పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పశ్చిమాసియా పరిణామాల దృష్ట్యా కీలక రంగాలలో తాజా సమాచారం


· 2026 మార్చి 23 నుంచి విక్రయమైన 17.25 లక్షలకు పైగా 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు

· పీఎస్‌యూ ఓఎంసీల నుంచి 70 శాతం పెరిగిన ఆటో ఎల్‌పీజీ విక్రయాలు.. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో నమోదైన గణనీయమైన పెరుగుదల

· పీఎన్‌జీ విస్తరణ సంస్కరణలకు అనుగుణంగా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందుతున్న అదనపు వాణిజ్య కేటాయింపులు

· ఎటువంటి రద్దీ లేకుండా దేశవ్యాప్తంగా సాధారణంగానే కొనసాగుతున్న ఓడరేవు కార్యకలాపాలు

· 2,373 మంది భారతీయులు ఇరాన్ నుంచి అర్మేనియా, అజర్‌బైజాన్‌ల మీదుగా స్వదేశానికి సురక్షితంగా చేరుకోవడానికి అవసరమైన సహాయక చర్యలు చేపట్టిన ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం

प्रविष्टि तिथि: 18 APR 2026 5:07PM by PIB Hyderabad

పశ్చిమాసియాలో నెలకొన్న పరిణామాల దృష్ట్యా కీలక రంగాల్లో సంసిద్ధతకార్యకలాపాల కొనసాగింపును నిర్ధారించేందుకు కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో కూడిన చర్యలను చేపట్టింది. ఇంధన సరఫరాసముద్ర మార్గ కార్యకలాపాలుఆ ప్రాంతంలోని భారతీయులకు అందించే సహాయ సహకారాలకు సంబంధించి తీసుకుంటున్న చర్యల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి:

ఇంధన సరఫరాలభ్యత

హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో కొనసాగుతున్న పరిణామాల నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులుఎల్‌పీజీ నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చూడటానికి తీసుకుంటున్న చర్యలను పెట్రోలియం- సహజ వాయువు మంత్రిత్వ శాఖ వివరించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:

ప్రజా సూచనలుపౌర అవగాహన

·  పెట్రోల్డీజిల్ఎల్‌పీజీ లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. కాబట్టి ప్రజలు వీటిని కంగారుతో కొనుగోలు చేయొద్దని సూచించారు.

·  వదంతులను నమ్మొద్దు. సరైన సమాచారం కోసం అధికారిక ఖాతాలపై మాత్రమే ఆధారపడాలి.

·  ఎల్‌పీజీ వినియోగదారులు డిజిటల్ బుకింగ్ ప్లాట్‌ఫా‌మ్‌లను ఉపయోగించాలనిడిస్ట్రిబ్యూటర్ల వద్దకు వెళ్లడం నివారించాలని కోరారు.

·  పీఎన్‌జీఎలక్ట్రిక్ లేదా ఇండక్షన్ కుక్‌టాప్‌ల వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించాల్సిందిగా అందరినీ ప్రోత్సహిస్తున్నారు.

·  ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలందరూ తమ రోజువారీ వినియోగంలో ఇంధనాన్ని ఆదా చేయాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ సన్నద్ధతసరఫరా నిర్వహణ చర్యలు

·  ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య గృహ వినియోగ ఎల్‌పీజీగృహావసరాల పీఎన్‌జీరవాణా సీఎన్‌జీ విషయంలో సరఫరా 100 శాతం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

·  వాణిజ్య ఎల్‌పీజీ విషయంలో ఆసుపత్రులువిద్యా సంస్థలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వీటితో పాటు ఫార్మాఉక్కువాహనాలువిత్తన - వ్యవసాయ రంగాలకు కూడా ప్రాధాన్యత కల్పించారు. వలస కార్మికుల కోసం 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల సరఫరా 2026 మార్చి 2, 3 తేదీల్లో ఉన్న సగటు రోజువారీ సరఫరాతో పోలిస్తే రెట్టింపు అయింది.

·  ప్రభుత్వం ఇప్పటికే సరఫరాడిమాండ్ రెండింటినీ సమన్వయం చేసేలా పలు హేతుబద్ధీకరణ చర్యలను అమలు చేసింది. ఇందులో చమురు శుద్ధి కేంద్రాల ఉత్పత్తిని పెంచడం.. గ్యాస్ బుకింగ్ గడువును పట్టణ ప్రాంతాల్లో 21 నుంచి 25 రోజులకుగ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకు పొడిగించడం.. ప్రాధాన్యత కలిగిన రంగాలకు సరఫరాను నిర్ధారించడం వంటివి ఉన్నాయి.

·  ఎల్‌పీజీ డిమాండ్‌పై ఒత్తిడిని తగ్గించడానికి కిరోసిన్బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను అందుబాటులోకి తెచ్చారు.

·  చిన్నమధ్య తరహా వినియోగదారులకు పంపిణీ చేసేందుకు రాష్ట్రాలకు అదనపు బొగ్గును కేటాయించాలని కోల్ ఇండియాసింగరేణి కాలరీలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

·  గృహవాణిజ్య వినియోగదారులకు కొత్త పీఎన్‌జీ కనెక్షన్లు పొందటాన్ని సులభతరం చేయాలని రాష్ట్రాలకు సూచించారు.

రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలుసంస్థాగత యంత్రాంగాలతో సమన్వయ ప్రయత్నాలు

·  నిత్యావసరాల చట్టం- 1955, ఎల్‌పీజీ నియంత్రణ ఉత్తర్వు- 2000 ప్రకారం పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాను పర్యవేక్షించడానికి.. అక్రమ నిల్వలునల్లబజారు క్రయవిక్రయాలపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది.

·  పెట్రోల్డీజిల్ఎల్‌పీజీ వంటి నిత్యావసరాల సరఫరా పరిస్థితిని పర్యవేక్షించడంనియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వాలుకేంద్రపాలిత ప్రాంతాలు ప్రాథమిక పాత్ర పోషించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు లేఖలువీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా ఇదే విషయాన్ని అన్ని రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలకు మరోసారి స్పష్టం చేసింది.

·  27.03.2026, 02.04.2026 నాటి లేఖల ద్వారా ఇంధనం తగినంతగా అందుబాటులో ఉందన్న భరోసాను ప్రజలకు ఇచ్చేందుకు ముందస్తు ప్రజా సమాచార మార్పిడి అవసరమని కేంద్రం ప్రభుత్వం ప్రధానంగా చెప్పింది. రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలతో క్రమం తప్పకుండా సమీక్షా సమావేశాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. 02.04.2026న పెట్రోలియంసహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి… 06.04.2026న సమాచార - ప్రసారవినియోగదారుల వ్యవహారాల కార్యదర్శులతో కలిసి పెట్రోలియంసహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో కింది అంశాలను ప్రముఖంగా చెప్పారు:

ప్రతిరోజూ మీడియా సమావేశాలు నిర్వహించడంక్రమం తప్పకుండా ప్రజా సూచనలను జారీ చేయడం.

సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ వార్తలుఅవాస్తవ సమాచారాన్ని చురుగ్గా పర్యవేక్షించడంతిప్పికొట్టడం.

జిల్లా యంత్రాంగం ద్వారా ప్రతిరోజూ తనిఖీలను ఉద్ధృతం చేయటంఓఎంసీలతో సమన్వయం చేసుకుంటూ దాడులుతనిఖీలను కొనసాగించడం.

సంబంధిత రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం.

రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా కేటాయించిన కిరోసిన్ (ఎస్‌కేఓ) కోసం కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం.

పీఎన్‌జీ వినియోగంప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం.

ఎల్‌పీజీ సరఫరాలో ముఖ్యంగా గృహ అవసరాల ఎల్‌పీజీ సరఫరాలో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల లక్షిత పంపిణీ విధానాన్ని అనుసరించడం.

·  అక్రమ నిల్వనల్లబజారు క్రయవిక్రయాలను అరికట్టడానికి అన్ని రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలు కంట్రోల్ రూంలుజిల్లా స్థాయి పర్యవేక్షక కమిటీలను ఏర్పాటు చేశాయి.

·  ప్రస్తుతం 24 రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలు క్రమం తప్పకుండా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. పత్రికా ప్రకటనలు కూడా జారీ చేస్తున్నాయి.

అమలుపర్యవేక్షణ చర్యలు

·  ఎల్‌పీజీ అక్రమ నిల్వనల్లబజారు క్రయవిక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా చర్యలు కొనసాగుతున్నాయి. 17.04.2026 నాడు దేశవ్యాప్తంగా 2500 కంటే ఎక్కువ దాడులు నిర్వహించి 750 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. 

·  ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ఆకస్మిక తనిఖీలను మరింత ముమ్మరం చేశాయి. అవి నిన్నటివరకు 263 ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లకు జరిమానాలు విధించటంతో పాటు 67 మంది డీలర్లను సస్పెండ్ చేశాయి.

ఎల్‌పీజీ సరఫరా

గృహావసరాల ఎల్‌పీజీ

·  ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఎల్‌పీజీ సరఫరాపై ప్రభావం కొనసాగుతోంది.

·  గృహ వినియోగదారులకు సంబంధించిన ఎల్‌పీజీ సరఫరాకు అత్యంత ప్రాధాన్యత లభిస్తోంది.

·  ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్‌షిప్‌ల వద్ద ఎక్కడా నిల్వల కొరత ఉన్నట్లు నివేదికలు అందలేదు.

·  నిన్న పరిశ్రమవ్యాప్తంగా ఆన్‌లైన్ ఎల్‌పీజీ బుకింగ్‌లు సుమారు 98 శాతానికి పెరిగాయి.

·  సిలిండర్ల దారి మళ్లింపును అరికట్టడానికి డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ (డీఏసీ) ఆధారిత పంపిణీ విధానాన్ని సుమారు 93 శాతానికి పెంచారు. నమోదు చేసుకున్న ఫోన్‌ నంబర్‌కు డీఏసీ వస్తుంది.

·  గృహావసరాల ఎల్‌పీజీ సిలిండర్ల పంపిణీ సాధారణంగానే కొనసాగుతోంది. 

·  17.04.26న 52 లక్షలకు పైగా గృహావసరాల ఎల్‌పీజీ సిలిండర్లు పంపిణీ అయ్యాయి. 

వాణిజ్య ఎల్‌పీజీ సరఫరాకేటాయింపు చర్యలు

·  మొత్తం వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపులు సంక్షోభానికి ముందు ఉన్న స్థాయిలో సుమారు 70 శాతానికి పెరిగాయి. ఇందులో 10 శాతం సంస్కరణలతో ముడిపడి ఉన్న కేటాయింపులు కూడా ఉన్నాయి.

·  కేంద్ర ప్రభుత్వం 06.04.2026 నాటి లేఖ ద్వారా వలస కార్మికులకు పంపిణీ చేసే 5 కిలోల ఎఫ్‌టీఎల్ (ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ) సిలిండర్ల రోజువారీ పరిమాణాన్ని ప్రతి రాష్ట్రంలోనూ రెట్టింపు చేస్తున్నట్లు తెలియజేసింది. 21.03.2026 నాటి లేఖలో పేర్కొన్న 20 శాతం పరిమితిని మించి 2026 మార్చి 2-3 తేదీల్లో వలస కార్మికులకు సరఫరా చేసిన సగటు సిలిండర్ల సంఖ్య ఆధారంగా ఈ పెంపు ఉంటుంది. ఈ 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉంటాయి. వీటిని చమురు మార్కెటింగ్ కంపెనీల సహకారంతో కేవలం ఆయా రాష్ట్రాల్లోని వలస కార్మికులకు మాత్రమే సరఫరా చేయాల్సి ఉంటుంది.

·  2026 ఏప్రిల్ 3 వరకు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (పీఎస్‌యూ ఓఎంసీ) 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లపై సుమారు 6450 అవగాహన శిబిరాలను నిర్వహించాయి. ఈ శిబిరాల ద్వారా 90,000 కంటే ఎక్కువ 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు విక్రయమయ్యాయి. నిన్న సుమారు 300 శిబిరాల ద్వారా 10,156 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు విక్రయమయ్యాయి. 

·  ఇటీవల 2026 ఏప్రిల్ 17న ఆల్వార్‌లోని భివాడిలో ఐఓసీఎల్ నిర్వహించిన 5 కేజీల ఎఫ్‌టీఎల్ అవగాహన శిబిరాలలో ఒకదానికి మంచి స్పందన లభించింది. ఆ శిబిరంలో 600కు పైగా 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు అమ్ముడయ్యాయి.

·  2026 మార్చి 23 నుంచి ఇప్పటివరకు 17.25 లక్షలకు పైగా 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు విక్రయమయ్యాయి. 

·  వాణిజ్య ఎల్‌పీజీ పంపిణీని ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి ఐఓసీఎల్హెచ్‌పీసీఎల్బీపీసీఎల్ సంస్థల కార్యనిర్వహక డైరెక్టర్లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులుపరిశ్రమల విభాగాలతో సమన్వయం చేసుకుంటోంది. 

·  17.04.2026న 8,216 మెట్రిక్ టన్నుల వాణిజ్య ఎల్‌పీజీ (4.32 లక్షలకు పైగా - 19 కేజీల సిలిండర్లకు సమానం) విక్రయమైంది. 

·  2026 మార్చి 14 నుంచి మొత్తం 1,58,583 మెట్రిక్ టన్నుల వాణిజ్య ఎల్‌పీజీ (83.46 లక్షలకు పైగా - 19 కేజీల ఎల్పీజీ సిలిండర్లకు సమానం) విక్రయమైంది. ఇందులో 9,200 మెట్రిక్ టన్నులకు పైగా ఆటో ఎల్‌పీజీ కూడా ఉంది.

·  2026 ఏప్రిల్ నెలలో (17.04.26 వరకు) పీఎస్‌యూ ఓఎంసీల ద్వారా రోజువారీ సగటు ఆటో ఎల్‌పీజీ విక్రయాలు సుమారు 301 మెట్రిక్ టన్నులుగా నమోదయ్యాయి. 2026 ఫిబ్రవరి నాటి రోజువారీ సగటు 177 మెట్రిక్ టన్నులతో పోలిస్తే ఈ విషయంలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. 

·  ఆటో ఎల్‌పీజీ విక్రయాలు ప్రైవేట్ సంస్థల నుంచి ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) చమురు సంస్థలకు మారిన ధోరణి కనిపిస్తోంది. పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకోవడానికి పీఎస్‌యూ సంస్థల ఆటో ఎల్‌పీజీ విక్రయాలు 70 శాతం పెరిగాయి. ప్రధానంగా తెలంగాణకర్ణాటకతమిళనాడురాజస్థాన్పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఈ భారీ వృద్ధి కనిపించింది.

·         సహజ వాయువు సరఫరాపీఎన్‌జీ విస్తరణ కార్యక్రమాలు

·         ·       ప్రాధాన్యత రంగాలకు గ్యాస్ సరఫరాను ప్రభుత్వం కొనసాగిస్తోంది.  దేశీయ గృహ అవసరాల పీఎన్‌జీసీఎన్‌జీ రవాణా రంగానికి 100 శాతం సరఫరాను రక్షిత ప్రాతిపదికన అందిస్తోంది.

·         ·       ఎరువుల కర్మాగారాలకు ఇచ్చే మొత్తం గ్యాస్ కేటాయింపులనువాటి గత ఆరు నెలల సగటు వినియోగంలో సుమారు 95 శాతానికి పెంచారు.

·         ·       దీంతో పాటు సీజీడీ వ్యవస్థల ద్వారా అందే సరఫరాలతో సహాఇతర పారిశ్రామికవాణిజ్య రంగాలకు గ్యాస్ సరఫరాను 80 శాతం వరకు పెంచారు.

·         ·       వాణిజ్య ఎల్‌పీజీ లభ్యతపై నెలకొన్నఆందోళనలను తొలగించేందుకు హోటళ్లురెస్టారెంట్లుక్యాంటీన్లకు పీఎన్‌జీ కనెక్షన్లు ప్రాధాన్యత క్రమంలో ఇవ్వాలని సీజీడీ సంస్థలను ఆదేశించారు.

·         ·       గృహవాణిజ్య పీఎన్‌జీ కనెక్షన్లను పెంచేందుకు ఐజీఎల్‌ఎంజీఎల్‌జీఏఐఎల్ గ్యాస్‌బీపీసీఎల్‌ వంటి కంపెనీలు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి.

·         ·       సీజీడీ నెట్‌వర్క్ విస్తరణకు అవసరమైన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని అన్ని రాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలుకేంద్ర మంత్రిత్వ శాఖలను భారత ప్రభుత్వం కోరింది.

·         ·       ఎల్‌పీజీ నుంచి పీఎన్ జీకి దీర్ఘకాలిక మార్పునకు సహకరించిన రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలకు అందించే వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపులో 10 శాతం అదనంగా ఇవ్వనున్నట్లు 18 మార్చి 2026 నాటి లేఖ ద్వారా భారత ప్రభుత్వం ప్రకటించింది.

·         ·       22 రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే పీఎన్‌జీ విస్తరణ సంస్కరణలకు అనుసంధానంగా అదనపు వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపును పొందుతున్నాయి.

·         ·       కేంద్ర రోడ్డు రవాణారహదారుల మంత్రిత్వ శాఖ 24.03.26 తేదీన జారీ చేసిన లేఖ ద్వారా సీజీడీ మౌలిక సదుపాయాల కోసం వేగవంతమైన ఆమోద ప్రక్రియను అమలులోకి తెచ్చింది. ఇందులో భాగంగా సీజీడీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన దరఖాస్తులను ప్రాధాన్యతా పాతిపదికన పరిశీలించడానికి మూడు నెలలపాటు త్వరిత ఆమోద విధానాన్ని అమలు చేయనున్నారు.

·         ·       నిత్యావసర వస్తువుల చట్టం 1955 కింద సహజ వాయువుపెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్‌లైన్లుఇతర సదుపాయాల నిర్మాణంనిర్వహణవిస్తరణ ద్వారా) ఉత్తర్వు 2026ను భారత ప్రభుత్వం 24 మార్చి 2026 నాటి గెజిట్ ద్వారా నోటిఫై చేసింది. ఈ ఉత్తర్వు దేశవ్యాప్తంగా పైప్‌లైన్ల నిర్మాణంవిస్తరణ కోసం ఒక సరళీకృతసమయపాలనతో కూడిన విధానాన్ని అందిస్తుంది. ఇది భూసేకరణఅనుమతుల్లో ఎదురయ్యే జాప్యాన్ని నివారిస్తూనివాస ప్రాంతాలతో సహా అన్ని చోట్లా సహజ వాయువు మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధికి తోడ్పడుతుంది. దీనివల్ల పీఎన్ జీ వ్యవస్థ అభివృద్ధి వేగవంతం అవ్వడమే కాకుండా.. మారుమూల ప్రాంతాలకు కూడా అనుసంధానం పెరుగుతుంది. ఇది స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తూభారత ఇంధన భద్రతనుగ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.

·         ·       పీఎన్‌జీ విస్తరణలో వేగాన్ని కొనసాగించడానికి  జాతీయ పీఎన్‌జీ కార్యక్రమం 2.0ను పెట్రోలియంసహజ వాయువు నియంత్రణ మండలి 30 జూన్ 2026 వరకు పొడిగించింది.

·         ·       పర్యావరణానికి మేలు చేసేసురక్షితమైనస్వయం సమృద్ధి కలిగిన ఇంధన వనరులను పెంచడానికి భారత ప్రభుత్వం రాష్ట్రాల కోసం ఒక నమూనా సీబీజీ విధాన ముసాయిదాను తయారు చేసింది. ఈ నమూనా విధానం రాష్ట్రాలు తమ సొంతంగా పెట్టుబడిదారులకు అనుకూలమైన పద్ధతులను రూపొందించుకోవడానికి ఇది ఒక మార్గదర్శిగా పనిచేస్తుంది. ఏ రాష్ట్రాలైతే ఈ విధానాన్ని అమలు చేస్తాయోవాటికి అదనపు వాణిజ్య ఎల్‌పీజీ కోటాను కేటాయించడంలో ప్రాధాన్యత ఇస్తారు.

·         ·       పర్యావరణ మంత్రిత్వ శాఖ 07.04.2026 నాటి ఉత్తర్వుల ద్వారా సీజీడీ వ్యవస్థమౌలిక సదుపాయాల స్థాపనకు లేదా నిర్వహణకు కేవలం 15 రోజుల్లోనే అనుమతి మంజూరు చేయాలని ఎస్‌పీసీబీపీసీసీలకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిని ఆదేశించింది.

·         ·       సీపీసీబీ ఆదేశాల ప్రకారం కొన్ని రకాల చమురుగ్యాస్ రవాణా పైప్‌లైన్‌లు ‘‘గ్రీన్‌’’ కేటగిరీ కింద వర్గీకరించారు.

·         ·       మోటారు వాహనాల సర్వీసింగ్రిపేరింగ్పెయింటింగ్ పనులు లేని ఇంధన విక్రయ కేంద్రాలను పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇప్పటికే “వైట్’’ కేటగిరీగా వర్గీకరించింది. వీటికి సంబంధిత చట్టాల ప్రకారం స్థాపనకు లేదా నిర్వహణకు అనుమతి నుంచి మినహాయింపు ఇచ్చింది.

·         ·       మార్చి 2026 నుంచి ఇప్పటివరకు సుమారు 4.76 లక్షల పీఎన్‌జీ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా మొదలైంది. సుమారు 5.33 లక్షల అదనపు వినియోగదారులు కొత్త కనెక్షన్ల కోసం పేరు నమోదు చేసుకున్నారు.

·         ·       17.04.2026 తేదీ వరకు 37,500 కంటే ఎక్కువ మంది పీఎన్‌జీ వినియోగదారులు MYPNGD.in వెబ్‌సైట్ ద్వారా తమ ఎల్‌పీజీ కనెక్షన్లను వదులుకున్నారు.

·         ముడి చమురు లభ్యత/ రిఫైనరీ కార్యకలాపాలు

·         ·       అన్ని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. తగినంత ముడి చమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. దేశంలో పెట్రోల్డీజిలు నిల్వలు సరిపడా ఉన్నాయి.

·         ·       దేశీయ వినియోగానికి మద్దతుగా రిఫైనరీల నుంచి ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచారు.

·         ·       దేశీయ మార్కెట్‌కు అవసరమైన పెట్రోకెమికల్ ముడిసరుకు సరఫరా నిరంతరాయంగా అందేలా చూడటం కోసం వివిధ మంత్రిత్వ శాఖలతో కూడిన ఒక సంయుక్త కార్యవర్గాన్ని  ఏర్పాటు చేసింది. దీనిని అనుసరిస్తూ భారత ప్రభుత్వం 01.04.2026 నాటి ఉత్తర్వుల ద్వారా.. దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలుపెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లు తమ వద్ద ఉండే సీ3, సీగ్యాస్ నిల్వలను నిర్ణీత పరిమాణంలో కొన్ని ముఖ్యమైన రంగాలకు అందించాలని అనుమతించింది.

·         ·       ఔషధ విభాగంరసాయనాలు,పెట్రో కెమికల్స్ విభాగంపరిశ్రమల ప్రోత్సాహంఅంతర్గత వాణిజ్య విభాగం నుంచి అందిన అభ్యర్థనల మేరకు.. ఔషధరసాయన రంగ కంపెనీల కోసం ఎల్‌పీజీ పూల్ నుంచి రోజుకు 1000 మెట్రిక్ టన్నులను కేటాయించారు.

·         ·       ఏప్రిల్ 2026 నుంచి సుమారు 3200 మెట్రిక్ టన్నుల ప్రొపైలిన్ విక్రయించారు.

·         రిటైల్ ఇంధన లభ్యతధరల నియంత్రణ చర్యలు

·         ·       దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోలు బంకులు యథావిధిగా నడుస్తున్నాయి.

·         ·       మధ్యప్రాచ్యం సంక్షోభం వల్ల ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. అయినప్పటికీ సామాన్యులపై భారం పడకుండా ఉండేందుకు భారత ప్రభుత్వం పెట్రోలుడీజిలు పైన ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 10 తగ్గించింది.

·         ·       దేశీయ మార్కెట్‌లో పెట్రోలియం ఉత్పత్తుల లభ్యతను నిర్ధారించడానికి భారత ప్రభుత్వం 11.04.2026 నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా డీజిలు‌పై లీటరుకు రూ. 55.50,  విమాన ఇంధనంపై లీటరుకు రూ. 42 ఎగుమతి సుంకాన్ని పెంచింది.

·         ·       పెట్రోలుడీజిటు సాధారణ రిటైల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ కంపెనీల రిటైల్‌ అవుట్‌లెట్లలో వాటి ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి.

·         కిరోసిన్‌ లభ్యతపంపిణీ చర్యలు

·         ·       సాధారణ కేటాయింపులకు అదనంగా అన్ని రాష్ట్రాలకూకేంద్రపాలిత ప్రాంతాలకూ   48,000 కిలో లీటర్ల కిరోసిన్‌ను కేటాయించారు.

·         ·       18 రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలు కిరోసిన్ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేశాయి. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లడఖ్ ప్రాంతాలు తమకు కిరోసిన్ అవసరం లేదని తెలియజేశాయి.

·         సముద్ర భద్రతనౌకా రవాణా కార్యకలాపాలు

·         ఈ ప్రాంతంలో పనిచేస్తున్న భారతీయ నౌకలునావికులను సురక్షితంగా ఉంచడానికి ఓడరేవులునౌకా రవాణాజలమార్గాల మంత్రిత్వ శాఖ అవసరమైన చర్యలు చేపట్టింది. మంత్రిత్వ శాఖ ఈ కింది విషయాలను పేర్కొంది.

·         ·       నావికుల సంక్షేమంనిరంతరాయ సముద్ర కార్యకలాపాలను నిర్ధారించడానికివిదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖభారత రాయబార కార్యాలయాలుసముద్ర రంగ భాగస్వాములతో మంత్రిత్వ శాఖ సమన్వయం కొనసాగిస్తోంది.

·         ·       ఆ ప్రాంతంలోని భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారు. గత 24 గంటల్లో భారతీయ జెండా ఉన్న నౌకలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు.

·         ·       షిప్పింగ్ కంట్రోల్ రూమ్ 24x7 పనిచేస్తూనే ఉంది. ప్రారంభమైనప్పటి నుంచి 6,827 కాల్స్ , 14,266 కంటే ఎక్కువ ఈమెయిళ్లను స్వీకరించి పరిష్కరించింది.. గత 24 గంటల్లో 100 కాల్స్, 279 ఈమెయిళ్లు అందాయి.

·         ·       డీజీ షిప్పింగ్ ద్వారా గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుంచి గత 24 గంటల్లో 34 మందితో సహా… ఇప్పటివరకు 2,487 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించడంలో మంత్రిత్వ శాఖ సహాయపడింది.

·         ·        దేశవ్యాప్తంగా ఓడరేవు కార్యకలాపాలు సాధారణంగా కొనసాగుతున్నాయి. ఎటువంటి రద్దీ నమోదు కాలేదు.

·         యుద్ధ ‍ప్రభావ ప్రాంతంలో భారత పౌరుల భద్రత

·         గల్ఫ్,  పశ్చిమాసియా ప్రాంతంలోని పరిణామాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఈ ప్రాంతంలోని భారతీయుల భద్రతరక్షణసంక్షేమాన్ని నిర్ధారించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసిన వివరాల ప్రకారం..

     ·       భారతీయ రాయబార కార్యాలయాలుపోస్టులు 24x7 హెల్ప్‌లైన్లను నిర్వహిస్తున్నాయి. స్థానిక ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ.. భారతీయ పౌరులకు సహాయం అందిస్తున్నాయి.

     ·       స్థానిక ప్రభుత్వ మార్గదర్శకాలువిమాన ప్రయాణ పరిస్థితులుకాన్సులర్ సేవలకు సంబంధించిన సమాచారంతో కూడిన తాజా సూచనలను క్రమం తప్పకుండా జారీ చేస్తున్నారు.

    ·       ఈ ప్రాంతంలోని వివిధ సంఘాలుసంస్థలువృత్తిపరమైన బృందాలుభారతీయ కంపెనీలుఇతర భాగస్వాములతో సహా భారతీయ సమాజంతో భారత రాయబార కార్యాలయాలు   చురుగ్గా నిమగ్నమై ఉన్నాయి.

    ·       ఆ ప్రాంతంలోని నౌకల్లో ఉన్న భారతీయ సిబ్బందికి రాయబార కార్యాలయాలు పూర్తి సహాయాన్ని అందిస్తున్నాయి. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకోవడంకాన్సులర్ సాయం అందించడంవారు భారత్‌కు తిరిగి వచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడం వంటివి చేస్తున్నారు.

   ·       గగనతలం తెరిచి ఉన్న దేశాల నుంచి విమాన సర్వీసులు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతం నుంచి భారత్‌కు సుమారు  మంది ప్రయాణికులు చేరుకున్నారు.

   ·       యూఏఈలో భద్రతాకార్యాచరణ కారణాల దృష్ట్యా విమానయాన సంస్థలు యూఏఈ- భారత్ మధ్య పరిమిత సంఖ్యలో షెడ్యూల్‌ చేయని వాణిజ్య విమానాలను నడుపుతున్నాయి. ఈ రోజు యూఏఈ-భారత్‌ మధ్య సుమారు 110 విమానాలు నడుస్తాయని అంచనా.

     ·       సౌదీ అరేబియాఒమన్‌లోని వివిధ విమానాశ్రయాల నుంచి భారత్‌లోకి గమ్యస్థానాలకు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి.

     ·       ఖతార్ గగనతలం పాక్షికంగా తెరిచి ఉండటంతో ఖతార్ ఎయిర్‌వేస్ నేడు భారత్‌కు సుమారు 10 నుంచి 11 విమానాలను నడపనుంది.

      ·       కువైట్ గగనతలం ఇంకా మూసివేసి ఉంది. జజీరా ఎయిర్‌వేస్కువైట్ ఎయిర్‌వేస్ సౌదీ అరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయం నుంచి భారత్‌కు షెడ్యూల్‌ చేయని వాణిజ్య విమానాలను నడుపుతున్నాయి.

     ·       బహ్రెయిన్ గగనతలం తెరుచుకుంది. గల్ఫ్ త్వరలో బహ్రెయిన్ నుంచి భారత్‌కు పరిమిత విమాన సేవలను ప్రారంభించాలని యోచిస్తోంది. ప్రస్తుతం సౌదీ అరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయం నుంచి షెడ్యూల్‌ చేయని విమానాలను నడుపుతోంది.

    ·       భారత్‌కు తిరిగి వెళ్లేందుకుఈ ప్రాంతంలోని ఇతర గమ్యస్థానాలకు పరిమిత విమాన సర్వీసులతో ఇరాక్ గగనతలం ప్రస్తుతం తెరిచి ఉంది.

    ·       టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఇప్పటివరకు 2,373 మంది భారతీయ పౌరులను ఇరాన్ నుంచి ఆర్మేనియాఅజర్‌బైజాన్ మీదుగా భారత్‌కు పంపింది. వీరిలో 1041         మంది భారతీయ విద్యార్థులు, 657 మంది భారతీయ మత్స్యకారులు ఉన్నారు.

   ·        ఇజ్రాయెల్ గగనతలం పరిమిత విమాన కార్యకలాపాలతో పాక్షికంగా తెరిచి ఉంది. ఇజ్రాయెల్ నుంచి జోర్డాన్ఈజిప్టు మీదుగా భారత పౌరుల ప్రయాణం కొనసాగుతోంది.


(रिलीज़ आईडी: 2254426) आगंतुक पटल : 44
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam