భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

శాసనసభల సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలు - 2026 డ్రై-డే అమలు

నాడు పోస్టు చేయడమైనది: 20 APR 2026 3:02PM by PIB Hyderabad

అస్సాంకేరళపుదుచ్చేరితమిళనాడుపశ్చిమ బెంగాల్ రాష్ట్రాల శాసనసభలకు సాధారణ ఎన్నికలుఆరు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) 2026 మార్చి 15న షెడ్యూల్ ప్రకటించింది.

తమిళనాడుపశ్చిమ బెంగాల్ (మొదటి దశఎన్నికలు 2026 ఏప్రిల్ 23 (గురువారం)న జరుగుతాయిపశ్చిమ బెంగాల్ (రెండో దశఎన్నికలు 2026 ఏప్రిల్ 29 (బుధవారం)న జరుగుతాయిఎన్నికలు జరిగిన అన్ని రాష్ట్రాలూకేంద్రపాలిత ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు 2026 మే 4 (సోమవారం)న జరుగుతుంది.

 

ప్రజా ప్రాతినిధ్య చట్టం - 1951లోని 135సీ సెక్షన్ ప్రకారం ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పోలింగ్ ముగిసే వరకు 48 గంటల పాటు మద్యం అమ్మకాలపై నిషేధం ఉంటుందిపోలింగ్ జరిగే ప్రాంతాల్లోని హోటల్భోజన శాలలుమద్యం అమ్మే దుకాణాలుమరే ఇతర ప్రభుత్వప్రైవేటు ప్రదేశాల్లో అయినా.. మద్యంపులియబెట్టిన లేదా మత్తు కలిగించే లిక్కర్ లేదా ఎలాంటి ఇతర మత్తు పదార్థాల అమ్మకాలు లేదా పంపిణీ చేయకూడదు.

 

పైన పేర్కొన్న చట్టం ప్రకారం.. శాసనసభ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో వర్తించే నిబంధలనకు అనుగుణంగా పోలింగ్ పూర్తయ్యే వరకు 48 గంటల పాటు డ్రై డేగా ప్రకటించాలిఒకవేళ ఏదైనా రీ-పోల్ చేయాల్సి వస్తేఆ తేదీకి కూడా ఇది వర్తిస్తుంది.

 

ఓట్ల లెక్కింపు జరిగే రోజైన 2026 మే 4 (సోమవారం)న కూడా ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో వర్తించే నిబంధనల ప్రకారం డ్రై డేగా ప్రకటించాలని కమిషన్ ఆదేశించింది.

 

మద్యం దుకాణాలురెస్టారెంట్లుక్లబ్బులతో సహా మద్యం అమ్మే లేదా అందించే ఏ ఇతర సంస్థలైనా పైన పేర్కొన్న తేదీల్లో మద్యాన్ని ఎవరికైనా అమ్మడానికి లేదా అందించడానికి అనుమతి లేదు.

నాన్-ప్రొప్రయిటరీ క్లబ్బులుస్టార్ హోటళ్లురెస్టారెంట్లుమద్యం నిల్వ చేయడానికిసరఫరాలకు వివిధ విభాగాల పరిధిలో లైసెన్సులు కలిగి ఉన్న హోటళ్లకు ఈ రోజుల్లో అమ్మకాలు సాగించడానికి అనుమతి లేదు.

పైన పేర్కొన్న కాల వ్యవధిలో వ్యక్తులు మద్యం నిల్వ చేసుకోవడాన్ని అరికట్టాలిలైసెన్సు లేని ప్రదేశాల్లో మద్యం నిల్వ చేయడంపై నియంత్రణలను పటిష్టంగా అమలు చేయాలి.

 

***


(రిలీజ్ ఐడి: 2253785) సందర్శకుల సూచీ సంఖ్య : : 417
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Assamese , Manipuri , Gujarati , Tamil , Kannada