హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మాదకద్రవ్యాల స్మగ్లర్ మహమ్మద్ సలీం డోలాను టర్కీ నుంచి తిరిగి రప్పించడంలో కీలక విజయం సాధించిన మాదక ద్రవ్యాల నియంత్రణ మండలి


మాదకద్రవ్యాల ముఠాల పట్ల కఠిన వైఖరి... ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు

మాదకద్రవ్యాల నేరస్థులు, వ్యవస్థీకృత నేరగాళ్లందరినీ చట్టం ముందు నిలబెట్టాలనే మోదీ ప్రభుత్వ దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తున్న సలీం డోలా అరెస్టు

ఇకపై డ్రగ్ మాఫియా నాయకులు ఎక్కడ దాకున్నా రక్షణ ఉండదు

పటిష్టమైన వ్యవస్థ ద్వారా సరిహద్దులు దాటి తమ ప్రభావాన్ని విస్తరించిన దేశీయ మాదకద్రవ్యాల నిరోధక సంస్థలు

నాడు పోస్టు చేయడమైనది: 28 APR 2026 2:03PM by PIB Hyderabad

మాదక ద్రవ్యాల ముఠాల పట్ల మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న జీరో టాలరెన్స్ (ఉపేక్షించబోని) విధానానికి అనుగుణంగా... అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ మహ్మద్ సలీం డోలాను టర్కీ నుంచి భారత్‌కు తీసుకురావడంలో మాదకద్రవ్యాల నియంత్రణ మండలి (ఎన్ సీబీ) నేడు భారీ విజయాన్ని సాధించిందని కేంద్ర హోంసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో కేంద్ర హోంసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈ విధంగా పేర్కొన్నారు. ‘‘మాదక ద్రవ్యాలను రవాణా చేసే ముఠాలపై ప్రభుత్వం కఠిన వైఖరి ప్రదర్శిస్తోంది. డ్రగ్స్ రవాణాలో అంతర్జాతీయ సూత్రధారిగా పేరుగాంచిన స్మగ్లర్ మహమ్మద్ సలీం డోలాను టర్కీ నుంచి తిరిగి తీసుకురావడంలో ఎన్‌సీబీ నేడు కీలక విజయం సాధించింది. మాదకద్రవ్యాల నేర ముఠాలను నిర్దాక్షిణ్యంగా అణచివేసే మోదీ ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా మన మాదకద్రవ్యాల నిరోధక సంస్థలు ప్రపంచవ్యాప్త ఏజెన్సీల పటిష్టమైన వ్యవస్థ  సరిహద్దులు దాటి తమ పట్టును విస్తరించాయి. ఇప్పుడు  డ్రగ్ మాఫియా నాయకులు ఎక్కడ దాక్కున్నా వారికి రక్షణ ఉండదు’’ అని స్పష్టం చేశారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోకేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో సలీం డోలాను విజయవంతంగా దేశానికి తిరిగి తీసుకురావడం... మాదకద్రవ్యాల నేరస్థులనువ్యవస్థీకృత నేర ముఠాల సభ్యులందరినీ చట్టం ముందు నిలబెట్టాలనే ప్రభుత్వ దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తోంది. వీరిని పట్టుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా నిరంతరంగా వేట కొనసాగుతుందని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది.

ఆపరేషన్ గ్లోబల్-హంట్’లో భాగంగా మాదకద్రవ్య నియంత్రణ మండలి అంతర్జాతీయభారతీయ గూఢచార సంస్థలతో సమన్వయం చేసి మాదకద్రవ్యాల రవాణాలో కీలక సూత్రధారిగా పేరొందిన మహ్మద్ సలీమ్ డోలాను టర్కీ నుంచి భారత్‌కు తీసుకువచ్చింది. ఈ ఉదయం ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయానికి చేరుకున్న అతన్ని ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ముంబయికి చెందిన 59 ఏళ్ల సలీం డోలా భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు మార్చి 2024లో జారీ చేసిన ఇంటర్‌పోల్  రెడ్ నోటీసు కిందదేశలోని అనేక మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసుల్లో  ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. గత కొన్నేళ్లుగా దేశ దర్యాప్తు సంస్థల నుంచి తప్పించుకు తిరుగుతున్న డోలా.. మధ్యప్రాచ్యంఆఫ్రికాయూరప్ లోని పలు దేశాల్లో ఒక భారీ అంతర్జాతీయ డ్రగ్ ముఠాను ఏర్పాటు చేశాడు. గత రెండు దశాబ్దాలుగా అతని నేర చరిత్రలో మహారాష్ట్రగుజరాత్ రాష్ట్రాల్లో భారీ ఎత్తున హెరాయిన్చరాస్మెఫెడ్రోన్మాండ్రాక్స్మెథాంఫెటమైన్ వంటి మాదకద్రవ్యాలను పట్టుకున్న కేసుల్లో ఇతనికి నేరుగా సంబంధం ఉంది. దేశంలోని స్థానిక పంపిణీ వ్యవస్థలకు భారీ మొత్తంలో డ్రగ్స్‌ను సరఫరా చేసే వ్యక్తిగా డోలా పాత్ర నిరంతరం బయటపడుతూనే ఉంది. ఇతనిపై గుజరాత్ ఏటీఎస్ముంబై పోలీసులు కూడా కేసులు నమోదు చేశారు. అంతకుముందుఅతని కుమారుడు తాహిల్ సలీమ్ డోలాఇతర సహచరులను 2025లో యూఏఈ నుంచి బహిష్కరించినఅప్పగించిన అనంతరం ముంబై పోలీసులు అరెస్టు చేశారు. టర్కీ అధికారులుఇంటర్‌పోల్భారతీయ ఏజెన్సీల మధ్య ఉన్న సన్నిహిత సహకారంసమన్వయ చర్యలకు ఈ అరెస్టు ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2256258) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Nepali , Punjabi , Gujarati , Kannada