ప్రధాన మంత్రి కార్యాలయం
‘మన్ కీ బాత్’ 134వ ఎపిసోడ్‌లో తన ప్రసంగ ముఖ్యాంశాలను పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
31 MAY 2026 1:14PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ 134వ ఎపిసోడ్‌లో భాగంగా తాను చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలను పంచుకున్నారు.
‘ఎక్స్’ వేదికగా చేసిన వరుస పోస్టుల్లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
గురిందర్‌వీర్ సింగ్, అనిమేష్ కుజుర్‌లతో సంభాషణ చాలా ప్రత్యేకంగా సాగింది. భారత అథ్లెటిక్స్ భవిష్యత్తు ఎందుకు అత్యంత ఉజ్వలంగా ఉందో దీని ద్వారా ఒక అవగాహన కలిగింది!
#MannKiBaat”
భారత మామిడి పండ్లు, మామిడి పండ్లలో విభిన్న రకాలను గురించి కచ్చితంగా ప్రస్తావించాల్సిందే! వీటిలో మీకు ఇష్టమైనది ఏది?
#MannKiBaat”
వేసవి వేడిని తట్టుకోవడానికి ఈత కొట్టడం ఒక గొప్ప మార్గం. #MannKiBaat కార్యక్రమంలో, భవిష్యత్ ఈతగాళ్లకు శిక్షణనిస్తున్న కేరళంకు చెందిన సజీ జీ కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించాను!
#MannKiBaat”
దేశవ్యాప్తంగా, యువతలో ఖగోళ శాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తీసుకువస్తున్న అనేక క్లబ్‌లు, సంఘాలు ఉన్నాయి. అటువంటి ప్రతి ప్రయత్నాన్ని చూసి నేను గర్విస్తున్నాను.
#MannKiBaat
”ఉత్తరప్రదేశ్‌లోని ఒక డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ప్రశంసనీయమైన పని చేస్తూ... మనతో పాటు ఈ గ్రహంపై జీవిస్తున్న సాటి జీవుల పట్ల శ్రద్ధ వహించాలనే ముఖ్యమైన సందేశాన్నిస్తోంది.
#MannKiBaat”
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆకాష్ గుప్తా, గోవాకు చెందిన బాలకృష్ణ అయ్య వంటి వారు జల సంరక్షణకు మార్గదర్శనం చేస్తూ... కీలకమైన సుస్థిరత సందేశాన్ని అందిస్తున్నారు.
#MannKiBaat”
తమిళనాడుకు చెందిన గిరిజా అమ్మతో నా సమావేశాన్ని గుర్తుచేసుకుని... దేశ నిర్మాణం పట్ల ఆమెకున్న అసమాన అభిరుచిని ప్రముఖంగా ప్రస్తావించాను. విద్యారంగం కోసం జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయ పాఠశాలలు చేస్తున్న కృషినీ అభినందించాను.
#MannKiBaat”
నేను నెదర్లాండ్స్ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ నుంచి భారత్‌కు తిరిగి తీసుకువచ్చిన చోళుల కాలం నాటి తామ్ర పత్రాల పట్ల దేశంలో గొప్ప ఆసక్తి నెలకొంది. అందుకే, #MannKiBaat కార్యక్రమంలో దాని గురించి మాట్లాడాను. ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవలే కనుగొన్న మూడు అరుదైన తామ్ర పత్రాల విషయాన్నీ ప్రస్తావించాను.
****
(రిలీజ్ ఐడి: 2267345)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Malayalam
,
Manipuri
,
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati