రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

మన రక్షణ పరిశ్రమల నుంచే భారత సైనిక శక్తి... స్వదేశీ ఆయుధ సామర్థ్యాన్ని ప్రదర్శించిన ఆపరేషన్ సిందూర్: నార్త్ టెక్ సింపోజియం-2026లో రక్షణశాఖ సహాయ మంత్రి


వికసిత్ భారత్ లక్ష్యాన్ని నడిపిస్తున్న శక్తి అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈలే

నాడు పోస్టు చేయడమైనది: 05 MAY 2026 12:03PM by PIB Hyderabad

‘‘మన రక్షణ రంగ ఫ్యాక్టరీల నుంచే భారత దేశ సైనిక శక్తి ఉద్భవిస్తోంది’’ అని రక్షణ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేథ్ అన్నారుస్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అత్యాధునిక ఆయుధాలుఆయుధ వ్యవస్థల సామర్థ్యంతో బలోపేతమైన రక్షణ బలగాల అసమానమైన ధైర్యంసంకల్పమే ఆపరేషన్ సిందూర్ విజయానికి కారణమన్నారుఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న నార్త్ టెక్ సింపోజియంలో 2026 మే 5న పాల్గొన్నారుఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ భారత దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్ఎంఈలే వెన్నెముక అనిఅంకుర సంస్థలే దేశానికి బ్రాండ్ అంబాసిడర్లని అన్నారు. ‘‘భవిష్యత్తు వృద్ధిని నడిపించేది మన అంకుర సంస్థలుఎంఎస్ఎంఈలే. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను నెరవేర్చడంలో కీలకపాత్ర పోషించే ఆధునిక విశ్వకర్మలు ఇవి’’ అని అన్నారు.

ఆపరేషన్ సిందూర్ సమయంలో ఉగ్రవాదుల స్థావరాలను నిర్మూలించిభారత దేశ శత్రువుల కుయుక్తులను భగ్నం చేసిన రక్షణ బలగాలను రక్షణ శాఖ సహాయ మంత్రి ప్రశంసించారురక్షణ రంగంలో ఆత్మ నిర్భరతను సాధించాలనే మొత్తం దేశం ప్రభుత్వండీపీఎస్‌యూలుప్రైవేటు రంగంముఖ్యంగా ఆవిష్కర్తలుఅంకుర సంస్థలుఎంఎస్ఎంఈల సంకల్పానికి మేడ్ ఇన్ ఇండియా సాధనాల సమర్థ వినియోగమే నిదర్శనమన్నారు.

దేశ ప్రయోజనాలను కాపాడేలా తన సొంత సామర్థ్యాలను బలోపేతం చేసుకోవాలని విశ్వసించే నవ భారత ఆవిర్భావానికి రికార్డు స్థాయిలో నమోదైన రక్షణ ఉత్పత్తి, రక్షణ ఎగుమతుల గణాంకాలే నిదర్శనమని రక్షణ శాఖ సహాయ మంత్రి స్పష్టం చేశారు. ‘‘ఈ నవ భారతం ఎవరికీ చెడు చేయాలని ప్రయత్నించదుతన సార్వభౌమత్వానికి ముప్పు కలిగించాలని ప్రయత్నించేవారిని విడిచిపెట్టదు’’ అని చెప్పారు.

ఈ రోజు వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం రేపు ఉపయోగించకపోవచ్చని రక్షణ శాఖ సహాయ మంత్రి అన్నారుఅంతర్జాతీయంగా అనిశ్చితులు నెలకొన్న ఈ తరుణంలో వినూత్నంగా ఆలోచించి సాంకేతికంగా ముందంజలో ఉండేందుకు కృషి చేయాలని పరిశ్రమలను కోరారుదేశంలో రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారుఆవిష్కరణ నిరంతరాయంగా కొనసాగే ప్రక్రియ అనీదీనికి పూర్తి ప్రభుత్వ సహకారం ఉంటుందనీ చెప్పారుఉత్తరప్రదేశ్‌లోని రక్షణ పారిశ్రామిక కారిడార్ తీసుకొచ్చిన గుణాత్మక ప్రభావాన్ని గుర్తించారుఈ ప్రగతిని ఉన్నత శిఖరాలకు చేర్చాలని పరిశ్రమను కోరారు.

నూతన రంగాల్లో ప్రస్తుతం కార్యాచరణ అవసరాలను తీర్చడానికిభారత ఆర్మీని భవిష్యత్తు అవసరాలకు తగినట్టుగా సిద్ధం చేయడానికి రక్షణ బలగాలతో కలసి పనిచేయాలని పరిశ్రమలను జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ (జీవోసీ-ఇన్-సీ), సెంట్రల్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ అనింధ్య సేన్ గుప్త అభ్యర్థించారుస్వావలంబనే వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తికిసాంకేతిక సార్వభౌమత్వానికికార్యాచరణ రూపకల్పనకు దారి తీస్తుందన్నారు.

మూడు రోజుల పాటు జరిగే నార్త్ టెక్ సింపోజియం-2026ను భారత ఆర్మీకి చెందిన ఉత్తరమధ్య సైనిక విభాగాలుఎస్ఐడీఎం నిర్వహిస్తున్నాయి. ‘‘రక్షణ త్రివేణీ సంగమంసాంకేతిక పరిజ్ఞానంపరిశ్రమసైనిక సామర్థ్యాలు కలిసే చోటు’’ అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం కొనసాగుతోందిదీనిని 2026 మే 4న రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారుఅత్యాధునిక రక్షణ రంగ సాంకేతికతను ప్రదర్శించేందుకు ప్రైవేటు రక్షణ ఉత్పత్తుల తయారీదారులు 284 స్టాళ్లను ఏర్పాటు చేశారుమానవ రహిత ఏరియల్ వాహనాలు (యూఏవీలు), డ్రోన్లుకౌంటర్ యూఏవీలుఅన్ని భూతల వాహనాలునిఘా సాధనాలుఇతర రక్షణ ఉత్పత్తులను సైతం ఈ కార్యక్రమంలో ప్రదర్శిస్తారు.

జీవోసీ-ఇన్-సీ ఉత్తర కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ, 1 కోర్స్ జీవోసీ లెఫ్టినెంట్ జనరల్ వీ హరిహరన్భారత రక్షణ తయారీదారుల సంఘం (ఎస్ఐడీఎంఅధ్యక్షుడు శ్రీ అరుణ్ టీ రాంచందానీపరిశ్రమ దిగ్గజాలుఆవిష్కర్తలుఅంకుర సంస్థలుపరిశోధనా సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2258010) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Punjabi , English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Manipuri , Gujarati