గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
“విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా-2025: సెలెక్టడ్ ఇండికేటర్స్ అండ్ డేటా” పుస్తకావిష్కరణ
నాడు పోస్టు చేయడమైనది:
29 APR 2026 3:22PM by PIB Hyderabad
కేంద్ర గణాంక-కార్యక్రమాల అమలు శాఖ ఇవాళ ఒడిషాలోని భువనేశ్వర్‌లో నిర్వహించిన “అభివృద్ధి కోసం డేటా”పై జాతీయ స్థాయి చర్చాగోష్ఠి సందర్భంగా “భారత్‌లో మహిళలు.. పురుషులు-2025: నిర్దిష్ట సూచీలు.. సమాచారం’ శీర్షికన తన 27వ ప్రచురణను ఆవిష్కరించింది.

వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల నుంచి అందిన సమాచారం ఆధారంగా మంత్రిత్వ శాఖ ఈ పుస్తకాన్నిప్రచురించింది. ఇందులో జనాభా, విద్య, ఆరోగ్యం, ఆర్థిక భాగస్వామ్యం, నిర్ణయాత్మకత, మహిళలపై హింస, ఇతర లింగ సంబంధిత సమస్యలు సహా కీలక రంగాల్లో నిర్దిష్ట సూచీల సంకలనంతో దేశంలోని మహిళలు-పురుషుల స్థితిగతులపై సమగ్ర అవలోకనాన్ని అందించింది. ఈ పుస్తకంలోని గణాంకాలకు ప్రాతిపదికలైన భావనలు, నిర్వచనాలు, మూలాలు, విధానపరమైన అంశాలపై స్పష్టత దిశగా, వాటిని మరింత సులువుగా అర్థం చేసుకోవడం కోసం 50 కీలక సూచీల సమస్త సమాచారాన్నీ జోడించింది.
అధికారిక గణాంకాల ఆధారంగా విస్తృత శ్రేణి అంశాలలో లింగపరంగా విభజించిన సమాచారం ఇవ్వడం లక్ష్యంగా ఈ ప్రచురణను తీసుకొచ్చింది. ఇందులో గ్రామీణ-పట్టణ వర్గీకరణ, రాష్ట్రం-కేంద్రపాలిత ప్రాంతాలవారీగా, సౌలభ్యానుసారం కాలక్రమంపరంగా అనేక సూచీల ద్వారా వివరాలు పొందుపరచింది. తద్వారా దేశవ్యాప్తంగా లింగ అసమానతలు-అభివృద్ధి ధోరణులపై ఈ పుస్తకం పూర్తి అవగాహన కల్పిస్తుంది.
కీలక సామాజిక-ఆర్థిక సూచీల విశ్లేషణతోపాటు కొత్త ధోరణులను ప్రముఖంగా ప్రస్తావించడం ద్వారా విధాన రూపకర్తలు, పరిశోధకులు, ఇతర భాగస్వాములకు ఈ పుస్తకం విలువైన నిదర్శనాధారిత గణాంకాలను అందించింది. సమ్మిళిత, సుస్థిర ప్రగతిని ప్రోత్సహించే లక్ష్యంతో లింగ-ప్రతిస్పందనాత్మక విధానాలు, కార్యక్రమాల రూపకల్పనకు ఇది తోడ్పడుతుంది.
“విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా-2025: సెలెక్టడ్ ఇండికేటర్స్ అండ్ డేటా” పుస్తకం మంత్రిత్వశాఖ వెబ్‌సైట్ https://mospi.gov.in/లో లభ్యమవుతుంది.
ఇందులోని కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి:
1. అఖిలభారత స్థాయిలో జనన సమయ లింగ నిష్పత్తి పెరిగింది. బాలికల మనుగడ శాతం మెరుగుపడటాన్ని ఇది సూచిస్తుంది. ఈ మేరకు 2017-19లో 904గా ఉన్న నిష్పత్తి 2021-23 నాటికి 917కు పెరిగింది.

2. ఆడ, మగ శిశువుల మరణ శాతంలో 2008-2023 మధ్య స్పష్టంగా, నిలకడగా తగ్గుదల నమోదైంది.

3. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత మాధ్యమిక స్థాయి దాకా పాఠశాల విద్యలో లింగ సమానత్వం నమోదైంది.

4. ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 2021-22... 2022-23 మధ్య మహిళల విషయంలో 28.5 నుంచి 30.2కు, పురుషుల విషయంలో 28.3 నుంచి 28.9కి మెరుగుపడింది.

5. 15 ఏళ్లు అంతకన్నా ఎక్కువ వయసున్న పురుషులు-మహిళలు ఇద్దరిలోనూ ‘లైవ్ ఫెయిల్యూర్ పర్ రెస్ట్రిక్షన్’ పెరిగింది. ముఖ్యంగా, 2022-2025 మధ్య గ్రామీణ మహిళల్లో ‘ఎల్‌ఎఫ్‌పీఆర్’ అత్యధికంగా 37.5 శాతం నుంచి 45.9 శాతానికి చేరింది.

6. నిర్వాహక పదవులలో 2017-2025 మధ్య పురుషుల పెరుగుదల 73.80 శాతం కాగా, అదే వ్యవధిలో మహిళలలో పెరుగుదల 102.54 శాతంగా ఉంది.

ఈ పుస్తకం మంత్రిత్వశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా దిగువన కనిపించే ‘క్యూఆర్’ ద్వారా కూడా ఇది లభిస్తుంది.

***
(రిలీజ్ ఐడి: 2256787)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10