ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వ్యవసాయానికీ, రైతులకీ ఉన్న ప్రాధాన్యాన్ని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 20 APR 2026 8:36AM by PIB Hyderabad

మన సమృద్ధికి పునాది వ్యవసాయమనీరైతు సోదరీసోదరులు దేశ ప్రజలకు అన్నదాతలనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారువారి కఠోర శ్రమఅంకిత భావం.. దేశం పురోగమన పథంలో ముందుకు సాగేటట్లు చూస్తున్నాయని ఆయన అన్నారు.

ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు:

‘‘కృషిర్ధన్యా కృషిర్మేధ్యా జన్తూనాం జీవనం కృషిః:

అన్నదః సర్వదశ్చైవ తస్మాచ్ఛ్రేష్ఠతరో హిసః’’

సంపదకు మూలం వ్యవసాయంమేధను పవిత్రీకరించేదే కాకుండా ప్రాణులన్నింటికీ మూలాధారం అని ఈ సుభాషితం.. మనకు చెబుతోందిపంటలను పండించిప్రపంచానికి ఆహారధాన్యాలను అందిస్తున్నారు రైతులునిజానికిప్రతి ఒక్కరికీ కావలసిన ప్రతి దానినీ ఇస్తోంది రైతులేఆహారం కాకుండామరే ఇతర దానం చేసినాలేదా వస్తు సామగ్రిని సమకూర్చినా ఎలాంటి పరమార్థం అందదుఇందువల్లసేద్యం చేస్తున్న రైతులే మిగతా అందరి కన్న ఉన్నతులని మనకు ఈ సూక్తి బోధిస్తోంది.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా రాశారు:

‘‘మన సమృద్ధికి పునాది వ్యవసాయంమరిమన రైతు సోదరీ-సోదరులే దేశానికి అన్నదాతలువారి పరిశ్రమఅంకితభావాలు దేశ పురోగతిని నిర్ధారిస్తున్నాయి.

కృషిర్ధన్యా కృషిర్మేధ్యా జన్తూనాం జీవనం కృషిః

అన్నదః సర్వదశ్చైవ తస్మాచ్ఛ్రేష్ఠతరో హిసః

 

***


(रिलीज़ आईडी: 2253669) आगंतुक पटल : 64
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Bengali-TR , Manipuri , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam