హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఢిల్లీలో ఆరు జనగణన అవగాహన ప్రచార వాహనాలను ప్రారంభించిన జనగణన రిజిస్ట్రార్ జనరల్, కమిషనర్


జనగణనలో భాగస్వామ్యం, స్వీయ గణన సదుపాయం, 2027 జనగణన ముఖ్య విషయాల సందేశాలను నగరమంతా ప్రచారం చేయనున్న వాహనాలు

ఢిల్లీ ఎన్‌సీటీలోని ఎమ్‌సీడీ ప్రాంతాల్లో గృహాల జాబితా తయారీ కార్యకలాపాల (హెచ్ఎల్‌వో) కోసం కొనసాగుతున్న స్వీయ-గణన (ఎస్ఈ) ప్రక్రియ

ఢిల్లీలోని ఎన్ఎమ్‌డీసీ, కంటోన్మెంట్ బోర్డు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఇంటింటి సందర్శన

ఉత్తరప్రదేశ్‌లో ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న స్వీయ గణన


23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో స్వీయ గణన పూర్తి చేసుకున్న సుమారు 92 లక్షల కుటుంబాలు

1948 జనాభా గణన చట్టం ప్రకారం... అత్యంత గోప్యంగా జనగణన సమాచారం

గణాంక ప్రయోజనాలు, అభివృద్ధి ప్రణాళికలో మాత్రమే వినియోగం

నాడు పోస్టు చేయడమైనది: 07 MAY 2026 4:48PM by PIB Hyderabad

‘జనగణన-2027’ మొదటి దశ అయిన 'గృహాల జాబితా-గృహ గణన' (హెచ్ఎల్‌వో)కు సంబంధించి ఢిల్లీ ఎన్‌సీటీలో చేపట్టిన ప్రజా చైతన్య ప్రచారంలో భాగంగా ఈ రోజు న్యూఢిల్లీలోని 'జనగణన భవన్నుంచి ఆరు ప్రచార వాహనాలను రిజిస్ట్రార్ జనరల్, భారత జనగణన కమిషనర్ ప్రారంభించారు.

జనగణనలో ప్రజల భాగస్వామ్యంస్వీయ గణన (ఎస్ఈసదుపాయంజనగణన-2027 గురించిన ముఖ్య విషయాలు సహా క్షేత్రస్థాయి సందర్శనల సమయంలో గణన సిబ్బందికి ప్రజలు సహకరించాల్సిన ప్రాముఖ్యతను వివరించే సందేశాలను జనగణన అవగాహన ప్రచార వాహనాలు ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం అంతటా ప్రజలకు చేరవేస్తాయి. జనగణన గురించిన సమాచారాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయడంప్రజల్లో అవగాహనను పెంపొందించడం, దేశ రాజధాని ప్రాంతంలో జనగణన కార్యకలాపాలను సజావుగా నిర్వహించడానికి వీలు కల్పించడం ఈ ప్రచార ముఖ్య ఉద్దేశం.

ప్రస్తుతం ఢిల్లీ ఎన్‌సీటీ ప్రాంతంలో గృహాల జాబితా-గృహ గణన కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్ఎమ్‌డీసీ), కంటోన్మెంట్ బోర్డు ప్రాంతాల్లో 2026 ఏప్రిల్ 15తో పూర్తయిన హెచ్ఎల్‌వో స్వీయ గణన తర్వాత... ఏప్రిల్ 16 నుంచి గణన సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించే ప్రక్రియ ప్రారంభమైంది. ఇది ఈ నెల 15న ముగుస్తుంది.

 

ఢిల్లీ ఎన్‌సీటీలోని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎమ్‌సీడీ) ప్రాంతాల్లో ప్రస్తుతం స్వీయ గణన జరుగుతోంది. నివాసితులు 2026 మే 1 నుంచి మే 15 వరకు ప్రకటించిన కాలంలో అధికారిక సెన్సస్ పోర్టల్ (https://se.census.gov.inద్వారా స్వీయ గణన ద్వారా వారి వివరాలను సమర్పించవచ్చు. దీని తర్వాత మే 16 నుంచి జూన్ 14 వరకు గణన సిబ్బంది ఇంటింటికీ వెళ్లి గృహ జాబితా కార్యకలాపాలను పూర్తి చేస్తారు.

స్వీయ గణన పూర్తి చేసిన నివాసితులు వారి స్వీయ గణన ఐడీని భద్రంగా ఉంచుకోవాలి. హెచ్ఎల్‌వో ప్రక్రియను పూర్తి చేయడానికి క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఇంటికి వచ్చే గణన సిబ్బందికి ఆ ఐడీని అందించాలి.

2027 జన గణనలో తొలిసారిగా ప్రవేశపెట్టిన 'స్వీయ గణనసదుపాయానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. 23 రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో ఇప్పటివరకు సుమారు 92 లక్షల కుటుంబాలు అధికారిక పోర్టల్ ద్వారా తమ స్వీయ గణన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశాయి.

2027 జన గణనలోని హెచ్ఎల్‌వో దశలో ప్రధానంగా ఇంటికి సంబంధించిన వివరాలునివాస పరిస్థితులుఅందుబాటులో ఉన్న సదుపాయాలు, కుటుంబాలు కలిగి ఉన్న వస్తువులకు సంబంధించిన 33 నిర్దేశిత ప్రశ్నలతో రూపొందించిన ఒక క్రమబద్ధమైన ప్రశ్నావళి ద్వారా కుటుంబాల సమాచారాన్ని సేకరిస్తారు. ఈ విధంగా సేకరించిన సమాచారాన్ని ప్రభుత్వ ప్రణాళికలు, పాలసీల రూపకల్పనలో... ప్రజా సేవలను సమర్థంగా అందించేందుకు కీలక ప్రాతిపదికగా మాత్రమే వినియోగిస్తారు.

ఉత్తరప్రదేశ్‌లో ఈ రోజు గృహాల జాబితా రూపకల్పన-గృహ గణన దశ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఉత్తరప్రదేశ్ నివాసితులు 2026 మే 7 నుంచి మే 21 వరకు నిర్దేశించిన కాలంలోఅధికారిక పోర్టల్ ద్వారా 'స్వీయ గణనప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఆ తరువాత మే 22 నుంచి జూన్ 20 వరకు గణన సిబ్బంది నేరుగా ఇంటింటికీ వెళ్లి గృహ గణన ప్రక్రియను పూర్తి చేస్తారు.

తెలంగాణపంజాబ్రాజస్థాన్ఢిల్లీ (ఎమ్‌సీడీ), మహారాష్ట్రమేఘాలయ, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం హెచ్ఎల్‌వో స్వీయ గణన ప్రక్రియ కొనసాగుతోంది.

ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం... ప్రస్తుతం అండమాన్-నికోబార్ దీవులుఆంధ్రప్రదేశ్అరుణాచల్ ప్రదేశ్బీహార్చండీగఢ్ఛత్తీస్‌గఢ్దాద్రా-నగర్ హవేలి, డామన్-డయ్యూఢిల్లీ (ఎన్ఎమ్‌డీసీ, ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డు ప్రాంతాలు)గోవాహర్యానాకర్ణాటకలక్షద్వీప్మధ్యప్రదేశ్మిజోరంఒడిశాసిక్కిం, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో గణన సిబ్బంది ఇంటింటి సందర్శన కొనసాగుతోంది.

1948 జనగణన చట్టం ప్రకారం... జనగణన ద్వారా సేకరించిన సమాచారమంతా గోప్యంగా ఉంచుతారు. కేవలం గణాంక ప్రయోజనాల కోసంఅభివృద్ధి ప్రణాళికల కోసం మాత్రమే దీనిని వినియోగిస్తారు. నోటిఫై చేసిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నివాసితులంతా ఇళ్ల జాబితా రూపకల్పన కార్యకలాపాల సమయంలో గణన సిబ్బందికి పూర్తి సహకారం అందించాలనీ, ఈ ముఖ్యమైన జాతీయ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలని కోరడమైనది.

***


(రిలీజ్ ఐడి: 2258898) సందర్శకుల సూచీ సంఖ్య : : 29
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada