రాష్ట్రపతి సచివాలయం
‘జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలు-26’ను ప్రదానం చేసిన రాష్ట్రపతి
సేవలో అత్యున్నత ప్రమాణాలకు ఉదాహరణగా నిలుస్తున్న నర్సింగ్ సిబ్బంది.. నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవల అందజేతలో వారిది కీలక భూమిక: రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము
प्रविष्टि तिथि:
12 MAY 2026 12:58PM by PIB Hyderabad
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఈ రోజు (2026 మే 12). ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ‘జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలు-26’ను నర్సింగ్ సిబ్బందికి రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు.
‘జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలు-26’ను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రపతి సందేశాన్ని ఇస్తూ,
‘‘దేశ ప్రజలకు కరుణతో, అచంచల అంకిత భావంతో సేవలను అందిస్తున్న నర్సింగ్ సిబ్బంది, ఆరోగ్య సంరక్షణ వృత్తి నిపుణుల అమూల్య తోడ్పాటును యథోచితంగా గౌరవించుకొనే సందర్భం ఇది. నర్సింగ్ సిబ్బంది సేవలో అత్యున్నత ప్రమాణాలకు ఉదాహరణగా నిలుస్తున్నారు. అంతేకాదు, తరచు అన్నిటి కన్న తీవ్ర సవాళ్లతో కూడిన పరిస్థితుల్లోనూ నాణ్యమైన ఆరోగ్యసేవలను అందజేయడంలో కీలక పాత్రను వారు పోషిస్తున్నారు. పురస్కారాలను గెలుచుకున్న వారిని అందరినీ కర్తవ్యం పట్ల వారు కనబరుస్తున్న స్ఫూర్తిదాయక అంకితభావానికి, అలాగే రోగుల సంరక్షణలో అత్యున్నత ప్రమాణాల్ని పరిరక్షించే దిశగా వారు చేస్తున్న అలుపెరుగని ప్రయత్నాలను నేను అభినందిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
సమాజానికి నర్సింగ్ సిబ్బంది అందిస్తున్న ప్రతిభావంతమైన సేవలకు గుర్తింపునివ్వడానికి ‘జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాల’ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 1973లో ఏర్పాటు చేసింది.
పురస్కారాల జాబితాను చూడటానికి దయచేసి ఈ కింది ఇంగ్లిషు వాక్యాన్ని క్లిక్ చేయగలరు
Please click here to see the list of awardees
***
(रिलीज़ आईडी: 2260255)
आगंतुक पटल : 93
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam