ప్రధాన మంత్రి కార్యాలయం
రాజ్యాంగ దినోత్సవం నాడు పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ గర్వకారణమన్న ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
26 NOV 2025 10:50PM by PIB Hyderabad
రాజ్యాంగ దినోత్సవం నాడు పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో గర్వంగా ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ఈ చరిత్రాత్మక ఘట్టం డాక్టర్ అంబేద్కర్‌కు సముచిత నివాళి అని, భారత రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ఆయన కృషి చిరస్మరణీయమవుతుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. డాక్టర్ అంబేద్కర్ భావాలు, ఆదర్శాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అసంఖ్యాక ప్రజల్లో ఉత్తేజాన్ని, ఆశలను నింపుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
“ఈ రోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం గర్వించదగ్గ విషయం. డాక్టర్ అంబేద్కర్‌కు ఇది సముచిత నివాళి. మన రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ఆయన కృషి చిరస్మరణీయమవుతుంది. ఆయన భావాలు, ఆదర్శాలు అసంఖ్యాక ప్రజల్లో ఉత్తేజాన్ని, ఆశలను నింపుతున్నాయి.
@UNESCO
@IndiaatUNESCO”
(రిలీజ్ ఐడి: 2254292)
సందర్శకుల సూచీ సంఖ్య : : 28
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam