ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ గురు తేగ్ బహదూర్ 350వ షహీదీ దివస్ సందర్భంగా ప్రధానమంత్రి నివాళి
నాడు పోస్టు చేయడమైనది:
25 NOV 2025 9:56AM by PIB Hyderabad
శ్రీ గురు తేగ్ బహదూర్ 350వ షహీదీ దివస్ సందర్భంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయన అసాధారణ ధైర్యసాహసాలకు, అత్యున్నత త్యాగానికి నివాళులర్పించారు.
ధర్మం, మానవాళి పరిరక్షణ కోసం గురు తేగ్ బహదూర్ చేసిన ప్రాణత్యాగం మన సమాజాన్ని ఎప్పటికీ ప్రకాశింపజేస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు.
"శ్రీ గురు తేగ్ బహదూర్ 350వ షహీదీ దివస్ సందర్భంగా, ఆయన అసమాన ధైర్యసాహసాలకు, త్యాగానికి మా భక్తిపూర్వక వందనం. ధర్మం, మానవాళి పరిరక్షణ కోసం ఆయన చేసిన ప్రాణత్యాగం మన సమాజాన్ని ఎల్లప్పుడూ ప్రకాశింపజేస్తుంది" అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2254509)
సందర్శకుల సూచీ సంఖ్య : : 22
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam