ప్రధాన మంత్రి కార్యాలయం
బెంగళూరులో ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ 45వ వార్షికోత్సవాలు.. ప్రసంగ ముఖ్యాంశాల్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
10 MAY 2026 3:14PM by PIB Hyderabad
బెంగళూరులో ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ 45వ వార్షికోత్సవాల సందర్భంగా తాను చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాల్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ వరుస సందేశాలను పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:
‘‘సేవలందించడం మన సమాజపు స్వాభావిక చరిత్ర. ఇది తరతరాలుగా మనకు ప్రేరణను అందించడంతో పాటు మనల్ని శక్తిమంతులుగా తీర్చిదిద్దుతోంది. ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ చేస్తున్న ప్రతి ప్రయత్నంలోనూ ఇదే భావన ఉట్టిపడుతోంది’’.
‘‘దేశ నిర్మాణంలో సమాజం చురుకైన భాగస్వామ్యాన్ని నిర్వర్తించినప్పుడే, ఏ ప్రభుత్వమైనా సఫలం కాగలుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. స్వచ్ఛ్ భారత్ ఉద్యమం వంటి అనేక కార్యక్రమాలను దీనికొక పెద్ద ఉదాహరణగా చెప్పవచ్చు’’.
‘‘దేశం సాధించిన అనేక విజయాల్లో మన యువత చాలా కీలక పాత్రను పోషించింది. ఆధునిక కాలపు సవాళ్లకు పరిష్కారాల్ని కనుగొనడంలో యువతకు ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సాయపడుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను’’.
‘‘అన్ని రంగాల్లో భారత్ అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటే అందుకోసం అనేక స్థాయుల్లో ఉమ్మడి కృషి ఎంతైనా అవసరం. ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వంటి సంస్థలు ఇప్పటి కన్నా మరింత ఎక్కువ శక్తితో ఈ మార్పునకు తోడ్పాటును అందించగలుగుతాయి’’.
***
(रिलीज़ आईडी: 2259530)
आगंतुक पटल : 58
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada