ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

మార్కెటింగ్ సీజన్ 2026-27లో ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు క్యాబినెట్ ఆమోదం

నాడు పోస్టు చేయడమైనది: 13 MAY 2026 3:23PM by PIB Hyderabad

మార్కెటింగ్ సీజన్ 2026-27లో 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ను పెంచడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్థిక వ్యవహరాలపై క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది.

దిగుబడికి తగిన లాభదాయకమైన ధరలు రైతులకు లభించేలా చూసేందుకు 2026-27 మార్కెటింగ్ సీజన్‌లో ఖరీఫ్ పంటలకిచ్చే ఎంఎస్‌పీని ప్రభుత్వం పెంచింది. గతేడాదితో పోలిస్తే.. పొద్దుతిరుగుడు విత్తనాలకు (క్వింటాలుకు రూ. 622) అత్యధికంగా ఎంఎస్‌పీ పెరిగింది. ఆ తర్వాత పత్తి (క్వింటాలుకు రూ. 557), వలిసెలు (క్వింటాలుకు రూ.515), నువ్వులు (క్వింటాలుకు రూ. 500) పంటలకు ఎంఎస్‌పీ పెరిగింది.

2026-27 మార్కెటింగ్ సీజన్లో అన్ని ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలు (క్వింటాలకు రూ.లలో)

 

S.

No

.

 

Crops

 

MSP 2026-27

 

Cost* KMS 2026-27

Margin over cost (%)

 

MSP

MS MSP Increase in 2026-27

 

 

Cereals

2025-

26

2013-

14

over 2025-26

over 2013-14

 

 

 

 

 

 

 

 

1.

 

Paddy

Common

2441

1627

50

2369

1310

72

1131

(86%)

 

Grade A^

2461

-

-

2389

1345

72

1116

(83%)

2.

 

Jowar

Hybrid

4023

2682

50

3699

1500

324

2523

(168%)

 

Maldandi

^

4073

-

-

3749

1520

324

2553

(168%)

3.

Bajra

2900

1858

56

2775

1250

125

1650

(132%)

4.

Ragi

5205

3470

50

4886

1500

319

3705

(247%)

5.

Maize

2410

1544

56

2400

1310

10

1100

(84%)

 

Pulses

6.

Tur /Arhar

8450

5496

54

8000

4300

450

4150

(97%)

7.

Moong

8780

5438

61

8768

4500

12

4280

(95%)

 

8.

Urad

8200

5418

51

7800

4300

400

3900

(91%)

 

Oilseeds

9.

Groundnut

7517

5011

50

7263

4000

254

3517

(88%)

10.

Sunflower Seed

8343

5562

50

7721

3700

622

4643

(125%)

11.

Soybean (Yellow)

5708

3805

50

5328

2560

380

3148

(123%)

12.

Sesamum

10346

6897

50

9846

4500

500

5846

(130%)

13.

Nigerseed

10052

6701

50

9537

3500

515

6552

(187%)

 

Commercial

 

 

 

 

 

 

 

14.

 

Cotton

(Medium Staple)

8267

5511

50

7710

3700

557

4567

(123%)

 

(Long Staple) ^

8667

-

-

8110

4000

557

4667

(117%)

* కూలీలు, ఎద్దులు/యంత్రాల ఖర్చు, లీజుకు తీసుకున్న భూమికి చెల్లించిన కౌలు, విత్తనాలు, ఎరువులు, సేంద్రియ ఎరువులు లాంటి వాటికయ్యే పెట్టుబడి, నీటిపారుదల ఛార్జీలు, వ్యవసాయ పరికరాలు-నిర్మాణాల్లో తరుగుదల, పెట్టుబడిపై వడ్డీ, పంపుసెట్ల నిర్వహణకు డీజిల్/విద్యుత్ తదితర ఖర్చులు, కుటుంబ శ్రమ అంచనా విలువతో సహా చెల్లింపులు చేసే అన్ని రకాల ఖర్చులను ఇది సూచిస్తుంది.

^ వరి (గ్రేడ్ ఎ), జొన్న (మల్దండి), పత్తి (పొడుగు పింజ)కి సంబంధించిన వ్యయ గణాంకాలను విడిగా లెక్కించలేదు.

దేశం మొత్తమ్మీద సగటు ఉత్పత్తి వ్యయానికి కనీసం 1.5 రెట్లు ఉండేలా ఎంఎస్‌పీని నిర్ణయించాలన్న 2018-19 కేంద్ర బడ్జెట్ ప్రకటనలకు అనుగుణంగా 2026-27 మార్కెటింగ్ సీజన్‌లో ఖరీఫ్ పంటలకు ఎంఎస్‌పీ పెరుగుదల ఉంది. పంట వ్యయంపై రైతులకు అందే అంచనా లాభం పెసరకు అత్యధికంగా (61శాతం) ఉంటుందని భావిస్తున్నారు. ఆ తర్వాత సజ్జ (56%), మొక్కజొన్న (56%), కంది (54%) ఉంటాయని అంచనా. మిగిలిన పంటల విషయానికి వస్తే.. పెట్టుబడి వ్యయంపై రైతులకు దక్కే లాభం 50 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఇటీవలి సంవత్సరాల్లో తృణధాన్యాలు మాత్రమే కాకుండా పప్పులు, నూనె గింజలు, పోషకాలతో నిండిన చిరుధాన్యాలు/శ్రీ అన్న లాంటి పంటలకు సైతం అధిక ఎంఎస్‌పీను అందించి, వాటి సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

2014-15 నుంచి 2025-26 మధ్య కాలంలో సేకరించిన వరి 8418 ఎల్ఎంటీలు కాగా 2004-05 నుంచి 2013-14 వరకు సేకరించిన ధాన్యం 4590 ఎల్ఎంటీలుగా ఉంది.

2014-15 నుంచి 2025-26 వరకు సేకరించిన 14 ఖరీఫ్ పంటలు 8746 ఎల్ఎంటీలు. 2004-05 నుంచి 2013-14 మధ్య సేకరించిన మొత్తం 4679 ఎల్ఎంటీలుగా ఉంది.

వరి రైతులకు2014-15 నుంచి 2025-26 మధ్య కాలంలో రూ.16.08 లక్షల కోట్లు ఎంఎస్‌పీగా అందించగా 2004-05 నుంచి 2013-14 వరకు చెల్లించిన మొత్తం రూ. 4.44 లక్షల కోట్లుగా ఉంది.

2014-15 నుంచి 2025-26 మధ్య కాలంలో 14 ఖరీఫ్ పంటలకుగాను రైతులకు అందించిన ఎంఎస్‌పీ మొత్తం రూ. 18.99 లక్షల కోట్లు కాగా, 2004-05 నుంచి 2013-14 వరకు చెల్లించిన ఎంఎస్‌పీ మొత్తం రూ. 4.75 లక్షల కోట్లు.

 

***


(రిలీజ్ ఐడి: 2260711) సందర్శకుల సూచీ సంఖ్య : : 1130