వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు


2026 ఏప్రిల్ 20 నుంచి 23 వరకు వాషింగ్టన్ డీసీలో పర్యటించిన భారత ప్రతినిధి వర్గం

నాడు పోస్టు చేయడమైనది: 24 APR 2026 3:12PM by PIB Hyderabad

భారత్అమెరికా 2026 ఫిబ్రవరి 7న ఒక సంయుక్త ప్రకటనను జారీ చేశాయిపరస్పర లాభదాయక వాణిజ్యానికి సంబంధించిన ఒక మధ్యకాలిక ఒప్పంద ప్రణాళికపై ఆ సంయుక్త ప్రకటనలో సమ్మతిని వ్యక్తం చేశాయిఈ ప్రణాళిక విస్తృత భారత్యూఎస్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏసంప్రదింపుల విషయంలో రెండు దేశాల నిబద్ధతను పునరుద్ఘాటించిందిదీని ప్రకారం.. మధ్యకాలిక ఒప్పంద వివరణకు తుది రూపును ఇవ్వడంతో పాటు విస్తృత బీటీఏలో భాగంగా సంప్రదింపులను ముందుకు తీసుకు పోవడానికి యూఎస్‌లో సమాన హోదా కలిగిన వారితో కలిసి ముఖాముఖి సమావేశాల్లో పాల్గొనేందుకు భారతీయ పక్షం వాషింగ్టన్ డీసీని సందర్శించిందిమార్కెట్టు లభ్యతపన్నుయేతర నిర్ణయాలువాణిజ్యంలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులుకస్టమ్స్వాణిజ్య సౌలభ్యంపెట్టుబడులకు ప్రోత్సాహంఆర్థిక భద్రత దిశగా చర్యలుడిజిటల్ మాధ్యమ ప్రధాన వాణిజ్యం వంటి అనేక రంగాలపై చర్చించారుసమావేశాలు ఫలప్రదంగానూసానుకూల వాతావరణంలోనూ సాగాయిఈ సందర్భంగా అర్థవంతంగానూముందుచూపుతోనూ చర్చలు పూర్తి చేశారువీటిలో ప్రధాన అంశాలపై పురోగతి చోటు చేసుకుందిఇరు పక్షాలూ ఇక ముందు కూడా ఇదే వేగాన్ని కొనసాగించాలన్న నిబద్ధతను వ్యక్తం చేశాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2255330) సందర్శకుల సూచీ సంఖ్య : : 23
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Manipuri , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Gujarati , Kannada