసం చేస్తున్న నిరంతర ప్రయత్నంలో భాగంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఈ నెల 30వ తేదీన బీహార్‌లో 104.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. ఈ అక్రమ రవాణాలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులనూ ఎన్‌డీపీఎస్ చట్టం-1985లోని సంబంధిత నిబంధనల కింద అరెస్టు చేసింది.
దేశంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా డీఆర్ఐ చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ స్వాధీనం జరిగింది. గత ఏడాది కాలంలో బీహార్‌లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, లక్నో జోనల్ యూనిట్ దాదాపు 46.5 కోట్ల రూపాయల విలువైన (అక్రమ మార్కెట్లో) మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులకు సంబంధించి 31 మందిని అరెస్టు చేసింది. ఈ స్వాధీనాల్లో 107.5 కిలోల చరస్, 1277.81 కిలోల గంజాయి, 18.92 కిలోల అత్యంత నాణ్యమైన హైడ్రోఫోనిక్ గంజాయి, 6 కిలోల కొకైన్, 112.8 గ్రాముల హెరాయిన్, అక్రమ వినియోగం కోసం తరలిస్తున్న 8,012 సీసాల కోడీన్ ఆధారిత దగ్గు సిరప్‌లు ఉన్నాయి.
సమన్వయ కార్యకలాపాల ద్వారా మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాల అక్రమ రవాణాలో నిమగ్నమైన వ్యవస్థీకృత ముఠాలపై నిఘా ఉంచడం ద్వారా భారత ప్రభుత్వ 'నషా ముక్త్ భారత్' (మాదక ద్రవ్య రహిత భారత్) దార్శనికతకు డీఆర్ఐ తోడ్పాటునందిస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2267348)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4