ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నీతి ఆయోగ్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు

प्रविष्टि तिथि: 25 APR 2026 10:46PM by PIB Hyderabad

నీతి ఆయోగ్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారునీతి ఆయోగ్ భారత విధాన రూపకల్పన వ్యవస్థకు మూలస్తంభంగా నిలుస్తుందనీ... సహకార సమాఖ్యవాదాన్ని పెంపొందిస్తూకీలక సంస్కరణలను ముందుకు నడిపిస్తూపౌరుల 'జీవన సౌలభ్యాన్నిమెరుగుపరుస్తోందని ఆయన పేర్కొన్నారుఈ సంస్థ అన్ని రంగాల్లో ఆవిష్కరణలకుదీర్ఘకాలిక వ్యూహాత్మక ఆలోచనలకు ఒక చైతన్యవంతమైన వేదికగా సేవలందిస్తూనే ఉందన్నారు.

నీతి ఆయోగ్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా... ఉపాధ్యక్షులుగా నియమితులైన శ్రీ అశోక్ కుమార్ లాహిరికి ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారుపూర్తికాల సభ్యులుగా నియమితులైన శ్రీ రాజీవ్ గౌబాప్రొఫెసర్ కెవిరాజు, ప్రొఫెసర్ గోబర్ధన్ దాస్, ప్రొఫెసర్ అభయ్ కరండికర్డాక్టర్ ఎంశ్రీనివాస్‌లకు ఆయన అభినందనలు తెలియజేశారు.

ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

నీతి ఆయోగ్ భారత విధాన రూపకల్పన వ్యవస్థకు మూలస్తంభంగా ఉందిఇది సహకార సమాఖ్యవాదాన్ని ప్రోత్సహిస్తూసంస్కరణలను ముందుకు తీసుకువెళుతూపౌరుల 'జీవన సౌలభ్యాన్నిపెంపొందిస్తోందిఅన్ని రంగాల్లో ఆవిష్కరణలకుదీర్ఘకాలిక వ్యూహాత్మక ఆలోచనలకు ఒక చైతన్యవంతమైన వేదికగా నీతి ఆయోగ్ పనిచేస్తోంది.

ప్రభుత్వం నీతి ఆయోగ్‌ను పునర్‌వ్యవస్థీకరించిందిఉపాధ్యక్షులుగా నియమితులైన శ్రీ అశోక్ కుమార్ లాహిరి గారికి నా శుభాకాంక్షలునీతి ఆయోగ్ పూర్తికాల సభ్యులుగా నియమితులైన శ్రీ రాజీవ్ గౌబా గారుప్రొఫెసర్ కెవిరాజు గారుప్రొఫెసర్ గోబర్ధన్ దాస్ గారు, ప్రొఫెసర్ అభయ్ కరండికర్ గారుడాక్టర్ ఎంశ్రీనివాస్ గార్లకు నా శుభాకాంక్షలు.

వీరంతా ఫలవంతంగాప్రభావవంతంగా సేవలందించాలని ఆకాంక్షిస్తున్నాను

***


(रिलीज़ आईडी: 2255723) आगंतुक पटल : 91
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam