ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత్‌-నార్డిక్‌ 3వ సదస్సు సందర్భంగా సంయుక్త మీడియా ప్రకటనలో ప్రధానమంత్రి ప్రకటన

నాడు పోస్టు చేయడమైనది: 19 MAY 2026 8:00PM by PIB Hyderabad

నార్డిక్ దేశాల నేతలుప్రతినిధులు,

మీడియా మిత్రులు,

మీ అందరికీ నా నమస్కారాలు!

ఇవాళ భారత్‌-నార్డిక్‌ 3వ సదస్సులో పాల్గొనటం నాకు ఎంతో సంతోషంగా ఉందిముందుగా ఈ సదస్సుకు ఆతిథ్యమిస్తున్న నార్వే ప్రధానమంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలుఇక్కడకు విచ్చేసిన నార్డిక్‌ నేతలందరికీ సాదర స్వాగతం.

ప్రజాస్వామ్యంచట్టబద్ధమైన పాలనబహుపక్షవాదం పట్ల ఉమ్మడి నిబద్ధతే మనల్ని సహజ భాగస్వాములుగా చేస్తోందిసాంకేతికతసుస్థిర రంగాల్లో మనకున్న ఉమ్మడి ప్రాధాన్యతలు.. ఇరుదేశాల సంబంధాల్లో అపారమైన అవకాశాలను కల్పిస్తున్నాయిఅందువల్లే నార్డిక్ దేశాలతో మన సంబంధాల్లో శక్తినివేగాన్ని పెంచేందుకు ఎనిమిదేళ్ల కిందట ఈ వేదికను ఏర్పాటు చేశాం.

మిత్రులారా,

కొన్నేళ్లుగా మన మధ్యనున్న సంబంధాల్లో సాధించిన గణనీయమైన పురోగతికి ఎంతో సంతోషంగా ఉందిగత పదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు నాలుగు రెట్లు పెరిగింది.

వేగవంతమైన భారత వృద్ధి ప్రస్థానంలో నార్డిక్‌ దేశాల పెట్టుబడులు కీలకంగా మారుతున్నాయిగత దశాబ్ద కాలంలో నార్డిక్‌ దేశాల నుంచి భారత్‌లోకి వచ్చిన పెట్టుబడులు దాదాపు 200 శాతం మేర పెరిగాయి.

వేగంగా వృద్ధి చెందుతున్న వాణిజ్యంపెట్టుబడులు భారత వృద్ధి ప్రస్థానానికే కాకనార్డిక్‌ దేశాల ఆర్థిక వ్యవస్థల్లోనూ అత్యంత సానుకూల పాత్ర పోషిస్తూవేలాది కొత్త ఉద్యోగాలను కల్పించాయిఈ కీలక ఆధారంతో మన సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ఇటీవల మేం కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను చేపట్టాం.

మిత్రులారా,

నార్వేఐస్‌లాండ్‌ఇతర యూరోపియన్‌ స్వేచ్ఛా వాణిజ్య కూటమి దేశాలతో కుదుర్చుకున్న వాణిజ్యఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని అమల్లోకి తెచ్చాంకొన్ని నెలల కిందట డెన్మార్క్‌ఫిన్లాండ్‌స్వీడన్‌ భాగస్వామ్య దేశాలుగా భారత్‌-యూరోపియన్‌ యూనియన్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కూడా పూర్తి చేశాంఈ ప్రతిష్ఠాత్మక వాణిజ్య ఒప్పందాల ద్వారా భారత్‌నార్డిక్‌ దేశాల మధ్య బంధంలో సరికొత్త స్వర్ణయుగాన్ని ఆవిష్కరిస్తున్నాం.

మిత్రులారా,

భారత్‌-నార్డిక్ సంబంధాలను గ్రీన్‌ టెక్నాలజీవ్యూహాత్మక ఆవిష్కరణల భాగస్వామ్యంగా మార్చాలని ఇవాళ మేం నిర్ణయించుకున్నాంఈ గ్రీన్‌ టెక్నాలజీ భాగస్వామ్యం ద్వారా భూతాప శక్తిమత్స్య పరిశ్రమల్లో ఐస్‌లాండ్‌ నైపుణ్యాన్నిబ్లూ ఎకానమీఆర్కిటిక్ ప్రాంతంలో నార్వే దేశ బలాన్నిసుముద్రయానసుస్థిర రంగాల్లో నార్డిక్‌ దేశాల నైపుణ్యాన్ని భారత్‌తో విస్తృత స్థాయిలో అనుసంధానించటం ద్వారా ప్రపంచానికి మెరుగైన భవిష్యత్తును అందించవచ్చు.

మన మధ్య కుదిరిన ఈ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంతో స్వీడన్‌లోని అధునాతన తయారీరక్షణ రంగాల సామర్థ్యాన్నిఫిన్లాండ్‌ టెలికాం డిజిటల్ సాంకేతిక నైపుణ్యాన్నిడెన్మార్క్‌ సైబర్‌ సెక్యూరిటీహెల్త్‌-టెక్నాలజీ బలాలను భారతదేశ ప్రతిభాశక్తితో అనుసంధానిస్తాందీనిద్వారా ప్రపంచం కోసం అత్యంత విశ్వసనీయమైన పరిష్కారాలను అభివృద్ధి చేయవచ్చు.

మిత్రులారా,

భారత్-నార్డిక్‌ భాగస్వామ్యానికి విస్తృతమైన పరిశోధనఆవిష్కరణల సంబంధాలు కీలకమైనవివీటిని మరింత బలోపేతం చేసేందుకు విశ్వవిద్యాలయాలుప్రయోగశాలలుఅంకుర సంస్థల వ్యవస్థ మధ్య అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు మేం కలిసి పనిచేస్తాంఆర్కిటిక్‌ధృవ ప్రాంత పరిశోధనలో సహకారాన్ని మరింతగా పెంపొందించుకుంటాంభారత్-నార్డిక్‌ దేశాల మధ్య నైపుణ్యాభివృద్ధిప్రతిభావంతుల పరస్పర మార్పిడికి నూతన అవకాశాలను సృష్టిస్తాం.

మిత్రులారా,

ప్రపంచ సమస్యలపై ఇవాళ మేం అభిప్రాయాలను పంచుకున్నాంప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలుఘర్షణలు నెలకొన్న ఈ సమయంలో నియబద్ధమైన అంతర్జాతీయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు భారత్‌నార్డిక్‌ దేశాలు కలిసి పనిచేస్తాయిఉక్రెయిన్‌పశ్చిమాసియాలో ఘర్షణలను ముగించేందుకుశాంతిని పునరుద్ధరించే ప్రయత్నాలకు మేం ఎల్లప్పుడూ మద్దతిస్తాం.

అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అత్యవసరమని ఏకాభిప్రాయాన్ని వ్యక్తపరిచాంఉగ్రవాదం విషయంలోనూ మన వైఖరి స్పష్టంగాబలంగా ఉందిఇందులో ఎక్కడా రాజీపడేది లేదుద్వంద్వ విధానాలకు తావులేదు.

గౌరవనీయులారా,

మనం వేర్వేరు భాషలు మాట్లాడినప్పటికీ కొన్నిసార్లు మన సహజ భాగస్వామ్యాన్ని ప్రతిబింబించేందుకు ఒక్క పదం సరిపోతుందిఇవాళ నేను "సంబంధ్‌అనే పదాన్ని చాలాసార్లు ఉపయోగించానునార్డిక్‌ భాషల్లో "సంబంధ్‌అంటే అనుసంధానంసంబంధాలుబంధం అని అర్థంహిందీలోనూ "సంబంధ్‌పదానికి సరిగ్గా ఇదే అర్థం వస్తుంది.

ఇది కేవలం పదాల సారూప్యత మాత్రమే కాదు.. ఆలోచనల సాన్నిహిత్యాన్ని ప్రతిబింబిస్తుందిప్రతీ రంగంలోనూ మన మధ్య బంధాలను మరింత బలోపేతం చేసుకుందాంఉమ్మడి సంక్షేమంఆవిష్కరణసుస్థిర భవిష్యత్తుకు ఆదర్శంగా భారత్-నార్డిక్‌ భాగస్వామ్యాన్ని తీర్చిదిద్దుదాం.

ధన్యవాదాలు.

గమనికఇది ప్రధానమంత్రి ప్రసంగానికి ‌స్వేచ్ఛానువాదంఅసలు ప్రసంగం హిందీలో ఇచ్చారు.

 

****


(రిలీజ్ ఐడి: 2263636) సందర్శకుల సూచీ సంఖ్య : : 11