భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

శాసనసభలకు సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలు-2026


కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడటంతో పాటు వేగవంతమైన నివేదికలను, మెరుగైన సైబర్ భద్రతను అందించే ఈసీఐనెట్

प्रविष्टि तिथि: 06 MAY 2026 4:42PM by PIB Hyderabad
  1. శాసనసభలకు సాధారణ ఎన్నికలుఉప ఎన్నికలు-2026లో ఎన్నికల ప్రక్రియను క్రమబద్దీకరించటంలో భారత ఎన్నికల సంఘం (ఈసీఐపటిష్ఠ ఐటీ వేదిక ఈసీఐనెట్ కీలక పాత్ర పోషించిందినిశితంగా పర్యవేక్షించటంవేగంగా నివేదికలను అందించటంపారదర్శకతను పెంపొందించటంలో ఇది ఎంతగానో తోడ్పడింది.

  2. జనవరి 2026లో అధికారికంగా ప్రారంభమైనప్పటి నుంచి ఈసీఐనెట్ యాప్ వినియోగం గణనీయంగా పెరిగిందిఇప్పటివరకు 10 కోట్లకు పైగా డౌన్‌లోడ్లు అయ్యాయినవంబర్ 2025లో జరిగిన బీహార్ ఎన్నికల్లో ఈసీఐనెట్ బీటా వెర్షన్‌ను వినియోగించారు.

  3. ఎన్నికలు జరిగిన ఏప్రిల్ 9, 23, 29 తేదీల్లో ఈసీఐనెట్‌ను సందర్శించిన వారి సంఖ్య 98.3 కోట్లకు పైగా నమోదు కాగాఓట్ల లెక్కింపు రోజు మే 4, 2026న నిమిషానికి సగటున కోట్ల మంది చూశారు.

  4. ఓట్ల లెక్కింపు రోజున మన దేశంఇతర దేశాల నుంచి ఎన్నికల ఫలితాల పోర్టల్‌ లక్ష్యంగా జరిగిన 68 లక్షలకు పైగా సైబర్ దాడులను ఈసీఐనెట్ సైబర్ సెక్యూరిటీ సమర్థవంతంగా అడ్డుకుంది.

  5. కౌంటింగ్ రోజున ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భద్రతను పెంచే దిశగా ఈ ఎన్నికల్లో తొలిసారిగా అన్ని రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల్లో ఈసీఐనెట్ ద్వారా క్యూఆర్ కోడ్ ఆధారిత ఫొటో గుర్తింపు కార్డు విధానాన్ని అమలు చేశారు.

  6. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి అనధికార వ్యక్తులు రాకుండా అడ్డుకునేందుకు కేవలం అనుమతి ఉన్నవారికి మాత్రమే ప్రవేశం కల్పించేలా 3.2 లక్షలకు పైగా క్యూఆర్‌ కోడ్లను రూపొందించారు.

 

***


(रिलीज़ आईडी: 2258556) आगंतुक पटल : 84
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , English , हिन्दी , Bengali , Gujarati , Kannada , Malayalam