ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిసిన అమెరికా విదేశాంగ మంత్రి
ద్వైపాక్షిక సహకారంలో నిరంతర పురోగతిని పీఎంకి వివరించిన సెక్రటరీ రూబియో
వివిధ ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై అమెరికా దృక్పథాన్ని పంచుకున్న సెక్రటరీ రూబియో
శాంతి నెలకొల్పే ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ మద్దతిస్తుందని, సంఘర్షణలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చిన పీఎం
అధ్యక్షుడు ట్రంప్‌నకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన పీఎం
प्रविष्टि तिथि:
23 MAY 2026 4:25PM by PIB Hyderabad
అమెరికా విదేశాంగ మంత్రి గౌరవ మార్కో రూబియో ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.
రక్షణ, వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, అనుసంధానత, విద్య, ప్రజల మధ్య సంబంధాలతో సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో నిరంతరం సాధిస్తున్న పురోగతిపై ప్రధానమంత్రికి సెక్రటరీ రూబియో వివరించారు.
పశ్చిమాసియా సహా పలు ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై యూ.ఎస్. దృక్పథాన్ని సెక్రటరీ రూబియో పంచుకున్నారు.
శాంతి నెలకొల్పే ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ మద్దతిస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. చర్చలు, దౌత్యపరంగా ఘర్షణలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.
అధ్యక్షుడు ట్రంప్‌నకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయాలని సెక్రటరీ రూబియోను ప్రధానమంత్రి కోరారు. ఇరుదేశాల మధ్య పరస్పర సంప్రదింపులు కొనసాగాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2264556)
आगंतुक पटल : 58
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam