ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కుటుంబంతో ప్రధానమంత్రి భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 10 MAY 2026 10:07PM by PIB Hyderabad

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ.,. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కుటుంబ సభ్యులతో  ఈ రోజు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు.
శ్రీ చంద్రబాబు నాయుడునూ, ఆయన కుటుంబాన్నీ కలుసుకోవడం ఎల్లవేళలా సంతోషాన్ని కలిగిస్తుంటుంది అని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా అనేక అంశాలపైనా, విభిన్న విషయాలపైనా వారు తమ అభిప్రాయాలను పరస్పరం తెలియజేసుకున్నారు.
 సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో  ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -
‘‘హైదరాబాద్‌లో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్లి ఆయనతో పాటు ఆయన కుటుంబంతో భేటీ అయ్యాను. వారిని కలుసుకోవడం,  అనేక అంశాలపై  మేం మా ఆలోచనలను పరస్పరం తెలియజేసుకోవడం ఎప్పటికీ సంతోషదాయకం’’ అని పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 2259817) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Manipuri , Bengali , Gujarati , Tamil , Kannada , Malayalam