సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నిర్దేశిత సంక్షేమ కార్యక్రమాల ద్వారా సమ్మిళిత అభివృద్ధికి, సామాజిక న్యాయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్


2025–26లో 75 లక్షలకు పైగా ఎస్సీ లబ్ధిదారులకు రూ.7,981.47 కోట్ల పంపిణీ.. ముఖ్యమైన స్కాలర్షిప్ పథకాల్లో గణనీయమైన పెరుగుదల

2025–26లో రూ. 223 కోట్ల ఆర్థిక చేయూత

నాడు పోస్టు చేయడమైనది: 24 APR 2026 10:26AM by PIB Hyderabad

షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీలు), వృద్ధులుమద్యపానం మాదకద్రవ్యాల వ్యసనానికి గురైన వారుట్రాన్స్‌జెండర్లుయాచకులువిముక్త సంచార తెగలు (డీఎన్‌టీలు), మాన్యువల్ స్కావెంజర్లుపారిశుద్ధ్య కార్మికులు (చెత్త ఏరుకునే వారు సహా), ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్అభ్యున్నతి కోసం ఉద్దేశించిన వివిధ చట్టాలుసంక్షేమ పథకాల అమలును సామాజిక న్యాయంసాధికారతా శాఖ పర్యవేక్షిస్తుందినిర్దేశిత చర్యలుసంక్షేమ కార్యక్రమాల ద్వారా సమాజంలోని అన్ని వర్గాలకు సమ్మిళిత అభివృద్ధినిసామాజిక న్యాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర సామాజిక న్యాయంసాధికారతా శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అన్నారు.

 

షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల విద్యాసాధికారతపై దృష్టి సారిస్తూ అనేక పథకాలను ఈ శాఖ అమలు చేస్తోంది. 2025-26లో 75 లక్షలకు పైగా ఎస్సీ లబ్ధిదారులకు రూ. 7,981.47 కోట్ల నిధులను పంపిణీ చేసింది.

 

ఎస్సీల కోసం చేపట్టిన సంక్షేమ పథకాల కింద చేసే ఖర్చు స్థిరమైన వృద్ధినిసానుకూల ధోరణిని కనబరుస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. ఎస్సీలుఇతర వర్గాల కోసం ఉద్దేశించిన ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకంలో 21 శాతంఎస్సీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకంలో 11.23 శాతంఎస్సీ విద్యార్థుల కోసం ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకమైన టాప్ క్లాస్ ఎడ్యుకేషన్‌లో 13.5 శాతంనిర్దేశిత ప్రాంతాల్లోని హైస్కూళ్ల విద్యార్థులకు ఆవాస విద్య (శ్రేష్ఠపథకం కింద 16 శాతం వృద్ధిని గమనించవచ్చు.

 

***


(రిలీజ్ ఐడి: 2255274) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Gujarati