ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రముఖ రచయిత, జ్ఞాని, మేధావి శ్రీ బల్బీర్ పుంజ్ మృతికి ప్రధాని నివాళి

నాడు పోస్టు చేయడమైనది: 19 APR 2026 12:08AM by PIB Hyderabad

ప్రముఖ రచయితజ్ఞానిమేధావి శ్రీ బల్బీర్ పుంజ్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

శ్రీ బల్బీర్ పుంజ్ పాత్రికేయ ప్రపంచానికి గొప్ప సేవలు అందించిన ప్రముఖ రచయితజ్ఞానిమేధావి అని శ్రీ మోదీ కొనియాడారుఆయన రచనలు విస్తృత ప్రాచుర్యాన్ని పొందాయనిజాతీయ పునరుజ్జీవనం దిశగా ఆయనకున్న అభిరుచిని ప్రతిబింబిస్తాయన్నారుపార్లమెంటులో శ్రీ పుంజ్ ప్రసంగాలు వాస్తవాలతోసిద్ధాంతంతో కూడుకొని ఉండేవన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘శ్రీ బల్బీర్ పుంజ్ ప్రముఖ రచయితజ్ఞానిమేధావిపాత్రికేయ ప్రపంచానికి గొప్ప సేవలను అందించారుఆయన రచనలు విస్తృత ప్రాచుర్యాన్ని పొందాయిజాతీయ పునరుజ్జీవనం పట్ల ఆయనకున్న బలమైన అభిరుచిని ప్రతిబింబిస్తాయిపార్లమెంటులో ఆయన ప్రసంగాలు వాస్తవాలుసిద్ధాంతంతో కూడుకొని ఉండేవి.

ప్రధానంగా విద్యార్థులునిపుణులువిద్యావేత్తలుమేధావుల్లో బీజేపీని బలోపేతం చేయడానికి శ్రీ బల్బీర్ పుంజ్ అవిశ్రాంతంగా కృషి చేశారుగుజరాత్‌తో సహా వివిధ రాష్ట్రాలకు ఆయన ఇన్‌ఛార్జిగా పనిచేశారుఆనాటి మా చర్చలను ఆత్మీయంగా స్మరించుకుంటున్నానుఆయన మరణం దిగ్భ్రాంతి కలిగించిందిఆయన కుటుంబానికిస్నేహితులకు నా సానుభూతి తెలియజేస్తున్నానుఓం శాంతి.’’

***


(రిలీజ్ ఐడి: 2253461) సందర్శకుల సూచీ సంఖ్య : : 27