రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ ఆగ్మంటేషన్ వెపన్ తొలి వైమానిక ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన డీఆర్‌డీవో, ఐఏఎఫ్

నాడు పోస్టు చేయడమైనది: 08 MAY 2026 10:07AM by PIB Hyderabad

టాక్టికల్ అడ్వాన్స్ఢ్ రేంజ్ ఆగ్మెంటేషన్ (టీఏఆర్ఏఆయుధ తొలి వైమానిక ప్రయోగాన్ని రక్షణ పరిశోధనఅభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), భారత వైమానిక దళం (ఐఏఎఫ్విజయవంతంగా నిర్వహించాయి. 2026 మే 7న ఒడిశా తీరంలో ఈ ప్రయోగం జరిగిందిమాడ్యులర్ రేంజ్ ఎక్స్‌టెన్షన్ కిట్ అయిన టీఏఆర్ఏ.. అన్ గైడెడ్ క్షిపణులను గైడెడ్ క్షిపణులుగా మార్చగల భారత దేశపు మొట్టమొదటి స్వదేశీ గ్లైడ్ ఆయుధ వ్యవస్థ.

image.png

భూతల లక్ష్యాలను నిర్వీర్యం చేసేలా తక్కువ ఖర్చుతో ఈ ఆయుధ కచ్చితత్వాన్నివిధ్వంసక శక్తిని పెంచేందుకు ఇతర డీఆర్‌డీవో ల్యాబరేటరీలతో కలసి హైదరాబాద్‌లోని రీసెర్చి సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐటీఏఆర్ఏను రూపొందించి అభివృద్ధి చేసిందిఅత్యాధునికమైనతక్కువ ఖర్చుతో రూపొందించిన మొదటి గ్లైడ్ ఆయుధమిదిఅభివృద్ధిఉత్పత్తి భాగస్వాములు (డీసీపీపీ), ఇతర భారతీయ పరిశ్రమలతో కలసి ఈ కిట్‌ను అభివృద్ధి చేశారుఇవి ఇప్పటికే ఉత్పత్తిని ప్రారంభించాయి.

తొలి వైమానిక ప్రయోగం నేపథ్యంలో డీఆర్‌డీవోఐఏఎఫ్డీసీపీపీనుపరిశ్రమను రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభినందించారుస్వదేశీ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో దీనిని ముఖ్యమైన పరిణామంగా వర్ణించారు.

వైమానిక ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన బృందాలను రక్షణ శాఖ పరిశోధనాభివృద్ధి విభాగం కార్యదర్శిడీఆర్‌డీవో ఛైర్మన్ డాక్టర్ సమీర్ వీ కామత్  అభినందించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2258957) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Kannada