పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇటీవలి పశ్చిమాసియా పరిణామాలపై వివిధ మంత్రిత్వ శాఖల వివరణ


ఆ ప్రాంతంలోని భారతీయ నావికులంతా సురక్షితం.. గత 24 గంటల్లో భారతీయ జెండా కలిగిన నౌకలకు సంబంధించి నమోదు కాని అవాంఛనీయ సంఘటనలు

ఎల్‌పీజీ సిలిండర్ల అక్రమ మళ్లింపును అరికట్టడానికి 'డెలివరీ అథెంటికేషన్ కోడ్' ఆధారిత పంపిణీ విధానాన్ని దాదాపు 96 శాతానికి పెంచిన అధికారులు

నిన్నటి వరకు MYPNGD.in వెబ్‌సైట్ ద్వారా ఎల్‌పీజీ కనెక్షన్లను స్వచ్ఛందంగా వదులుకున్న 58,500 మందికి పైగా పీఎన్‌జీ వినియోగదారులు

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడా అందుబాటులో ఉన్న పెట్రోల్, డీజిల్ నిల్వలు

నాడు పోస్టు చేయడమైనది: 22 MAY 2026 8:39AM by PIB Hyderabad

పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు క్రమం తప్పకుండా సమాచారాన్ని అందించే చర్యలను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఈ రోజు జాతీయ మీడియా కేంద్రంలో పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఇందులో పెట్రోలియం- సహజ వాయువు, ఓడరేవులు- విమానయానం- జలమార్గాల మంత్రిత్వ శాఖ అధికారులు పాల్గొని.. ఇంధన లభ్యత, సముద్ర కార్యకలాపాలు, కీలక రంగాల్లో స్థిరత్వాన్ని కాపాడటాఉనికి తీసుకుంటున్న చర్యలపై తాజా సమాచారాన్ని అందించారు.

ఇంధన సరఫరా, లభ్యత

పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్‌పీజీ నిరంతరాయంగా లభ్యమయ్యేలా చూసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించిన పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ.. ఇంధన సరఫరా విషయంలో ప్రస్తుత పరిస్థితిపై తాజా సమాచారాన్ని అందించింది. మంత్రిత్వ శాఖ తెలియజేసిన వివరాలు:

ప్రజా సూచనలు, పౌర అవగాహన

·  పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. కాబట్టి ప్రజలు వీటిని కంగారుతో కొనుగోలు చేయొద్దని సూచించారు.

·  వదంతులను నమ్మొద్దు. సరైన సమాచారం కోసం అధికారిక ఖాతాలపై మాత్రమే ఆధారపడాలి.

·  ఎల్‌పీజీ వినియోగదారులు డిజిటల్ బుకింగ్ ప్లాట్‌ఫా‌మ్‌లను ఉపయోగించాలని, డిస్ట్రిబ్యూటర్ల వద్దకు వెళ్లడం నివారించాలని కోరారు.

·  పీఎన్‌జీ, ఎలక్ట్రిక్ లేదా ఇండక్షన్ కుక్‌టాప్‌ల వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించాల్సిందిగా అందరినీ ప్రోత్సహిస్తున్నారు.

·  ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రజలందరూ రోజువారీ వినియోగంలో ఇంధనాన్ని పొదుపు చేయడానికి తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరారు.

ప్రభుత్వ సన్నద్ధత, సరఫరా నిర్వహణ చర్యలు

·  ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య గృహ వినియోగ ఎల్‌పీజీ, గృహావసరాల పీఎన్‌జీ, రవాణా సీఎన్‌జీ విషయంలో సరఫరా 100 శాతం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

·  వాణిజ్య ఎల్‌పీజీ విషయంలో ఆసుపత్రులు, విద్యా సంస్థలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వీటితో పాటు ఫార్మా, ఉక్కు, వాహనాలు, విత్తన - వ్యవసాయ రంగాలకు కూడా ప్రాధాన్యత కల్పించారు. వలస కార్మికుల కోసం 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల సరఫరా 2026 మార్చి 2, 3 తేదీల్లో ఉన్న సగటు రోజువారీ సరఫరాతో పోలిస్తే రెట్టింపు అయింది.

·  ప్రభుత్వం ఇప్పటికే సరఫరా, డిమాండ్ రెండింటినీ సమన్వయం చేసేలా పలు హేతుబద్ధీకరణ చర్యలను అమలు చేసింది. ఇందులో చమురు శుద్ధి కేంద్రాల ఉత్పత్తిని పెంచడం.. గ్యాస్ బుకింగ్ గడువును పట్టణ ప్రాంతాల్లో 21 నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకు పొడిగించడం.. ప్రాధాన్యత కలిగిన రంగాలకు సరఫరాను నిర్ధారించడం వంటివి ఉన్నాయి.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సంస్థాగత యంత్రాంగాలతో సమన్వయ ప్రయత్నాలు

·  నిత్యావసరాల చట్టం- 1955, ఎల్‌పీజీ నియంత్రణ ఉత్తర్వు- 2000 ప్రకారం పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాను పర్యవేక్షించడానికి.. అక్రమ నిల్వలు, నల్లబజారు క్రయవిక్రయాలపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది.

·  పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ వంటి నిత్యావసరాల సరఫరా పరిస్థితిని పర్యవేక్షించడం, నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రాథమిక పాత్ర పోషించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు లేఖలు, వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా ఇదే విషయాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మరోసారి స్పష్టం చేసింది.

·  27.03.2026, 02.04.2026 నాటి లేఖల ద్వారా ఇంధనం తగినంతగా అందుబాటులో ఉందన్న భరోసాను ప్రజలకు ఇచ్చేందుకు ముందస్తు ప్రజా సమాచార మార్పిడి అవసరమని కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా చెప్పింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో క్రమం తప్పకుండా సమీక్షా సమావేశాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. 02.04.2026న పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి… 06.04.2026న సమాచార - ప్రసార, వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శులతో కలిసి పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో కింది అంశాలను ప్రముఖంగా చెప్పారు:

·  ప్రతిరోజూ మీడియా సమావేశాలు నిర్వహించడం, క్రమం తప్పకుండా ప్రజా సూచనలను జారీ చేయడం.

·  సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ వార్తలు, అవాస్తవ సమాచారాన్ని చురుగ్గా పర్యవేక్షించడం, తిప్పికొట్టడం.

·  జిల్లా యంత్రాంగం ద్వారా ప్రతిరోజూ తనిఖీలను ఉద్ధృతం చేయటం, ఓఎంసీలతో సమన్వయం చేసుకుంటూ దాడులు, తనిఖీలను కొనసాగించడం.

·  పీఎన్‌జీ వినియోగం, ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం.

·  ఎల్‌పీజీ సరఫరాలో ముఖ్యంగా గృహ అవసరాల ఎల్‌పీజీ సరఫరాలో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల లక్షిత పంపిణీ విధానాన్ని అనుసరించడం.

అమలు, పర్యవేక్షణ చర్యలు

·  ఎల్‌పీజీ అక్రమ నిల్వ, నల్లబజారు క్రయవిక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా చర్యలు కొనసాగుతున్నాయి. గత 3 రోజుల్లో దేశవ్యాప్తంగా 5000 కంటే ఎక్కువ దాడులు నిర్వహించారు.

·  ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థల (పీఎస్‌యూ ఓఎంసీ) అధికారుల ఆకస్మిక తనిఖీలు కూడా కొనసాగుతున్నాయి. గత 3 రోజుల్లో దేశవ్యాప్తంగా 3,100 కంటే ఎక్కువ పెట్రోల్ బంకులు, ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాలలో తనిఖీలు నిర్వహించారు.

·  ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ఆకస్మిక తనిఖీలను మరింత ముమ్మరం చేశాయి. అవి నిన్నటివరకు 463 ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లకు జరిమానాలు విధించటంతో పాటు 81 డీలర్లను సస్పెండ్ చేశాయి.

ఎల్‌పీజీ సరఫరా

గృహావసరాల ఎల్‌పీజీ సరఫరా పరిస్థితి:

·  ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఎల్‌పీజీ సరఫరాపై ప్రభావం కొనసాగుతోంది. 

·  గృహ వినియోగదారులకు సంబంధించిన ఎల్‌పీజీ సరఫరాకు అత్యంత ప్రాధాన్యత లభిస్తోంది.

·  ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్‌షిప్‌ల వద్ద ఎక్కడా నిల్వల కొరత ఉన్నట్లు నివేదికలు అందలేదు.

·  నిన్న పరిశ్రమవ్యాప్తంగా ఆన్‌లైన్ ఎల్‌పీజీ బుకింగ్‌లు 99 శాతానికి పెరిగాయి.

·  సిలిండర్ల దారి మళ్లింపును అరికట్టడానికి డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ (డీఏసీ) ఆధారిత పంపిణీ విధానాన్ని సుమారు 96 శాతానికి పెంచారు. నమోదు చేసుకున్న ఫోన్‌ నంబర్‌కు డీఏసీ వస్తుంది.

·  గత 3 రోజుల్లో దాదాపు 1.34 కోట్ల ఎల్‌పీజీ సిలిండర్ల బుకింగ్‌లకు గాను సుమారు 1.32 కోట్ల సిలిండర్లు వినియోగదారులకు పంపిణీ అయ్యాయి.

వాణిజ్య ఎల్‌పీజీ సరఫరా, కేటాయింపు చర్యలు

·  మొత్తం వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపులు సంక్షోభానికి ముందు ఉన్న స్థాయిలో సుమారు 70 శాతానికి పెరిగాయి. ఇందులో 10 శాతం సంస్కరణలతో ముడిపడి ఉన్న కేటాయింపులు కూడా ఉన్నాయి.

·  గత 3 రోజుల్లో దాదాపు 1.87 లక్షల 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు విక్రయమయ్యాయి.

·  ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (పీఎస్‌యూ ఓఎంసీ) 2026 ఏప్రిల్ 3 నుంచి 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లపై సుమారు 14,500 అవగాహన శిబిరాలను నిర్వహించాయి. ఈ శిబిరాల్లో 2.34 లక్షల కంటే ఎక్కువ 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు విక్రయమయ్యాయి.

·  నిన్న ఒక్కరోజే సుమారు 348 శిబిరాల్లో దాదాపు 4919 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు విక్రయమయ్యాయి. 

·  వాణిజ్య ఎల్‌పీజీ పంపిణీని ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ సంస్థల కార్యనిర్వహక డైరెక్టర్లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల విభాగాలతో సమన్వయం చేసుకుంటోంది.

·  2026 మే నుంచి ఇప్పటివరకు మొత్తం 1,32,341 మెట్రిక్ టన్నుల వాణిజ్య ఎల్‌పీజీ విక్రయమైంది.

·  గత 3 రోజుల్లో మొత్తం 23,588 మెట్రిక్ టన్నుల వాణిజ్య ఎల్‌పీజీ అమ్ముడైంది.

·  గత 3 రోజుల్లో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు సుమారు 963 మెట్రిక్ టన్నుల వాహన ఎల్‌పీజీని విక్రయించాయి. 

·         సహజ వాయువు సరఫరా, పీఎన్‌జీ విస్తరణ కార్యక్రమాలు

·         డీ-పీఎన్‌జీ, సీఎన్‌జీ-రవాణాకు 100 శాతం సరఫరాతో వినియోగదారులకు ప్రాధాన్యమిస్తున్నారు.

·         సీజీడీ నెట్‌వర్క్‌ల ద్వారా జరిగే సరఫరాలు సహా... ఇతర పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు గ్యాస్ సరఫరాను 80 శాతం వరకు పెంచారు.

·         వాణిజ్య ఎల్‌పీజీ లభ్యతకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించడానికి సీజీడీ సంస్థలు తమ అన్ని జిఏల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థల కోసం పీఎన్‌జీ కనెక్షన్లకు ప్రాధాన్యమివ్వాలని సూచించాయి.

·         సీజీడీ నెట్‌వర్క్‌ల విస్తరణకు అవసరమైన అనుమతులను వేగవంతం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలను కోరారు.

·         ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీకి దీర్ఘకాలిక పరివర్తనలో సహాయపడే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాణిజ్య ఎల్‌పీజీలో అదనంగా 10 శాతం కేటాయింపును తేది 18.03.2026 నాటి లేఖ ద్వారా భారత ప్రభుత్వం ప్రతిపాదించింది.

·         పీఎన్‌జీ విస్తరణ సంస్కరణలకు అనుసంధానంగా 22 రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలు అదనపు వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపును పొందుతున్నాయి.

·         నిత్యావసర వస్తువుల చట్టం-1955 కింద సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్‌లైన్‌లు, ఇతర సౌకర్యాల ఏర్పాటు, నిర్మాణంనిర్వహణవిస్తరణ ద్వారా) ఉత్తర్వులు-2026ను భారత ప్రభుత్వం 24.03.2026 తేదీ నాటి గెజిట్ ద్వారా జారీ చేసింది. ఈ ఉత్తర్వులు దేశవ్యాప్తంగా పైప్‌లైన్‌లు వేయడానికివిస్తరించడానికి ఒక క్రమబద్ధమైనకాలపరిమితితో కూడిన విధాన ప్రణాళికను అందిస్తాయి. ఇది అనుమతులుభూమి లభ్యతలో జాప్యాలను పరిష్కరించినివాస ప్రాంతాలు సహా సహజ వాయువు మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధికి వీలు కల్పిస్తుంది. ఇది పీఎన్‌జీ నెట్‌వర్క్ వృద్ధిని వేగవంతం చేస్తుందనిమారుమూల ప్రాంతాలతో కనెక్టివిటీని మెరుగుపరుస్తుందనిపరిశుద్ధ ఇంధనాలకు మారడానికి మద్దతునిస్తుందనితద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేసి భారత గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తుందని భావిస్తున్నారు.

·         డీ-పీఎన్‌జీ కనెక్షన్‌లను వేగవంతం చేయాలని సీజీడీ సంస్థలను పీఎన్‌జీఆర్‌బీ ఆదేశించింది. పీఎన్‌జీ విస్తరణలో వేగాన్ని కొనసాగించడానికి నేషనల్ పీఎన్‌జీ డ్రైవ్ 2.0ను 30.06.2026 వరకు పొడిగించారు.

·         పరిశుద్ధమైన, మరింత సురక్షితమైన, స్వయం సమృద్ధిగల ఇంధన భవిష్యత్తును ప్రోత్సహించడం లక్ష్యంగా భారత ప్రభుత్వం రాష్ట్ర సీబీజీ విధానం కోసం నమూనా ముసాయిదాను అభివృద్ధి చేసింది. ఈ నమూనా విధానం... సీబీజీ అభివృద్ధి కోసం రాష్ట్రాలు తమ సొంత, పెట్టుబడిదారులకు అనుకూలమైన, అమలుకు అనువుగా ఉండే వ్యవస్థను సృష్టించుకోవడానికి వీలు కల్పించే ఒక సమగ్రమైన, సరళమైన మార్గదర్శక విధాన ప్రణాళికగా పనిచేయడానికి ఉద్దేశించినది. దీనిని ఎంచుకున్న రాష్ట్రాలకు వాణిజ్య ఎల్‌పీజీ అదనపు కేటాయింపుల తదుపరి విడతలో ప్రాధాన్యమిస్తారు.

·         మార్చి 2026 నుంచి, సుమారు 7.64 లక్షల పీఎన్‌జీ కనెక్షన్‌లకు గ్యాసిఫికేషన్ పూర్తయింది. అదనంగా 2.81 లక్షల కనెక్షన్‌ల కోసం మౌలిక సదుపాయాలు కల్పించారు. దీంతో మొత్తం కనెక్షన్‌ల సంఖ్య 10.45 లక్షలకు చేరింది. కొత్త కనెక్షన్‌ల కోసం సుమారు 7.99 లక్షల మంది వినియోగదారులు నమోదు చేసుకున్నారు.

·         20.05.2026 వరకు 58,500 కంటే ఎక్కువ మంది పీఎన్‌జీ వినియోగదారులు MYPNGD.in వెబ్‌సైట్ ద్వారా తమ ఎల్‌పీజీ కనెక్షన్‌లను వదులుకున్నారు.

·         ముడి చమురు స్థితి, రిఫైనరీ కార్యకలాపాలు

·         అన్ని రిఫైనరీలు తగినంత ముడి చమురు నిల్వల ద్వారా అధిక సామర్థ్యంతో పనిచేస్తుండగా... పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంతగా నిర్వహిస్తున్నారు.

·         గృహ వినియోగానికి మద్దతుగా రిఫైనరీల నుంచి దేశీయ ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచారు.

·         దేశీయ మార్కెట్‌కు పెట్రోకెమికల్ ఫీడ్‌స్టాక్ సరఫరా లభ్యతను నిర్ధారించడానికి అంతర్-మంత్రిత్వ శాఖల సంయుక్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. సెంటర్ ఫర్ హై టెక్నాలజీ నిర్ధారించిన విధంగా కీలక రంగాలకు సీ3 & సీ4 స్ట్రీమ్‌ల నిర్దిష్ట కనీస పరిమాణాలను అందుబాటులో ఉంచడానికి పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లు సహా ఆయిల్ రిఫైనరీ కంపెనీలనూ భారత ప్రభుత్వం 01.04.2026 తేదీ నాటి ఉత్తర్వుల ద్వారా అనుమతించింది.

·         ఫార్మాస్యూటికల్స్ విభాగం, రసాయనాలు-పెట్రో రసాయనాల శాఖ (డీసీపీసీ), పరిశ్రమలు-అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డీపీఐఐటీ)ల నుంచి అందిన అభ్యర్థనల ఆధారంగా... ఫార్మారసాయన, పెయింట్ రంగ సంస్థల కోసం ఎల్‌పీజీ పూల్ నుంచి రోజుకు 1120 ఎమ్‌టీల C3-C4 మాలిక్యుల్స్ కేటాయింపు చేశారు.

·         2026 మే 1వ తేదీ నుంచి ముంబయికొచ్చివిశాఖపట్నంచెన్నైమధుర, గుజరాత్ రిఫైనరీలు రసాయనఔషధ, పెయింట్ పరిశ్రమలకు 10600 ఎమ్‌టీలకు పైగా సీ3-సీ4 మాలిక్యుల్స్ (ప్రొపైలీన్, బ్యూటైలీన్‌లతో కూడినవి), 3940 ఎమ్‌టీలకు పైగా బ్యూటైల్ అక్రిలేట్‌ను విక్రయించాయి.

·         రిటైల్ ఇంధన లభ్యత, ధరల సంబంధిత చర్యలు

·         దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ అవుట్‌లెట్‌లు యధావిధిగా పనిచేస్తున్నాయి.

·         మధ్యప్రాచ్య సంక్షోభం ముడి చమురు ధరల్లో అసాధారణ పెరుగుదలకు దారితీసింది. వినియోగదారులను అధిక ధరల నుంచి ఆదుకోవడానికి భారత ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ. 10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.

·         15.05.2026 నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా భారత ప్రభుత్వం... డీజిల్ ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ. 23 నుంచి రూ. 16.50కిఅలాగే ఏటీఎఫ్‌పై సుంకాన్ని లీటరుకు రూ. 33 నుంచి రూ. 16కి తగ్గించింది. పెట్రోల్‌పై లీటరుకు రూ. 3 చొప్పున ఎగుమతి సుంకం విధించింది.

·         దేశంలోని అన్ని పెట్రోల్ పంపుల వద్ద పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంత అందుబాటులో ఉన్నాయి.

·         నౌకా వాణిజ్య భద్రత, నౌకాయాన కార్యకలాపాలు

·         పర్షియన్ గల్ఫ్‌లో నెలకొన్న సముద్ర పరిస్థితిపై ఓడరేవులునౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ తాజా సమాచారాన్ని అందించింది. ఈ ప్రాంతంలో భారతీయ నౌకలు, సిబ్బంది భద్రత, రక్షణను నిర్ధారించడానికి తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ఈ నివేదికను అందించింది. అందులో కింది విషయాలను పేర్కొన్నది:

·         నావికుల సంక్షేమం, నిరంతరాయ నౌకా వాణిజ్య కార్యకలాపాలను నిర్ధారించడం కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖభారత మిషన్లు, నౌకా వాణిజ్య రంగ భాగస్వాములతో ఓడరేవులునౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ సమన్వయం కొనసాగిస్తోంది.

·         గత 72 గంటల్లో భారతీయ నౌకలకు, భారతీయ నావికులు ఉన్న విదేశీ నౌకలకు సంబంధించి ఎలాంటి ఘటన నమోదు కాలేదు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం ఉన్న భారతీయ నావికులంతా సురక్షితంగా ఉన్నారు.

·         డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ ప్రారంభమైనప్పటి నుంచి 10,106 కాల్‌లు, 22,215కు పైగా ఈమెయిళ్లనూ నిర్వహించింది. గత 72 గంటల్లో... నావికులువారి కుటుంబాలు, నౌకా వాణిజ్య సంబంధిత వర్గాల నుంచి మొత్తం 404 కాల్‌లు, 903 ఈమెయిళ్లూ అందాయి.

·         డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీ షిప్పింగ్) ద్వారా గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుంచి గత 72 గంటల్లో స్వదేశానికి వచ్చిన 99 మంది సహా... ఇప్పటివరకు మొత్తం 3,316 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించడానికి మంత్రిత్వ శాఖ సౌకర్యం కల్పించింది.

·         దేశవ్యాప్తంగా పోర్ట్ కార్యకలాపాలు సాధారణంగా కొనసాగుతున్నాయి. ఎటువంటి రద్దీ నమోదు కాలేదు.

 

****

 


(రిలీజ్ ఐడి: 2263964) సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam