ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితులకు ప్రధానమంత్రి నివాళులు

प्रविष्टि तिथि: 22 APR 2026 11:07AM by PIB Hyderabad

కిందటి సంవత్సరం ఇదే రోజున పహల్గామ్‌లో జరిగిన భయంకర ఉగ్రవాద దాడిలో ప్రాణాలను కోల్పోయిన అమాయకులకు ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు నివాళులు అర్పించారుబాధితులను ప్రధానమంత్రి స్మరించుకుంటూ వారిని ఎప్పటికీ మరువబోమన్నారుఈ విషాద సమయంలో వారి కుటుంబాల వెన్నంటి నిలవాలన్న దేశ ప్రజల అచంచల నిబద్ధతను ప్రధాని పునరుద్ఘాటించారు.

కష్టకాలంలో భారత్ ఏకతాటి మీద నిలిచిందనీఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకున్న సంకల్పం దృఢతరమైందనీ శ్రీ మోదీ తెలిపారుఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నప్పటికీ భారత్ ఎన్నటికీ తలొగ్గదనీఉగ్రవాదుల కుతంత్రాలు ఎన్నటికీ ఫలించవనీ ఆయన పునరుద్ఘాటించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -

‘‘కిందటేడాదిలో ఇదే రోజున పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో ప్రాణాలను కోల్పోయిన సామాన్యులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నానువారిని మరచిపోవడం ఎన్నటికీ జరగదుఈ నష్టం నుంచి కోలుకొనేందుకు ప్రయత్నిస్తున్న బాధిత కుటుంబాలకు నేను సంతాపాన్ని తెలియజేస్తున్నాను.

ఒక దేశ ప్రజలుగా దుఃఖ సమయంలో దృఢసంకల్పంతో ఒక్కటిగా నిలుద్దాంఉగ్రవాదం ఏ రూపాన్ని ధరించి తెగబడినా సరేదాని ఎదుట భారత్ ఏనాటికీ తల వంచదుఉగ్రవాదుల క్రూర ప్రణాళికలు ఎప్పటికీ సఫలం కానే కావు’’ అని పేర్కొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2254445) आगंतुक पटल : 74
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam