పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఫిబ్రవరి 02, 2026 నాటి ఎయిరిండియా లండన్‌ హీత్రూ- బెంగళూరు బోయింగ్‌ 787-8 విమానం నిలిపివేత


ఎయిరిండియా విమానాల్లోని ఇంధన నియంత్రణ స్విచ్‌లను అధికారుల సమక్షంలో తనిఖీ చేయాలంటూ ఆదేశించిన డీజీసీఏ

నాడు పోస్టు చేయడమైనది: 19 MAY 2026 9:37PM by PIB Hyderabad

ఏఐసీ-132 (లండన్‌ హీత్రూ (ఈజీఎల్‌ఎల్‌) - బెంగళూరు (వీఓబీఎల్‌)) మార్గంలో 02.02.2026న ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఎయిరిండియా బోయింగ్ 787-8 వీటీ-ఏఎన్‌ఎక్స్‌ విమానాన్ని నిలిపివేశారుఎడమ వైపున్న ఇంధన నియంత్రణ స్విచ్‌ (ఎఫ్‌సీఎస్‌)ను కొద్దిగా నెట్టినప్పుడు అది "రన్‌స్థానం నుంచి "కట్‌ఆఫ్‌"కు జారిపోతున్నదని, ఎంచుకున్న స్థితిలో లాక్‌ అవటం లేదంటూ పైలట్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

విమాన తయారీ సంస్థ సిఫార్సుల ఆధారంగా డీజీసీఏ అధికారుల సమక్షంలో నిర్దేశించిన పద్ధతుల ప్రకారం ఇంధన నియంత్రణ స్విచ్‌ల (ఎఫ్‌సీఎస్‌తనిఖీపనితీరుకు సంబంధించిన పరీక్షను ఎయిరిండియా నిర్వహించింది.

 

****


(రిలీజ్ ఐడి: 2263271) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil , Kannada