ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
‘స్వస్థ్ భారత్ పోర్టల్’ ప్రారంభం
దేశ ఆరోగ్య రంగంలో డిజిటల్ ప్రధాన మార్పులకు వేగాన్నందించడానికి
అనేక ఆరోగ్య సంబంధిత వ్యవస్థల ఏకీకరణ
ఒకే చోటులో అన్ని సదుపాయాలతో ‘స్వస్థ్ భారత్ పోర్టల్’.. ఏపీఐ మాధ్యమం ద్వారా కార్యక్రమాల ఏకీకరణ.. అంతర నిర్వహణీయతకు వీలు.. తగ్గనున్న పరిపాలన భారం
ఆరోగ్య కార్యక్రమాల్లో డేటా ఎంట్రీ పునరావృతిని నివారించే వేదిక ఇది.. రిపోర్టింగ్ వ్యవస్థీకరణ..సత్వర నిర్ణయాలు
ఏబీడీఎమ్ అనుగుణంగా ‘స్వస్థ్ భారత్ పోర్టల్’.. సురక్షిత స్వాస్థ్య డేటాను ఇచ్చి పుచ్చుకోవడానికీ, అంతర నిర్వహణీయ డిజిటల్ ఆరోగ్య అనుబంధ విస్తారిత వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం ఏబీహెచ్‌ఏ ఏకీకరణకీ మార్గం సుగమం
ప్రతిపాదిత లాభాలు: 20 నుంచి 30 శాతానికి తగ్గనున్న మౌలిక సదుపాయాల భారం... 20 నుంచి 40 శాతానికి తగ్గనున్న డేటా ఎంట్రీ, మానవ వనరుల భారం
నాడు పోస్టు చేయడమైనది:
06 MAY 2026 11:05AM by PIB Hyderabad
దేశ ఆరోగ్యసంరక్షణ రంగంలో మరో ముఖ్యమైన మార్పునకు శ్రీకారం చుట్టారు. ‘స్వస్థ్ భారత్ పోర్టల్’. దీనిని ఇటీవల ‘‘నూతన ఆవిష్కరణలు, సమ్మిళితత్వం: భారత ఆరోగ్య భవిష్యత్తుకు రూపాన్నిచ్చే అత్యుత్తమ అభ్యాసాలు’’ అంశంపై పదో జాతీయ శిఖరాగ్ర సదస్సును నిర్వహించిన సందర్భంగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కేంద్ర మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా ఈ పోర్టల్ ను ప్రారంభించారు. ఇది మరింత ఏకీకరించిన, సమర్థమైన, విస్తరణకు అనువైన డిజిటల్ ప్రజారోగ్య ప్రణాళిక దిశగా మరో కీలక మార్పునకు ఒక నిదర్శనమని చెప్పవచ్చు.

వివిధ జాతీయ స్వాస్థ్య కార్యక్రమాల్లో భాగంగా సేవల అందజేత, పర్యవేక్షణ, రిపోర్టింగ్ ప్రక్రియలలో సహాయాన్ని అందించడానికి అనేక డిజిటల్ అప్లికేషన్లను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎమ్‌హెచ్‌ఎఫ్‌డబ్ల్యూ) గత కొన్ని సంవత్సరాల కాలంలో అభివృద్ధిపరిచింది. ఈ వేదికలు పెద్ద ఎత్తున డిజిటల్ సమాచార సమీకరణకు దోహదం చేశాయి. కానీ వీటిలో చాలా అప్లికేషన్లను విడి విడిగా నిర్వహిస్తున్నారు. దీంతో ఒకే రకం ప్రయత్నాల్నే మళ్లీ మళ్లీ చేయాల్సి వస్తోంది. డేటాసెట్స్ చీలికలువాలికలు అవుతున్నాయి. వనరులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోతున్నారు.
ఈ సవాలును అధిగమించడానికి స్వస్థ్ భారత్ పోర్టల్‌ను ఒక సమష్టి వేదిక (యాగ్రిగేటర్ ప్లాట్‌ఫారమ్)గా తెర మీదకు తీసుకు వచ్చారు. ఇది ఏపీఐ-ఆధారిత ఫెడరేటెడ్ ఆర్కిటెక్చర్ ద్వారా ప్రస్తుత అప్లికేషన్లను ఏకీకరిస్తుంది. అంతర నిర్వహణీయతకీ, కలయికకీ మార్గాన్ని సుగమం చేస్తుంది. కార్యక్రమాలన్నిటినీ ఒక ఏకీకరించిన డిజిటల్ స్థాయికి తీసుకురావడం సాధ్యపడుతోంది. ఏకీకృత డిజిటల్ లేయర్.. అనేక జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను ఒకే తెరపైకి తీసుకువస్తుంది. దీంతో పలుమార్లు లాగిన్ అయ్యే, ప్రతి సారీ డేటాను ఎంటర్ చేసే అగత్యం ఇకపై ఎదురవదు. అంతేకాదు, ఆరోగ్య సేవల్ని అందించే సంస్థలపై పరిపాలనపరమైన భారం గణనీయంగా తగ్గిపోతుంది. అదే సమయంలో, అన్ని స్థాయుల్లోనూ సామర్థ్యం మెరుగుపడుతుంది.
