ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

చోళ తామ్ర పత్రాలు భారత్‌కు అప్పగింత

నాడు పోస్టు చేయడమైనది: 16 MAY 2026 10:00PM by PIB Hyderabad

 ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీనెదర్లాండ్స్ ప్రధాని శ్రీ రాబ్ జెట్టెన్‌ల సమక్షంలో ఈ రోజు 11వ శతాబ్దపు చోళుల తామ్ర పత్రాలను లైడెన్ విశ్వవిద్యాలయ గ్రంథాలయం భారత ప్రభుత్వానికి అప్పగించింది.
21 
రాగి పలకలు, 3 చిన్న పలకలతో కూడిన చోళ కాలం నాటి ఈ తామ్ర పత్రాలు క్రీ.. 11వ శతాబ్దంలో చోళ రాజులు జారీ చేసిన శాసనాలుఈ శాసనాలు తమిళనాడులోని నాగపట్టణంలో ఉన్న చూళమణివర్మ-విహార అనే బుద్ధ విహారానికి ఆనైమంగళం గ్రామాన్ని దానం చేస్తూ జారీ చేసిన అధికారిక ఉత్తర్వులను సూచిస్తున్నాయిఈ తామ్ర పత్రాలు తమిళసంస్కృత భాషల్లో ఉన్నాయి.
చోళ కాలం నాటి ఈ తామ్ర పత్రాల అప్పగింత ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందిఇవి కేవలం గతకాలపు కళాఖండాలు మాత్రమే కాదు... భారత వారసత్వంనాగరికతకు సంబంధించిన అమూల్యమైన ఆస్తిఈ తామ్ర పత్రాలు స్వదేశానికి తిరిగి రావడం భారత ప్రజలకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2262034) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam