ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా శ్రీ సౌరభ్ విజయ్ బాధ్యతల స్వీకరణ

నాడు పోస్టు చేయడమైనది: 18 MAY 2026 4:06PM by PIB Hyderabad

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ముఖ్య కార్యనిర్వహణాధికారిగా 1998 బ్యాచ్ మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి శ్రీ సౌరభ్ విజయ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 

ఐఐటీ-ఢిల్లీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆయన.. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వంలోనూ, కేంద్ర ప్రభుత్వంలోనూ పలు కీలక పదవుల్లో సేవలందించారు. 

యూఐడీఏఐలో చేరడానికి ముందు శ్రీ సౌరభ్‌ విజయ్‌ మహారాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖలో ప్రధాన కార్యదర్శిగా (వ్యయం) పనిచేశారు. అంతకుముందు మహారాష్ట్ర ప్రణాళిక, అభివృద్ధి కమిషనర్‌గా,  పర్యాటక శాఖ ప్రధాన కార్యదర్శిగా, వైద్య విద్యా శాఖ కార్యదర్శిగా, ఉన్నత, సాంకేతిక విద్యా శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 

ఆయన కేంద్ర ప్రభుత్వ డెప్యుటేషన్‌పై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కీలక పదవుల్లో పనిచేశారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి సచివాలయంలో డైరెక్టర్‌గా, వాషింగ్టన్ డీసీలోని ప్రపంచ బ్యాంకులో బంగ్లాదేశ్, భూటాన్, భారత్‌, శ్రీలంక దేశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌కు సలహాదారుడిగా కూడా ఆయన పనిచేశారు.


(రిలీజ్ ఐడి: 2262630) సందర్శకుల సూచీ సంఖ్య : : 27
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Gujarati , Tamil