భారత్‌లో ముందు వరుసలోని ఆరోగ్య కార్యకర్తలు, ‘ఆశా’ (ఏఎస్హెచ్ఏ) కార్యకర్తలు, ఏఎన్ఎమ్లు, సీహెచ్‌ఓలు, వైద్య అధికారుల (ఎమ్ఓస్)కు తరచు కార్యక్రమాల వివరాలను నమోదు చేసేందుకు అనేక రకాల అప్లికేషన్లను ఉపయోగించడానికి చాలా సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది. ‘స్వస్థ్ భారత్ పోర్టల్’ రూపంలో ఒకే వేదికను అందుబాటులోకి తీసుకురావడం వల్ల ఇకపై ఈ సమస్య ఉండదు. డేటా తేలికగా సేకరించవచ్చు. డేటా విజువలైజేషన్ టూల్, స్థానికంగా పర్యవేక్షణ, సాక్ష్యాధారిత ప్రణాళిక రచన కోసం డేటాను ఉపయోగించుకొనే సౌలభ్యాలు సమకూరుతాయి. ఈ పోర్టల్ ఏబీడీఎమ్‌కు అనుగుణంగా ఏబీహెచ్ఏ (ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా)తో పాటు, ఏకీకరణకూ మద్దతిస్తుంది. ఫలితంగా రోగి ఆరోగ్య రికార్డును ఎలాంటి ఇబ్బందీ లేకుండా, సురక్షితంగా ఇచ్చి పుచ్చుకోవడం సాధ్యపడుతుంది. ఒక విస్తృత, అంతర నిర్వహణీయ డిజిటల్ ఆరోగ్య అనుబంధ విస్తారిత వ్యవస్థలాగా అభివృద్ధి పరిచే దృష్టితో డిజైన్ చేశారు. ఆరోగ్యసంరక్షణ రంగ వృత్తినిపుణుల రిజిస్ట్రీ (హెల్త్ ప్రొఫెషనల్స్ రిజిస్ట్రీ.. హెచ్‌పీఆర్), ఆరోగ్య సదుపాయాల రిజిస్ట్రీ (హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ.. హెచ్‌ఎఫ్‌ఆర్) వంటి జాతీయ రిజిస్ట్రీలతో కలుపుతారు.
‘స్వస్థ్ భారత్ పోర్టల్’లో…. :
• మౌలిక సదుపాయాల్లో పునరావృతాన్ని తగ్గించడం: వివిధ కార్యక్రమాల్లో స్వతంత్ర హోస్టింగు, స్టోరేజీ, కంప్యూట్ వనరులను కొనసాగిస్తారు. స్వస్థ్ భారత్ పథకం మాధ్యమం ద్వారా వీటిని జోడించడం పూర్తి చేసినప్పుడు, ఈ దశలు తగ్గిపోతాయి.
• డేటాను ప్రతిసారీ నమోదు చేయడం తగ్గుతుంది: ఒకే విధమైన లబ్ధిదారుల సమాచారాన్ని అనేక వేదికల్లో నమోదు చేసే ప్రక్రియకు బదులు ఇక ఒకే వేదికపై నమోదు చేస్తారు. దీంతో అనేక సార్లు చేయాల్సిన పని తగ్గుతుంది.
• ఏకీకరించిన మానవ వనరులు (హెచ్ఆర్) రంగంలోకి: అన్ని కార్యక్రమాల్లోనూ వేర్వేరు అభివృద్ధి, నిర్వహణ (మెయింటెనెన్స్) బృందాల అవసరం ఉండేది. ఇప్పుడు ఏకీకరించిన వ్యవస్థతో, మానవ వనరుల భారం తగ్గుతుంది.
• మెరుగుపడనున్న అంతర నిర్వహణీయత: సిస్టమ్‌ను ఏపీఐ మాధ్యమం నుంచి ఫెడరేటెడ్ ఆర్కిటెక్చర్ విధానంలోకి మార్చిన కారణంగా అంతర నిర్వహణీయత అధికమవుతుంది.
‘స్వస్థ్ భారత్ పోర్టల్’ రాకతో ప్రస్తుతం వివిధ కార్యక్రమ విభాగాల ద్వారా నిర్వహిస్తున్న వ్యక్తిగత పోర్టళ్లతో పోలిస్తే మానవ వనరులు, సమయం, ఐటీ మౌలిక స్వరూపం.. ఈ అంశాల్లో ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో పొదుపునకు ఆస్కారం ఏర్పడుతుంది. స్వస్థ్ భారత్ పోర్టల్ ఒక ఏకీకరించిన, సమర్థమైన, విస్తరణకనువైన డిజిటల్ ప్రజా మౌలిక స్వరూపం దిశగా మార్పునకు రంగాన్ని సిద్దం చేస్తుంది. దీంతో సామర్థ్యంలో చెప్పుకోదగ్గ వృద్ధి నమోదవుతుంది.
• మౌలిక సదుపాయాలు: దాదాపు 20 నుంచి 30 శాతం వరకు తగ్గుతాయి
• డేటా నమోదుకు పట్టే సమయం: సుమారు 20 నుంచి 40 శాతం వరకు తగ్గుతాయి
• మానవ వనరుల పునరావృతం: ఇంచుమించు 20 నుంచి 40 శాతం వరకూ తగ్గుతాయి
• నిర్ణయాలు తీసుకోవడంలో వేగం: పెరుగుతుంది
ఈ విధంగా, దేశ ప్రజారోగ్య వ్యవస్థలో కలయిక (కన్వర్జెన్స్), సామర్థ్యం, డేటా చోదకశక్తిగా నిలిచే పరిపాలనల దిశగా పరివర్తన ప్రధానమైన ప్రయాణానికి ‘స్వస్థ్ భారత్ పోర్టల్’ ప్రాతినిధ్యాన్ని వహిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2258375)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7