ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ సువేందు అధికారికి ప్రధానమంత్రి అభినందనలు

బెంగాల్ ప్రభుత్వంలో కొత్తగా నియమితులైన మంత్రులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 09 MAY 2026 1:55PM by PIB Hyderabad

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ సువేందు అధికారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు అభినందనలు తెలిపారు.

రాష్ట్ర ప్రజలతో మమేకమై, వారి ఆకాంక్షలను క్షుణ్ణంగా అర్థం చేసుకునే నాయకుడిగా శ్రీ సువేందు అధికారి తనదైన ముద్ర వేశారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. రాబోయే పదవీ కాలం విజయవంతంగా సాగాలని శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ దిలీప్ ఘోష్, శ్రీమతి అగ్నిమిత్ర పాల్, శ్రీ అశోక్ కీర్తనియా, శ్రీ క్షుదీరామ్ తుడు, శ్రీ నిశిత్ ప్రమాణిక్‌లకు కూడా అభినందనలు తెలియాజేశారు.

ఈ నాయకులు క్షేత్రస్థాయిలో అవిశ్రాంతంగా శ్రమిస్తూ ప్రజలకు సేవలందించాలని శ్రీ మోదీ అన్నారు. మంత్రులుగా వీరు పశ్చిమ బెంగాల్ అభివృద్ధి ప్రయాణాన్ని మరింత బలోపేతం చేస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ... వారికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

‘‘పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ సువేందు అధికారికి అభినందనలు. ప్రజలతో మమేకమై, వారి ఆకాంక్షలను దగ్గర నుంచి అర్థం చేసుకునే నాయకుడిగా ఆయన తనదైన ముద్ర వేశారు. ఆయన పదవీ కాలం విజయవంతంగా సాగాలని నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’.

‘‘పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన దిలీప్ ఘోష్ గారు, అగ్నిమిత్ర పాల్ గారు, అశోక్ కీర్తనియా గారు, క్షుదీరామ్ తుడు గారు, నిశిత్ ప్రమాణిక్ గారికి నా అభినందనలు. ఈ నాయకులు క్షేత్రస్థాయిలో అలుపెరుగక శ్రమిస్తూ ప్రజలకు సేవలందించారు. మంత్రులుగా వీరు పశ్చిమ బెంగాల్ అభివృద్ధి ప్రయాణాన్ని మరింత బలోపేతం చేస్తారన్న నమ్మకం నాకుంది. వీరికి నా శుభాకాంక్షలు’’.

***


(రిలీజ్ ఐడి: 2259419) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Gujarati , Odia , Tamil , Malayalam